Podarillu Serial Today June 12th Episode: చెంపలు వాయించుకున్న కన్నా.. మహాలక్ష్మీ ఆఫీసులో చక్రి రౌడీయిజం.. సిగ్గుతో తలదించుకున్న మహా
Podarillu Serial Today June 12th Episode: చెంపలు వాయించుకున్న కన్నా.. మహాలక్ష్మీ ఆఫీసులో చక్రి రౌడీయిజం.. సిగ్గుతో తలదించుకున్న మహా
Podarillu Serial 2026 June 12th Episode Preview పొదరిల్లు సీరియల్లో శుక్రవారం నాడు ఇంట్రెస్టింగ్ సీన్ నడిచింది. మహా లక్ష్మీ ఆఫీస్ విషయాల్ని చెప్పడంతో.. ఏదేదో అల్లేసుకుని, ఊహించుకుని ఆఫీసుకి వెళ్లి గొడవ పెట్టుకుంటాడు చక్రి. దీంతో మహాలక్ష్మీకి తలకొట్టేసినట్టు అవుతుంది. చక్రి మీద మహా ఫైర్ అవుతుంది. ఇంకో వైపు శైలు మాత్రం కేశవని పట్టించుకోదు. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో కేశవ ఫీల్ అవుతుంటాడు.

కన్నాపై మహా ఫైర్..
నేను చిన్నప్పటి నుంచీ నాన్నా అని పిలవలేదు అని కన్నా అంటాడు. అది పెద్ది.. మీరు చిన్నప్పుడే లాగి పెట్టి కొట్టి ఉంటే ఇలా తయారయ్యేవాడు కాదు అని మహా అంటుంది. మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారని క్రాకర్స్ తెచ్చా.. ఆయనే వచ్చి డ్యాన్స్ చేశాడు.. మీతో కూడా అలా యారగెంట్‌గా మాట్లాడుకూడదు.. తప్పు నాదే అని అంటాడు. మిమ్మల్ని క్షమించడానికి నేను ఎవర్ని అని మహా అంటుంది. దీంతో కన్నా గాడు చెంపలు వాయించుకుంటాడు. ఎందుకు రా అలా చేస్తున్నావ్ అని మహా అంటుంది. ఇప్పుడు మీ కోపం పోయిందా? అని కన్నా అంటాడు. తప్పులు చేశావ్.. నిన్ను చిన్నప్పుడే సరిగ్గా పెంచాల్సింది అని పెద్ది అంటాడు.
అందరూ కలిసి..
ఘుమఘుమలాడుతోంది.. ఏం స్పెషల్ చేశారేంటి అని కన్నా, కేశవ, చక్రి ఇలా అందరూ అడుగుతుంటారు. టిఫిన్.. ఉప్మా అని మహా అంటుంది. దీంతో అందరూ పారిపోవాలని ట్రై చేస్తారు. దీంతో మహా బెత్తం తీస్తుంది. దెబ్బకు అందరూ సైలెంట్‌గా కూర్చుంటారు. ఉప్మా ఏం కాదు లేరా.. మీకు నచ్చిందే చేశాను.. బిర్యానీ అని పెద్ది అంటాడు. బిర్యానీ యా అని అంతా సంబరపడతారు. అందరూ కలిసి తింటుంటే గాయత్రి వీడియో కాల్ చేస్తుంది. కానీ పెద్ది లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయమని అందరూ చెబుతారు. వద్దు.. తప్పు.. ఇంటిని చూపిస్తానని చేస్తోంది.. అలా నాకు ఫోన్లు చేయొద్దని తర్వాత అర్థమయ్యేలా చెప్తా అని పెద్ది అంటాడు.
బిర్యానీ ఇచ్చి..
మరో వైపు నారాయణకు ఆకలి వేస్తోంది. లోపలకు వెళ్తే కన్నా గాడి తల్లి గురించి శివంగి అడుగుతుందేమో అని నారాయణ భయపడుతుంటాడు. ఇంతలో మహానే ప్లేట్లో బిర్యానీ వేసుకుని తీసుకు వచ్చి ఇస్తుంది. ఇదేంటి.. అని నారాయణ అంటాడు. బిర్యానీ అని మహా చెబుతుంది. బిర్యానీ ఇచ్చి రహస్యాలు రాబడదామని అనుకుంటున్నావా అని నారాయణ అంటాడు. మీరేం చెప్పరు.. ఎన్ని రోజులు దాచి పెడతారో నేను కూడా చూస్తాను అని మహా అంటుంది. మెల్లిగా సీక్రెట్ అడుగుదామని ప్రయత్నిస్తుంది మహా. కానీ నారాయణ మాత్రం పసిగట్టేస్తాడు. బిర్యానీ పెట్టి సీక్రెట్స్ అడగడం పాపం అని అంటాడు. దీంతో మహా వెళ్తుంటే చక్రి అడ్డుగా వస్తాడు
మహాతో ముచ్చట్లు..
చూసుకుని నడవాలి కదా.. అని మహా తిడుతుంది. అలా ఇద్దరూ కలిసి కాసేపు బయట నడుస్తుంటారు. ఆఫీస్ ఎలా ఉంది.. స్టాఫ్ ఎలా ఉన్నారు.. వర్క్ ఎలా ఉందని మహాని చక్రి అడుగుతాడు. మా విక్కీకి నేను చేసిన వర్క్ నచ్చలేదు.. బాగా లేదని అన్నాడు.. నేను మళ్లీ ఫ్రూవ్ చేసుకోవాలని మహా అంటుంది. నీ వర్క్ నచ్చలేదా? నిన్ను తిట్టాడా? అని చక్రికి కోపం వస్తుంది. నాకు థియరీ నాలెడ్జ్ ఉంది కానీ ఫీల్డ్ వర్క్ అలవాటు లేదు కదా.. నెక్ట్స్ టైం ఇంకా బాగా చేయాలని ఆలోచిస్తున్నా అని మహా అక్కడి నుంచి వెళ్తుంది. మా విక్కీనా.. అంతలోనే మా విక్కీ అనే వరకు వెళ్లారా? అని చక్రి కాసేపు కుళ్లుకుంటాడు.
మీరు రావొద్దు..
నేను కూడా మీతో పాటు ఆఫీస్‌కి వస్తా.. అసలే మీ బాస్ తిట్టాడు కదా అని చక్రి అంటాడు. అది తిట్టడం కాదు.. వర్క్ నేర్చుకోమని మందలించడం అని మహా అంటుంది. మొదటి రోజే పని వస్తుందా? ఎవడ్రా వాడు అని కేశవ ఫైర్ అవుతాడు. అందుకే వాడి పని చెప్పడానికి, మహాలక్ష్మీ వెనకాల ఆరడుగుల ఆజానుభావుడు ఉన్నాడని చెప్పడానికి వెళ్తున్నాను అని చక్రి అంటాడు. తప్పు చేస్తే ఎవరైనా చెప్తారు.. నా వెనుక బెటాలియన్ ఉన్నా సరే.. నా వెంట రాకండి.. నేనేమీ ఎల్కేజీకి వెళ్లడం లేదు అని మహా అంటుంది. ఇంతలో పెద్ది టిఫిన్ బాక్స్‌లు తెచ్చిస్తాడు.
కేశవ కౌంటర్లు..
చక్రి మాట్లాడే ప్రతీ మాటకు మహా కౌంటర్ వేస్తుంది. దీంతో కన్నా, కేశవ తెగ నవ్వేస్తుంటారు. బస్సులో ఇబ్బంది అయితే చెప్పండని చక్రి అంటే.. ఏ రవాణా శాఖ మంత్రితో మాట్లాడతావా? అని కౌంటర్ వేస్తుంది మహా. దీంతో అందరూ నవ్వేస్తారు. చక్రి టార్చర్ ఎక్కువ అవుతోంది పెద్ది.. కాస్త చూడండని మహా అంటుంది. దీంతో పెద్ది మందలిస్తాడు. కన్నాగాడి మీద చేతులు వేసుకుని మహా వెళ్తుంది. నాపైన ఎప్పుడైనా అలా వేసిందా? అని చక్రి అంటాడు. నీ భుజం అందదేమో రా అని కేశవ కౌంటర్లు వేస్తాడు. నీకే అమ్మాయితో మాట్లాడటం తెలీదు.. నువ్వు నన్ను చూసి నవ్వుతావా రా అని కేశవని అంటాడు చక్రి.
ఓ స్కూటీ కొందాం..
రేయ్ ముందు మహాలక్ష్మీకి ఏం ఇష్టమో కాదు.. ఏం నచ్చవో అవి తెలుసుకుని చేయకుండా ఉండు చాలు అని కేశవ సలహా ఇస్తాడు. ఇంతలో వాష్ రూం కట్టడానికి కొంత డబ్బుని చక్రి ఇస్తాడు. ఇది నేనే ఇచ్చానని చెప్పు అన్నయ్య అని చక్రి అంటాడు. అప్పుడు నిన్ను అంబానీకి అన్నలా చూస్తుందా? అని కేశవ కౌంటర్ వేస్తాడు. మహా బాగా కష్టపడుతోంది.. ఓ స్కూటీ కొనాలి.. సెకండ్ హ్యాండ్లో మంచి స్కూటీ చూడు అని కేశవకి చెబుతాడు. తక్కువ తిరిగాలి.. ఎక్కువ మైలేజ్ ఇవ్వాలి.. వైట్ కలర్ అయి ఉండాలని తన చిట్టా అంతా చెబుతాడు చక్రి. సరే చూద్దాం అని కేశవ అంటాడు.
తిట్టి వెళ్లిన శైలు..
శైలు కోసం కేశవ ఎదురు చూస్తుంటాడు. శైలు, కీర్తి ఇద్దరూ స్కూటీ మీద వస్తుంటే కేశవ ఆపుతాడు. శైలు వెళ్లిపోతుంటే చేయి పట్టుకుని ఆపుతాడు కేశవ. దీంతో శైలు ఫైర్ అవుతుంది. నేను నీ పెళ్లానా? లవర్ నా? చేయి పట్టుకుని ఆపుతున్నావ్ అని ఆగ్రహిస్తుంది. నీ డబ్బులు నీకు ఇచ్చేశా.. ఇక నీతో మాట్లాడాల్సిన పని లేదు అని శైలు అంటుంది. టైం వేస్ట్ చేసుకోకు అని హితబోధ చేశావ్ కదా.. థాంక్స్ అని చెప్పి వెళ్లిపోతుంది శైలు. సారీ చెబుదామని వస్తే.. ఇలా చెడుగుడు ఆడేసుకుందేంటని శైలు గురించి కేశవ అనుకుంటాడు.
పర్సనల్ విషయాలు..
ఆఫీసులో అందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. సంతోష్ కుమార్ తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటాడు. ఇంతలో విక్కీ వచ్చి మహాలక్ష్మీ పక్కన కూర్చుంటాడు. వంట ఎవరు చేశారు.. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని ఇలా అడుగుతుంటే మహా తిక్కతిక్కగా సమాధానం ఇస్తుంది. తను పర్సనల్ విషయాలు చెప్పదని నీకు ఇంకా అర్థం కాలేదా విక్కీ అని దివ్య అంటుంది. సరే గుడ్.. ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్లకి ఇస్తాను అని విక్కీ అంటాడు. మహా ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోడానికి వెళ్తుంది. అదే టైంలో మహాకి చక్రి నుంచి ఫోన్ వస్తుంది.
చక్రి ఫోన్..
తిన్నారా? అని అడుగుతాడు చక్రి. నేను తిన్నాను.. మరీ మీరు తిన్నారా? అని మహా రివర్స్‌లో అడుగుతుంది. లేదండి.. ఇంటికి వెళ్తే బోర్ కొడుతుంది.. మీరు లేరు కదా.. అని చక్రి అంటాడు. అలా అని తినకుండా ఉంటారా? అని మహా అంటే.. రెస్టారెంట్లో తినాలని అనుకుంటున్నాను అని చక్రి అంటాడు. ఇంతలో సంతోష్ కుమార్‌కి పొలమారుతుంది. ఆఫీస్ బాయ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే.. వాడ్ని తిడుతుంటాడు సంతోష్ కుమార్. ఆ తిట్లన్నీ చక్రి తప్పుగా అర్థం చేసుకుంటాడు. మహానే తిడుతున్నాడని చక్రి అనుకుంటాడు. ఆఫీసుకి వెళ్లి వాడి పని చెప్తా అని అంటాడు చక్రి.
ఆఫీసుకి వచ్చిన చక్రి..
ఆఫీస్ బాయ్‌ని సంతోష్ అలా తిడుతుంటే విక్కీ మందిలిస్తాడు. వాడు ఒక మనిషే.. మన ఎంగిలి మెతుకుల్ని తీస్తుంటాడు.. వాడికి థాంక్స్ చెప్పాలని విక్కీ అంటాడు. అదీ మన విక్కీ కారెక్టర్ అని దివ్య అంటుంది. సరే కానీ.. నన్ను లక్కీ అని పిలవొద్దని విక్కీకి చెప్పు అని అంటుంది మహా. సరే ట్రై చేస్తాను అని దివ్య అంటుంది. ఇంతలో మహా ఆఫీసుకి చక్రి వచ్చేస్తాడు. మహాకి ఫోన్ చేస్తాడు. కానీ మహా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో చక్రి అనుమానం మరింతగా బలపడుతుంది.
ఆఫీసులో గొడవ..
చక్రి నేరుగా ఆఫీసులోకి వస్తాడు. చక్రిని చూసి మహా షాక్ అవుతుంది. ఇందాక మిమ్మల్ని తిట్టింది ఎవరు.. వాడ్ని కొట్టి పోవడానికే ఇక్కడకు వచ్చాను అని చక్రి అంటాడు. నీకేమైనా పిచ్చా అని మహా అంటుంది. ఎవడు వాడు అని చక్రి అంటాడు. మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు.. ప్లీజ్ వెళ్లిపోండి.. ప్లీజ్ వెళ్లిపోండి అని మహా అంటుంది. కానీ చక్రి మాత్రం వినడు. నేను ఫోన్లో విన్నాను అని చక్రి గట్టిగా అరుస్తాడు. దీంతో ఆఫీసులో అందరూ వచ్చి మహా చుట్టూ చేరతాడు. ఎవడమ్మా వీడు.. డిస్టర్బ్ చేస్తున్నాడా? అని సంతోష్ కుమార్ అంటాడు.
బయటకు లాక్కెళ్లిన మహా..
ఏం లేదు సర్.. నేను పంపిస్తాను అని మహా అంటుంది. ఇదే ఆ గొంతు అని సంతోష్ కుమార్‌తో గొడవ పెట్టుకుంటాడు చక్రి. దీంతో మహా అరిచేస్తుంది. నువ్వు అసలు ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని అంటుంది. అసలు వీడు ఎవడు.. ఈ రౌడీ ఎవడు.. ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోవాలని సంతోష్ అంటాడు. ఇంతలో విక్కీ కూడా వస్తాడు. ఏం జరుగుతోంది అని అంటాడు. ఏం లేదు.. నేను హ్యాండిల్ చేస్తాను అని చక్రిని పక్కకు తీసుకు వెళ్తుంది మహా. ఆమెకు ఎవరూ లేరని అనుకోకండి.. నేను ఉన్నాను అని చక్రి అంటే.. ఎహే పదండి అని లాక్కుపోతుంది మహా.
సిగ్గుతో తలదించుకునే పరిస్థితి..
సిగ్గుతో తలదించుకునే పరిస్థితి..
ఇంకొక్క మాట మాట్లాడుకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోండని మహా ఫైర్ అవుతుంది. అంత ఎందుకు భయపడుతున్నారండి అని చక్రి అంటాడు. ఇది మీకు భయంలా కనిపిస్తోందా? అని మహా కోపంగా అంటుంది. నా తలకాయ తీసి ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు.. అంత అంబాసరింగ్ సిట్యువేషన్లో ఉన్నాను.. ఆఫీసులో అందరి ముందు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని తీసుకు వచ్చారు అని మహా అంటుంది.. ఎందుకు.. తప్పు మీరు చేయలేదు.. వాళ్లు చేశారు.. వాళ్లు తలదించుకోవాలని చక్రి అంటాడు. అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉండటంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.