Gundeninda Gudigantalu Serial Today 31 August Episode: చీపురు కట్ట తిరగేసిన ప్రభావతి.. మోసం చేసినప్పుడు తెలీదా?.. రోహిణిపై బాలు ఫైర్
Gundeninda Gudigantalu Serial Today 31 August Episode: చీపురు కట్ట తిరగేసిన ప్రభావతి.. మోసం చేసినప్పుడు తెలీదా?.. రోహిణిపై బాలు ఫైర్
Gudigantalu Serial Today Episode గుండెనిండా గుడిగంటలు సీరియల్లో సోమవారం నాటి ఎపిసోడ్లో నీలకంఠం తన కొడుకు సంజుని రాజకీయ అరంగేట్రం కోసం రెడీ చేస్తుంటాడు. తన సలహాలు ఇస్తూ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతుంటాడు. ఇక మౌనిక బయటకు వెళ్లాలని చూస్తుంటే.. ఇంట్లోనే ఉండమని భయపెడతాడు. బాలు ఏమో తన చెల్లి వస్తుందని ఇంట్లో ఎదురు చూస్తుంటాడు. రవిని, మనోజ్‌ని కూడా బయటకు వెళ్లనివ్వకుండా ఎదురు చూసేలా చేస్తాడు బాలు.

చీపురు కట్ట తిరిగేసిన ప్రభావతి..
డబ్బులు పట్టుకుని రమ్మని వేధించడం లేదు కదా.. నా కొడుక్కి దూరంగా ఉండమంటున్నా అని ప్రభావతి అంటుంది. అంటే ఇప్పుడు వాడి కంట్లో ఉన్న నలక తీయొద్దంటావ్? అంతేనా? అని ఓ నలుగురు అమ్మాయిల్ని తీసుకు వస్తాడు బాలు. ఒక్కొక్కరికి రూ. 250 ఇవ్వాలి.. అన్ని పనులు చేసి పెడతారు అని బాలు అంటాడు. మనోజ్ అయితే ఫుల్ ఖుషీ అవుతుంటాడు. నలుగురు అమ్మాయిలు కలిసి మనోజ్‌కి నలక తీస్తుంటారు. అమ్మో అని ప్రభావతి కంగారు పడుతుంది. ఆ నలుగుర్ని చీపురు పట్టుకుని కొడుతూ పరుగులు పెట్టిస్తుంది. అలాంటాి ఐడియా ఇచ్చినందుకు బాలుని కూడా కొట్టాలని చూస్తుంది ప్రభావతి. కానీ బాలు తప్పించుకుని వెళ్లిపోతాడు.
కొడుక్కి సలహాలు..
రేయ్.. సంజు ఇటు రారా అని నీలకంఠం పిలుస్తాడు. ఏంటి డాడీ అని సంజు అంటాడు. ఇక నువ్వు ప్రజల్లోకి వచ్చే టైం ఇదే రా.. నా కొడుకువి కాబట్టి.. నీ మీద అంచనాలు ఉంటాయి.. ఇక నువ్వు జనాల్లోకి వచ్చి.. కనపడాలి.. అని నీలకంఠం అంటాడు. అంటే ఇప్పుడు వచ్చి నేనేం చేయాలి.. అందరితో మాట్లాడాలా? అందరికీ మంచి చేయాలా? అని అడుగుతాడు సంజు. నేను కూడా ఏం చేయను.. కానీ చేసినట్టుగా నటిస్తాను.. నువ్వు కూడా అంతే అని నీలకంఠం అంటాడు.
పెద్ద పెద్ద స్పీచులు ఇవ్వాలి..
ఇకపై మనం ప్రతీ పండుగను సెలెబ్రేట్ చేయాలి.. ఈ రోజు రాఖీ కదా.. మన కార్యకర్తల్ని పిలుస్తాను.. వాళ్ల అందరికీ రాఖీ కట్టాలి అని నీలకంఠం చెప్తాడు. చెల్లెళ్లు, అక్కలు ఉన్న వాళ్లు కడతారు.. నేను ఎందుకు నాన్నా అని సంజు అంటాడు. మనం అలా నటించాలి.. కార్యకర్తలే మన కుటుంబం, మన తోబుట్టువులు అన్నట్టుగా పెద్ద పెద్ద స్పీచులు ఇవ్వాలి రా.. అని సంజు చెప్తాడు. అందరూ వస్తుంటారు, నువ్వు రెడీగా ఉండు అని సంజుకి నీలకంఠం చెప్తాడు. కార్యకర్తలంతా రెడీగా ఉన్నారా, చెప్పిన టైంకి రమ్మను అని నీలకంఠం ఫోన్లో మాట్లాడతాడు.
వెళ్లకుండా అడ్డుకున్న సంజు..
సంజు బయటకు వెళ్లాడని సువర్ణ అనుకుంటుంది. అమ్మ.. మౌనిక..వాడు బయటకు వెళ్లాడు.. నీకు మాట ఇచ్చా కదా.. వాడు బయటకు వెళ్లగానే నిన్ను మీ ఇంటికి పంపిస్తా అని. వాడు వచ్చే లోపు రాఖీ కట్టేసి రా అమ్మా అని చెప్తుంది సువర్ణ. దీంతో సంబరంగా, సంతోషంగా బయటకు వెళ్తుంటుంది మౌనిక. కానీ గుమ్మం వద్ద సంజు వచ్చి ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావ్? ఎటు వెళ్తున్నావ్? ఏం దాచి పెడుతున్నావ్ అని భయపెట్టేస్తాడు సంజు. ఇక మౌనిక చేతిలో ఉన్న రాఖీలను చూసి సంజు మరింతగా కోప్పడతాడు.
మౌనికను తోసేసిన సంజు..
ఇది నా కళ్లు కప్పి వాళ్ల ఇంటికి వెళ్లాలని చూసింది అంటూ మౌనిక మీద ఆగ్రహిస్తాడు సంజు. నేనే వెళ్లమన్నా. రాఖీ కట్టి వస్తే తప్పేంట్రా.. వెళ్తే ఏంటి? అని సువర్ణ అడుగుతుంది. నేను వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత కూడా.. వెళ్లడం ఏంటి.. భర్త మాటకు విలువ ఇవ్వదా? తాళి కట్టాను కదా.. అన్ని హక్కులు నాకే ఉంటాయి అని సంజు మూర్ఖంగా వాదిస్తుంటాడు. అసలు నువ్వు ఈ భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తున్నావ్.. వెళ్లు అని సువర్ణను గద్దరిస్తాడు నీలకంఠం. దీంతో సువర్ణ వెళ్లిపోతుంది. నువ్వు కూడా పోవే అని మౌనికను తోసేస్తాడు సంజు. బాలు ఇక్కడకు వస్తే వాడ్ని అవమానిద్దాం అని సుంజ, నీలకంఠం మాట్లాడుకుంటారు.
గౌరవంగా అడిగితేనే..
నాకు కాఫీ ఇవ్వవా? అని మీనాని బెదిరించినట్టుగా, తీసి పారేసినట్టుగా అడుగుతుంది ప్రభావతి. నీకు కాఫీ కావాలా? మీనాని తిట్టడం కావాలా? అని సత్యం అడుగుతాడు. దాన్ని కారణం లేకుండా తిట్టడానికి నాకైమేనా పిచ్చా? అని అంటుంది ప్రభావతి. మీనా కాఫీ పెట్టదు.. గౌరవంగా అడిగితేనే కాఫీ ఇస్తుంది అని బాలు అంటాడు. అమ్మ టిఫిన్ కాలేదా? నాకు ఆకలిగా ఉంది అని మనోజ్ వస్తాడు. రేయ్ ఇందాకే కదా పీకల దాక మెక్కావ్ అని బాలు తిడతాడు. ఇక మరో వైపు శ్రుతి, రవి కూడా వచ్చేస్తారు.
అది రాదు.. రాఖీ కట్టదు..
అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండి ఆఫీసులకు వెళ్తామని అంటుంటారు. దీంతో బాలు అసలు ఈ రోజు ఏంటో గుర్తుందా? అని తిడతాడు. ఈ రోజు రాఖీ.. మన మౌనిక వస్తుంది.. రాఖీ కడుతుంది.. అది కూడా గుర్తు లేదా? అని అడుగుతాడు బాలు. అది రాదు.. మీలా ఖాళీగా ఉంటుందా? అది పెద్దింటికి వెళ్లింది.. ఎన్నో వ్యాపారాలు ఉంటాయి.. అంత బిజీలో మీకోసం వస్తుందా? అని ప్రభావతి అంటుంది. వస్తుంది.. మాకు రాఖీ కడుతుంది.. అని బాలు పిచ్చి నమ్మకంతో ఉంటాడు. మౌనిక రాదు అని ఈయనకు ఎలా చెప్పాలి అని మీనా బాధ పడుతుంటుంది.
రోహిణికి బాలు కౌంటర్లు..
నాకు షాపులో పని ఉంది.. కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు అని మనోజ్ అంటాడు. ఎందుకు మోసపోవడానికా? ఇక్కడ ఆల్రెడీ పార్లరమ్మ ఉంది కదా మోసం చేయడానికి అని అంటాడు బాలు. ఏదో చిన్న తప్పు చేస్తే మోసగత్తె అని ముద్ర వేస్తారా? అని రోహిణి అంటుంది. ఏంటి? చిన్న తప్పా.. అందరినీ మోసం చేశావ్.. మోసం చేసినప్పుడు తెలీదా? బయట పడితే ఇలాంటివి జరుగుతాయ్ అని.. అమ్మ నిన్ను కొట్టిన తీరు, మాట్లాడిన మాటలు, తిట్టిన తిట్లు అప్పుడే మర్చిపోయావా? అని రోహిణికి బాలు కౌంటర్లు వేస్తాడు. దీంతో రోహిణి సైలెంట్ అయిపోతుంది.