Podarillu Today మే 8 ఎపిసోడ్ : ఆదిని లాగిపెట్టి కొట్టిన కేవశ.. వీగిన మందు బంధం.. తిట్టుకున్న నారాయణ, ప్రతాప్

 Podarillu Today మే 8 ఎపిసోడ్ : ఆదిని లాగిపెట్టి కొట్టిన కేవశ.. వీగిన మందు బంధం.. తిట్టుకున్న నారాయణ, ప్రతాప్

Podarillu Today మే 8 ఎపిసోడ్ : ఆదిని లాగిపెట్టి కొట్టిన కేవశ.. వీగిన మందు బంధం.. తిట్టుకున్న నారాయణ, ప్రతాప్

Podarillu Serial 2026 May 8th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్ సీన్స్ వచ్చాయి. ప్రతాప్, నారాయణ గ్లాస్ మేట్స్‌లా చాలానే కలిసిపోయారు. కానీ అసలు విషయం నేటి ఎపిసోడ్‌లో బయట పడుతుంది. దీంతో నారాయణ, ప్రతాప్‌లు తమ బిడ్డల గురించి ఒకరినొకరు మాటలు అనుకుంటూ ఉంటారు. ఇక మహాని నవ్వించేందుకు క్యాంప్ ఫైర్ ఆట ఆడతారు. అది చూసి ప్రతాప్, ఆదిలకు కడుపు మండిపోతుంది. ఇక రేపటి ఎసిసోడ్‌లో మరింతగా గొడవలు ముదిరేట్టు కనిపిస్తోంది.

పొదరిల్లు టుడే ఎపిసోడ్
పొదరిల్లు టుడే ఎపిసోడ్
నారాయణ, ప్రతాప్ కలిసి మళ్లీ మందు కొడుతుంటారు. తన కూతురు కనిపించిందని, మళ్లీ బాధను, గాయాన్ని గుర్తు చేసిందని ప్రతాప్ అంటాడు. నాకు చుట్ట ఇచ్చి చుట్టరికం అన్నారు.. మీది రక్తం ఇచ్చిన బంధం కదా? క్షమించొచ్చు కదా? అని నారాయణ అంటాడు. అవన్నీ వదిలేయండి అని ఇద్దరూ కలిసి తాగేస్తుంటాడు. ఇక ఇంతలో మనం ఒక ఫోటో దిగుదామా? అని నారాయణ అడుగుతాడు. ఆ దిగిన ఫోటోని తన కోడలికి పంపమని నారాయణ చెబుతాడు. దీంతో అది మహా నంబర్ అని తెలీకుండానే ప్రతాప్ ఆ ఫోటోని పంపుతాడు. డిన్నర్‌కి వెళ్దామా? అని మహా అడుగుతుంది. కానీ మీ నాన్న ఎక్కడ? తీసుకు రండి అని అంటాడు. ఇంతలో మహా తన ఫోన్ చెక్ చేసుకుంటుంది. నాన్నా, నారాయణ కలిసి ఉన్న ఫోటోని చూసి మహా షాక్ అవుతుంది. మీ నాన్న, మా నాన్న కలిసి ఉన్న ఫోటో అని చక్రికి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నిజం తెలీకుండా ఇద్దరూ కలిసి మందు తాగుతున్నట్టున్నారు.. నిజం తెలిస్తే కొంపలంటుకుంటాయ్ అని మహా అంటుంది. నారాయణని తీసుకు రావడానికి కన్నా, కేశవ, పెద్ది వెళ్తారు.

ఆది ఆగ్రహం..

ఆది ఆగ్రహం..
మహాని రిసార్ట్ నుంచి వెళ్లగొట్టు అని తన ఫ్రెండ్‌ని ఆది అంటాడు. ఇది నా ఒక్కడి రిసార్ట్ కాదురా.. ఈ ఒక్క విషయంలో నేను హెల్ప్ చేయలేను.. లీగల్‌గా వచ్చారు.. ఇల్లీగల్‌గా పంపలేను.. అని ఆది ఫ్రెండ్ అంటాడు. అటు నుంచి వెళ్తున్న పెద్ది, కేశవ, కన్నాలను చూపిస్తూ ఇలాంటి లో క్లాస్ వెదవలతో ఉండలేం అని ఆది అంటాడు. మాటలు జాగ్రత్తగా రానివ్వు అని కేశవ వార్నింగ్ ఇస్తారు. ఏరా మీరు లో క్లాస్ కాకపోతే హై క్లాసా? అని అంటాడు ఆది. మా చెల్లి మీ వాడి ట్రాప్‌లో పడకుండా ఉంటే మీ అందరినీ ఎప్పుడో చంపేసేవాడ్ని అని ఆది అంటాడు.

ఆదిని కొట్టిన కేశవ..
ఆదిని కొట్టిన కేశవ..

ఆదిని కొట్టిన కేశవ..
నువ్వేంట్రా చంపేది.. నువ్వు మా నాన్నని పొడిచినప్పుడే నిన్ను చంపేవాడ్ని.. కానీ మా వదిన మొహం చూసి ఆగిపోయా.. అని కేశవ కౌంటర్ ఇస్తాడు. రేయ్ కేశవ గొడవలు వద్దురా అని పెద్ది సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. మహాని దిక్కుమాలింది అని ఆది అనడంతో కేశవకి కోపం వస్తుంది. దీంతో ఆదిని లాగి పెట్టి కొడతాడు. ఇక అక్కడ పెద్ద గొడవ జరుగుతుంటుంది. వీళ్లింకా రావడం లేదేంటి? ఏదైనా గొడవ జరుగుతుందేమో అని చక్రి, మహాలు కూడా వెళ్తుంటారు. మా పిచ్చోడు, మీ కేశవ కొట్టుకుంటున్నారు అని చక్రికి చెబుతూ కంగారు పడుతూ వచ్చేస్తుంది మహా.

పిచ్చి పట్టిందా?

పిచ్చి పట్టిందా?
ఏరా నీకు పిచ్చి పట్టిందా? అని ఆదిని మహా కడిగి పారేస్తుంది. నీకే పిచ్చి పట్టింది.. అందుకే ఇలాంటి రౌడీల మధ్య ఉంటున్నావ్ అని మహాని ఆది అంటాడు. వీళ్లు కాదు రౌడీలు.. నువ్వే రౌడీవి.. అస్తమాను వీళ్లతో గొడవ పెట్టుకుంటున్నావ్ ఏంటి.. అని మహా, ఆది ఇద్దరూ మాటల యుద్దం చేస్తుంటారు. ఇక ఎంతకీ తెగదు. ఈ విషయాన్ని రిసార్టులో అందరూ ఎగబడి చూస్తుంటారు. ఆ గుంపులో ప్రతాప్, నారాయణ కూడా ఉంటారు. మనం చూడండి ఎంతలా కలిసిపోయామో.. సిల్లీ ఫెలోస్ ఎవరో కొట్టుకుంటున్నారు అట వెళ్లి చూద్దాం పదండి అని ప్రతాప్‌ని నారాయణ తీసుకు వస్తాడు.

నిజం తెలుసుకున్న నారాయణ, ప్రతాప్

నిజం తెలుసుకున్న నారాయణ, ప్రతాప్
ఇక అసలు విషయం ఒకరికొకరికి అర్థం అవుతాయి. డ్రైవర్ చక్రి గాడు మీ కొడుకా? అని ప్రతాప్.. మహాలక్ష్మీ మీ కూతురా? అని నారాయణ ఒకేసారి అడుగుతారు. అంటే మనిద్దరం వియ్యంకులమా? అని నారాయణ అంటాడు. ఎహె.. చీ.. నువ్వు నాకు వియ్యంకుడివి ఏంట్రా.. అని ప్రతాప్ అంటాడు. ఈ సారి వీడు ఏమైనా అన్నాడా? చెప్పు.. ఈ సారి నల్లిని నలిపినట్టు నలిపేస్తా అని మహాతో నారాయణ అంటాడు. ఇలాంటి వెదవలతో మాటలు అనిపించడానికే వీళ్లను ఇక్కడకు తీసుకు వచ్చావా? అని మహాతో ప్రతాప్ అంటాడు.

నువ్వే వెదవ.. ప్రతాప్‌కి నారాయణ కౌంటర్

నువ్వే వెదవ.. ప్రతాప్‌కి నారాయణ కౌంటర్
ఎవరు వెదవ.. తోడబుట్టిన దాన్ని కత్తితో పొడవాలని చూసిన నీ కొడుకు వెదవ.. పరువు పేరుతో కూతుర్ని దూరం చేసుకున్న నువ్వు పెద్ద వెదవ.. అని ప్రతాప్‌ని కూడా నారాయణ అంటాడు. చూశావా.. నీ ముందే ఎన్ని అంటున్నాడో.. చదువు, సభ్యత, సంస్కారం లేని డ్రైవర్‌ గాడితో ఎలా వెళ్లిపోయావే.. అని మహాని చీ కొడతాడు ప్రతాప్. హలో మిస్టర్ సూర్య ప్రతాప్.. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.. నా కొడుకు డ్రైవరే కావొచ్చు.. మంచోడు.. మంచి మనసున్నోడు.. నీ కొడుకులా రౌడీ అయితే కాదు.. బంగారం.. ఈడు.. అని నారాయణ అంటాడు. ఏయ్ ఇంకా ఆపు.. వీళ్లని పట్టుకునా? పుత్ర రత్నాలు అని అన్నావ్ అని ప్రతాప్ ఆగ్రహిస్తాడు.

నారాయణను తిట్టిన చక్రి, కేశవ

నారాయణను తిట్టిన చక్రి, కేశవ
రిసార్ట్ ఓనర్ ఇద్దర్ని ఆపి ఎవరి రూంలకు వారిని పంపించేస్తారు. ఇక ప్రతాప్‌తో కలిసి నారాయణ మందు కొట్టడం గురించి కేశవ, చక్రి, కన్నా, పెద్ది ఇలా అందరూ అడుగుతారు. జరిగిన విషయం మొత్తం చెబుతాడు నారాయణ. రెండు పెగ్గులు, రెండు చుట్టలు ఇచ్చాడు.. చుట్టరికం అన్నాడు.. మహా నాన్న అని తెలిస్తే.. ఎందుకు తాగుతాను.. కనీసం మాట్లాడను కూడా.. అని నారాయణ అంటాడు. ఇక తలా ఒక మాట అంటూ నారాయణని తిడుతుంటారు. వాళ్లు ఓవర్ చేస్తున్నార్నా, అది డబ్బుందన్న పొగర్రా అని చక్రి, కేశవ అంటారు. అది విని మహా అటు నుంచి అటే వెళ్తుంది.

మహాని తీసుకు వచ్చిన కన్నా..

మహాని తీసుకు వచ్చిన కన్నా..
మహాని సంతోష పెట్టడానికి అని చెప్పి.. ఇంకా బాధపెడుతున్నామని పెద్ది అంటాడు. ఇదంతా ఈయన వల్లే అని నారాయణని అందరూ కార్నర్ చేస్తారు. నువ్వే మహాని కూల్ చేయాలని నారాయణతో చక్రి అంటాడు. దీంతో కన్నా ఒక ఐడియా ఇస్తాడు. ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న మహా వద్దకు కన్నా వస్తాడు. ఎందుకు కంగారు పడుతున్నావ్.. మళ్లీ ఏమైంది? అని మహా అంటే.. నువ్వే వచ్చి చూడు అని మహాని తీసుకు వెళ్తాడు. క్యాంప్ ఫైర్ పెట్టి నారాయణ అక్కడ చిందులు వేస్తుంటాడు. అది చూసి మహా నవ్వేస్తుంది.

క్యాంప్ ఫైర్..

క్యాంప్ ఫైర్..
మంచి పర్ఫామెన్స్ చేశా కదా? ఓ కోటర్ ఇవ్వొచ్చు కదా? అని నారాయణ అంటాడు. దీంతో మహా కోపంగా చూస్తుంది. దీంతో నారాయణ సైడ్ అయిపోతాడు. ఇక నెక్ట్స్ పర్ఫామెన్స్ కేశవది అని అంటాడు చక్రి. నాకు డ్యాన్స్ రాదు రా అని కేశవ అంటే.. పట్టుబట్టి మరీ డ్యాన్స్ చేయిస్తారు. ఇప్పుడు పెద్ది డ్యాన్స్ చేయాల్సిందే అని మహా అండ్ కో డిమాండ్ చేస్తారు. డ్యాన్స్ కాదు కానీ డైలాగ్ చెబుతా అని అంటాడు పెద్ది. ఏమంటివి ఏమంటివి అని లెంగ్తీ డైలాగ్ చెప్పేస్తాడు. డ్యాన్స్ కూడా చేయొచ్చు కదా? అని మహాతో పాటుగా అందరూ రిక్వెస్ట్ చేస్తారు.

మహాకి కేశవ సారీ..

మహాకి కేశవ సారీ..
ఇక అందరూ కలిసి ఆనందంగా, సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. అది చూసి ప్రతాప్, ఆదిలు రగిలిపోతుంటారు. లేచిపోయి మా అందరినీ బాధ పెట్టిందే కాకుండా.. డ్యాన్స్ చేసి మా అందరినీ ఎలా బాధపెడుతుందో చూడు అని అనుకుంటూ ఆది వెళ్లిపోతాడు. ఇక మహా అండ్ కో డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా ముగుస్తుంది. మీ అన్నని కొట్టినందుకు సారీ.. అని మహాకి చెబుతాడు కేశవ. మమ్మల్ని అన్నా పర్లేదు.. మా ఇంటి ఆడ బిడ్డ మీరు.. మిమ్మల్ని అంటే ఊరుకోలేం కదా? అని కేశవ అంటాడు. మా వాళ్లు అయితే ఒక్కరు కూడా ఆడబిడ్డ అనుకోవడం లేదు.. కానీ మీరున్నారు.. మీరు అనుకుంటున్నారు.. మీ ఇంటి ఆడపిల్లని మీరెందుకు సారీ అడుగుతున్నారు అని.. చెప్పి వెళ్తుంది మహా.

రోప్ ఆటకు సిద్ధం..

రోప్ ఆటకు సిద్ధం..
అక్కడ అందరూ కలిసి ఫోటోలు దిగుతుంటారు. మహా ఆ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండటం చూసి ప్రతాప్, లలితా ఆగ్రహిస్తారు. సిరి ఏమో మహా అని పిలిచి వెళ్లబోతోంది. కానీ ఆది మాత్రం వద్దు అని చెబుతాడు. అది నీ అత్త కాదు అని అంటాడు. పాపని జాగ్రత్తగా పట్టుకో అని హారికకి ఇస్తాడు ఆది. వదిన మనం ఆ రోప్ ఆట చూద్దామా? అని డైవర్ట్ చేస్తాడు కన్నా. ఇక చక్రికి ఓ ఐడియా వస్తుంది. మనమంతా కలిసి వెళ్లి ఆడదాం పదా అని కేశవని, చక్రి తీసుకు వెళ్తాడు. అందులో కేశవ, చక్రి గెలుస్తారు. నాన్న మనం వీళ్లతో టగ్ ఆఫ్ వార్ అడదాం.. ఓడించి రిసార్ట్ నుంచి పంపించేద్దాం.. అని ఆది అంటాడు. చీ చీ వీళ్లతోనా? అని ప్రతాప్ అంటే.. వీళ్లని చూస్తూ ఇలా ఉండలేం.. పంపించేస్తా ప్రశాంతంగా ఉంటామని ఆది అంటాడు. దీంతో సరే అని ప్రతాప్ కూడా రెడీ అవుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *