20 ఏళ్లుగా నిమ్స్‌లో డాక్టర్.. లక్ష్మీభాస్కర్ ఆస్తులు రూ.80 కోట్లకుపైనే.. ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

 20 ఏళ్లుగా నిమ్స్‌లో డాక్టర్.. లక్ష్మీభాస్కర్ ఆస్తులు రూ.80 కోట్లకుపైనే.. ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

20 ఏళ్లుగా నిమ్స్‌లో డాక్టర్.. లక్ష్మీభాస్కర్ ఆస్తులు రూ.80 కోట్లకుపైనే.. ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి.. ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, కార్లు, బైక్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను గుర్తించారు. వివాదాస్పద ఫ్లాట్‌లో రూ.1.30 కోట్ల పెట్టుబడి, సన్నిహితులకు రూ.1.33 కోట్ల అప్పులు ఇచ్చినట్లు గుర్తించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ రూ.80 కోట్లకుపైనే ఉన్నట్లు సమాచారం.
Lakshmi Bhaskar
రాష్ట్రంలో అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ప్రభుత్వ అధికారుల భరతం.. ఏసీబీ అధికారులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద తిమింగలాలు.. ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. తాజాగా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు.. మంగళవారం రోజున డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌ ఇళ్లు ఆఫీసుల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీస్‌ సహా మరో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బయటపడిన స్థిర, చరాస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.80 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఏసీబీ సోదాల్లో కూకట్‌పల్లి నుంచి విశాఖపట్నం వరకు పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, బంగారం, కార్లు, బైక్‌లకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా వాటి విలువను లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమికంగా గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.80 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం.

ఏసీబీ సోదాల్లో కూకట్‌పల్లిలోని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. ఇందులో ఒక 4 బీహెచ్‌కే, రెండు 3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మణికొండ, పేట్‌బషీరాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో మరో ఐదు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్ ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభించాయి. విశాఖపట్నంలో సుమారు 800 చదరపు గజాల స్థలం ఉన్నట్లు కూడా సోదాల్లో గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మొత్తం ఆస్తుల విలువ భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *