Podarillu Serial Today 29 August Episode: జయంతిగా మంజుల పరిటాల ఎంట్రీ.. మాధవతో పెళ్లి సెట్ అయ్యేనా?.. పొసెసివ్తో రగిలిపోయిన మహా
Podarillu Serial Today 29 August Episode: జయంతిగా మంజుల పరిటాల ఎంట్రీ.. మాధవతో పెళ్లి సెట్ అయ్యేనా?.. పొసెసివ్తో రగిలిపోయిన మహా
Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్లో శనివారం నాటి ఎపిసోడ్లో మహాలక్ష్మీని కావాలనే ఉడికిస్తాడు చక్రి. తనను ఓ అమ్మాయి ప్రేమిస్తుందని చక్రి చెప్పడంతో మహా రగిలిపోతుంది. కోపంతో డోర్ వేసుకుంటుంది. ఇంకో వైపు జయంతి పాత్రలో మంజుల ఎంట్రీ ఇచ్చింది. నన్ను ఎవ్వరూ మళ్లీ పెళ్లి చేసుకోరు అని అన్నావ్ కదా.. చూడు ఇతనే (మాధవ) వచ్చాడు.. అన్ని విషయాలు తెలుసు.. మన పెళ్లి, విడాకులు అన్నీ తెలుసు.. నన్ను రెండో పెళ్లి చేసుకునేందుకు వచ్చాడు అని తన మాజీ భర్తకు చెబుతుంది జయంతి.

జయంతిగా ఎంట్రీ..
మాధవ, పెళ్లిళ్ల పేరయ్య ముందే వెళ్లి కాఫీ షాపులో కూర్చుంటారు. ఆ తర్వాత మెల్లిగా జయంతి ఎంట్రీ ఇస్తుంది. నా పేరు జయంతి.. బీఏ చదివా.. ఒకప్పుడు జాబ్ చేసే దాన్ని.. రెండేళ్ల క్రితం పెళ్లి అయింది.. ఇప్పుడు జాబ్ చేయడం లేదు.. మళ్లీ పెళ్లి చేసుకున్నాక.. జాబ్ చేస్తా అని జయంతి చెబుతుంది. వాటన్నంటికి సరే అని చెబుతుంటాడు మాధవ. ఇప్పుడు నీ గురించి చెప్పండి అని అంటుంది జయంతి. నా పేరు మాధవ.. మేస్త్రిని.. నేను నా తమ్ముళ్లు నాన్నా కలిసే ఉంటాం.. మా తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని ఇలా చెబుతుంటాడు మాధవ.
నాకేం ప్రాబ్లం లేదు..
పెళ్లి అయ్యాక కూడా వాళ్లు నాతోనే ఉంటారు.. నేను వాళ్లతోనే ఉంటాను అని మాధవ అంటాడు. నాతో అడ్జెస్ట్ అయ్యేవాళ్లతో ఉండటానికి నాకేం ఇబ్బంది లేదు అని జయంతి అంటుంది. మా తమ్ముళ్లు మంచివాళ్లు, మర్యాదగా ఉంటారు కావాలంటే మా తమ్ముడి భార్యను కూడా అడగండి అని మాధవ అంటాడు. నాకేం ప్రాబ్లం లేదు అని అంటుంది జయంతి. ఇంకా చెప్పండి.. అని జయంతి అంటే.. మీరే చెప్పండని మాధవ అంటాడు. అన్నీ నేనే చెబుతున్నా అని జయంతి అంటుంది. ఇంతలో మరో వ్యక్తి వస్తాడు.
భరిస్తే లక్ష ఇస్తా..
ఎంత సేపు.. టైంకి రాలేవా? అని తిడుతుంది జయంతి. వచ్చాను కదా అని పొగరుగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు ఆ వ్యక్తి. ఎవరు ఇతను అని మాధవ అడుగుతాడు. ఇతనే నా మాజీ భర్త అని అంటుంది జయంతి. మాధవ లేచి నిలబడతాడు. అతనేమీ వీఐపీ కాదు.. నిలబడాల్సిన పని లేదు అని జయంతి అంటుంది. దీంతో మాధవ కూర్చుంటాడు. బ్రదర్.. ఈమెను వారం కూడా భరించలేవు.. భరిస్తే లక్ష ఇస్తా.. నీ కుటుంబానికి దూరం అవ్వాల్సి వస్తుందని అంటాడు. దీంతో అతడ్ని పక్కకు తీసుకు వెళ్తాడు అతని బామ్మర్ది. దీంతో మాధవ కంగారుగా చూస్తాడు. అతడు ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా అంటున్నాడని జయంతి కవర్ చేస్తుంది.
ప్రేమిస్తుంది నిన్నే అంట..
కన్నా గాడు డల్‌గా కూర్చుని బాధ పడుతుంటాడు. కేశవ ఫోన్లో బిజీగా ఉంటాడు. ఇంతలో చక్రి గాల్లో తేలినట్టుందే అని పాట పాడుకుంటూ హుషారుగా ఉంటాడు. వాడేంట్రా అలా ఉన్నాడు.. అని కన్నా గురించి చక్రి అడుగుతాడు. అమ్మాయి విషయంలో బొక్క బోర్లా పడ్డాడు కదా అని కేశవ అంటాడు. మరి నిన్ను ఆ అమ్మాయి లవ్ చేస్తోంది కదా.. నువ్వు ఎందుకు డల్‌గా ఉన్నావ్.. శైలు తిట్టిందా? అని చక్రి అడుగుతాడు. ఆ అమ్మాయి ప్రేమించేది నిన్ను అని అంట అని చక్రికి కేశవ చెప్తాడు. అవును అని కన్నా అంటాడు. నాకు పెళ్లి అయిందని చెప్పలేదా? అని చక్రి అంటాడు.
మహాకి పొసెసివ్..
అంతలో మహా రూంలోంచి బయటకు వస్తుంది. మహాను ఉడికించాలని చూస్తాడు చక్రి. అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా? నా నంబర్ అడిగిందా? అని మహాకి వినిపించేలా అంటాడు చక్రి. నీ క్యాబ్ ఎక్కిందట.. నీ మాటలకు పడిపోయిందట కన్నా అంటాడు. నా మాటలకు ఎవ్వరైనా సరే పడిపోవాల్సిందే లే అని చక్రి ఓవర్ చేస్తాడు. దీంతో మహాకి మండిపోతుంటుంది. మహా ఎక్స్ ప్రెషన్స్ చూసి మరింతగా రెచ్చగొడుతుంటాడు చక్రి. అయినా ఎంత మందిని అని గుర్తు పెట్టుకుంటాం.. కాస్త అందంగా ఉంటే ఇలానే పడిపోతుంటారు.. అని చక్రి ఓవరర్ చేస్తుంటాడు.
ఇకపై ఆడుకుంటా..
మనం ప్రేమించే అమ్మాయి.. మనల్ని పట్టించుకోకుండా, మనల్ని ప్రేమించకపోయినప్పుడు.. మనల్ని ప్రేమించే వారిని బాధ పెట్టకూడదు కదండి.. అని చక్రి అంటాడు. ఏమో నాకు తెలీదు అని మహా అంటుంది. ఇక కోపంతో మహా రూంలోకి వెళ్లి గట్టిగా డోర్ వేస్తుంది. ఏంట్రా అలా వేసింది అని కేశవ అడిగితే.. పొసెసివ్ నెస్ రా.. నన్ను ఓ అమ్మాయి ప్రేమిస్తుందని తెలిసే సరికి అలా చేస్తుంది.. చూడు ఇకపై నేను ఎలా ఆడుకుంటానో అని చక్రి అంటాడు. ఇక అన్నయ్యను ఆపడం కష్టమే అని కన్నా, కేశవ మాట్లాడుకుంటారు.
రెండ్రోజుల్లోనా?
రాత్రి పూట మాధవకి పెళ్లిళ్ల బ్రోకర్ ఫోన్ చేస్తాడు. పనిలో ఉండి చూసుకోలేదు.. అమ్మాయి వాళ్లు ఏం అన్నారు అని పెద్ది అడుగుతాడు. అమ్మాయి వాళ్ల నాన్న ఇప్పుడే మాట్లాడాడు.. వాళ్లకి ఓకే అంట.. అని బ్రోకర్ చెప్తాడు. అవునా అని సంబర పడతాడు మాధవ. అయితే రెండు రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందట.. వాళ్లు వస్తారట అని చెప్తాడు. రెండ్రోజుల్లోనా? అని మాధవ షాక్ అవుతాడు. ఇంకా ఇంట్లో వాళ్లకి చెప్పలేదు కదా అని మాధవ అంటే.. త్వరగా చెప్పు అని బ్రోకర్ అంటాడు. సరే చూస్తా అని మాధవ ఫోన్ పెట్టేస్తాడు.
గాయత్రితో కామెడీ..
రాత్రి ఎవరితో మాట్లాడుతున్నావ్ అన్నయ్య.. రెండ్రోజుల్లో అని చెబుతున్నా అని చక్రి అడుగుతాడు. మాధవ ఏం చెప్పాలా? అని అనుకుంటున్న టైంలోనే గాయత్రి వస్తుంది. ఏంటో ఇలా వచ్చావ్.. మీ ఆయన ఎక్కడ అని అడుగుతాడు కేశవ. ముంబైకి వెళ్లాడు పని మీద అని చెప్తుంది. నిన్ను భరించలేక అటూ ఇటూ తిరుగుతున్నాడా? అని కేశవ, కన్నా కౌంటర్లు వేస్తాడు. రేయ్ నీ గురించి చెప్పేస్తారా? అని కన్నాని బెదిరిస్తుంది గాయత్రి. చెప్పు గాయత్రి అని మహా అడుగుతుంది. వద్దు అని కన్నా అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.