హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాన్ని విజయవాడ తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.. సెంటిమెంట్ కోసం అలా చేశారు, ప్రతి ఏటా!

 హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాన్ని విజయవాడ తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.. సెంటిమెంట్ కోసం అలా చేశారు, ప్రతి ఏటా!

హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాన్ని విజయవాడ తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.. సెంటిమెంట్ కోసం అలా చేశారు, ప్రతి ఏటా!

Hyderabad Vanasthalipuram Vinayaka Idol Immerse In Vijayawada: హైదారాబాద్‌లో పూజలందుకున్న వినాయకుడ్ని తీసుకెళ్లి విజయవాడ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. వనస్థలిపురంలో ప్రతి ఏటా క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడ్ని ఏర్పాటు చేస్తున్నారు. వీరు ప్రతి ఏటా వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి ఏదో ఒక పుణ్యక్షేత్రం దగ్గర నిజమజ్జనం చేయడం సెంటిమెంట్‌గా వస్తోంది. ఈ ఏడాది విజయవాడ తీసుకెళ్లి.. అక్కడ కృష్ణా నదిలో గణపయ్యను నిమజ్జనం చేసి, దుర్గమ్మను దర్శించుకున్నారు.

హైలైట్:

  • హైదరాబాద్ వినాయకుడు విజయవాడలో నిమజ్జనం
  • ప్రతి ఏటా సెంటిమెంట్ ఫాలో అవుతన్న కమిటీ
  • నిమజ్జనం అనంతరం దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు
Vijayawada Hyderabad Vinayaka Idol
హైదరాబాద్‌ వినాయకుడు విజయవాడలో నిమజ్జనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనాల సందడి కనిపిస్తోంది. వినాయకచవితి సందర్భంగా మండపం ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు చేసి విగ్రహం నిమజ్జన చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రతి ఏటా వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం హైలెట్ అని చెప్పాలి. కొద్దిరోజులుగా ట్యాంక్‌బండ్‌తో పాటుగా చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనాలు చేస్తున్నారు. అయితే విచిత్రంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో నిమజ్జనం చేశారు. అదేంటి హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటు చేసి విజయవాడ తీసుకొచ్చి ఎందుకు నిమజ్జనం చేశారనే అనుమానం వచ్చింది కదా.. వీరికి ఓ సెంటిమెంట్ ఉందని తెలిసింది.

హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన క్రాంతి యువజన సంఘం ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి ఏటా వినాయకుడిని ఏర్పాటు చేసి.. అనంతరం నిమజ్జనం చేయడానికి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లడం సెంటిమెంట్‌‌గా భావిస్తున్నారు. ఇలా క్రాంతి యువజన సంఘం తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఏడాది కూడా వారు అలాగే చేశారు.. హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాన్ని దుర్గమ్మ కొలువై ఉన్న విజయవాడ తీసుకెళ్లి నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు క్రాంతి యువజన సంఘం సభ్యులు దాదాపు 30 మందికి మంగళవారం తెల్లవారుజామున 4:30కి హైదరాబాద్ వనస్థలిపురం నుంచి బయల్దేరి వెళ్లారు. వారంతా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.. అనంతరం అందరూ కలిసి ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లారు.. అక్కడ విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్రేన్‌ సాయంతో వినాయకుడ్ని కృష్ణమ్మ ఒడిలోకి పంపింంచారు. అనంతరం వారంతా కలిసి దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి ఏటా వీరు వినాయక నిమజ్జనానికి పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు.. భద్రాచలం, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ వంటి చోటికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. అనంతరం వారు అక్కడ ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుంటున్నామని తెలిపారు. వీరు మాత్రమే కాదు చాలామంది ఇలానే చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *