రాశిఫలాలు 23 సెప్టెంబర్ 2026: బుధాదిత్య యోగం ప్రభావంతో కన్య, తులా సహా ఈ 5 రాశులకు ధనలాభం!
శిఫలాలు 23 సెప్టెంబర్ 2026: బుధాదిత్య యోగం ప్రభావంతో కన్య, తులా సహా ఈ 5 రాశులకు ధనలాభం!
రాశిఫలాలు 23 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సుకర్మ, ధ్రుతి, బుధాదిత్య యోగాల ప్రభావంతో కన్య, తులా సహా ఈ 5 రాశులకు ధన లాభం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Sep23
రాశిఫలాలు 23 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సుకర్మ, ధ్రుతి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు కన్యా రాశిలో సూర్యుడు, బుధుడి కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. మరోవైపు భద్ర యోగం, ధన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ కన్య, తులా సహా కొన్ని రాశుల వారికి ధన లాభ అవకాశాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభించొచ్చు. కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషుల మద్దతుతో మీ చిరకాల కోరిక ఒకటి నెరవేరే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు.
మీరు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి వినాయకుడి అనుగ్రహం, శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. శుభ యోగాల ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందొచ్చు. కొత్త వ్యాపారం లేదా సంస్థను ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి భారీ లాభాలొచ్చే అవకాశాలున్నాయి.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వినాయకుడి అనుగ్రహం వల్ల మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు.
ఉద్యోగులకు ప్రమోషన్ గురించి లేదా జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందొచ్చు. ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆదాయంలో పురోగతిని సాధిస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో తమ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించొచ్చు.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించొచ్చు. శుభ యోగాల ప్రభావంతో మీ పెండింగ్ పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మీ కుటుంబ జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మీరు మానసికంగా మరింత ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గణేష్ మంత్రాలను పఠించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు బుధుడు, సూర్యుడి కలయిక వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో మంచి విజయం సాధిస్తారు.
ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించనుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుక్రుని ప్రభావంతో మీ పరిస్థితులు మెరుగుపడొచ్చు.
అయితే మీ కుటుంబ జీవితంలో వాతావరణణం అనుకూలంగా ఉండొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పాత పరిచయాలు లేదా సంబంధాల వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. శుభ యోగాల ప్రభావంతో మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించనుంది.
మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు తోబుట్టువుల నుంచి ఆశీస్సులు లభించొచ్చు. మీ ప్రణాళికలు విజయవంతం కావొచ్చు.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం రావొచ్చు.
శుభ యోగాల ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభించనుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించొచ్చు.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ఏర్పడే శుభ యోగాల వల్ల అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు వినాయకుని అనుగ్రహం లభించనుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.
వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి అష్టమ స్థానంలో సూర్యుడు, బుధుడి కలయిక జరగనుంది. మరోవైపు పన్నెండో స్థానంలో చంద్రుడి ప్రభావంతో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఖర్చుల విషయంలో సంయమనం పాటించాలి. మీ బడ్జెట్ అదుపు తప్పకుండా జాగ్రత్త వహించాలి. మీ మాటల్లో సంయమనం పాటించాలి.
పరిహారం : ఈరోజు గణేశుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసిన పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీకు అప్పుల సమస్యల నుంచి విముక్తి లభించొచ్చు. దీంతో మీరు చాలా సంతోషిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.
మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు వినాయకుడి మోదకం నైవేద్యంగా సమర్పించాలి.