Podarillu Serial Today 30 August Episode: రాఖీ పేరిట కుట్ర చేసేందుకు రమణయ్య, తాయారు రెడీ.. బాధ పడుతూ మహా.. ఇంప్రెస్ చేసేందుకు చక్రి ప్రయత్నం

 Podarillu Serial Today 30 August Episode: రాఖీ పేరిట కుట్ర చేసేందుకు రమణయ్య, తాయారు రెడీ.. బాధ పడుతూ మహా.. ఇంప్రెస్ చేసేందుకు చక్రి ప్రయత్నం

Podarillu Serial Today 30 August Episode: రాఖీ పేరిట కుట్ర చేసేందుకు రమణయ్య, తాయారు రెడీ.. బాధ పడుతూ మహా.. ఇంప్రెస్ చేసేందుకు చక్రి ప్రయత్నం

Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్‌లో ఆదివారం నాటి ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. ఆది గత ఏడాది రాఖీకి ఇచ్చిన గిఫ్ట్ చైన్ తెగి పడటంతో మహా ఎమోషనల్ అవుతుంది. ఈ ఏడాది అయితే రాఖీకి కూడా కలిసే అవకాశం లేదని బాధ పడుతుంటుంది. ఇంకో వైపు గాయత్రి బ్లాక్ మెయిల్ చేయడంతో నారాయణకు రాఖీ కట్టాలని తాయారు ఫిక్స్ అవుతుంది. గిఫ్ట్ కింద ఇంటిని రాయించుకుందాం అని రమణయ్య, తాయారు ప్లాన్ వేస్తారు. ఇంకో వైపు ఆదిని, మహాని కలపాలని హారికకి ఫోన్ చేసి తన ప్లాన్ గురించి చెప్తాడు చక్రి.
పొదరిల్లు టుడే ఎపిసోడ్
గత ఏడాది రాఖీ పండుగకు ఆది ఇచ్చిన గోల్డ్ చైన్ తెగి కింద పడుతుంది. దీంతో మహా బాధ పడుతుంటుంది. గత ఏడాది మా అన్న ఇచ్చాడు.. ఇప్పుడు దూరం అయ్యాం అని మహా ఎమోషనల్ అవుతుంది. ఓహో మీ అన్నలో అంత మంచితనం ఉందా? అంత మంచివాడా? అని చక్రి కౌంటర్ వేస్తాడు. మా అన్న, నేను ఎంతో ప్రేమగా ఉండేవాళ్లం, ఇదంతా మీ వల్లే అని చక్రిని తిడుతుంది మహా. నేనేం చేశానండి అని చక్రి అంటే.. మీరు మాట మాట్లాడితే ఆధార్, మెడ మీద స్టిక్కర్ అన్నీ చెప్పేస్తా అని మహా అంటుంది. దీంతో సైలెంట్ అయిపోతాడు చక్రి. నేనేం పాపాలు చేశానండి అని చక్రి అంటే.. నువ్వు చేసేవన్నీ పాపాలే కదా అని గాయత్రి కౌంటర్ వేస్తుంది. వాడి గురించి వాడే కరెక్ట్‌గా చెప్తున్నాడేంటి? అని నారాయణ అడుగుతాడు. ఇగో, పెళ్లి వల్ల దూరం అయ్యాం.. కానీ నేనే మా అన్నయ్యను వణికించేదాన్ని అని మహా అంటుంది. ఓహో అప్పటి నుంచే అంకురార్పణ జరిగిందా? అని చక్రి.. ఆరు నెలలకే మనం ఇలా అయ్యాం.. వాళ్ల పరిస్థితి ఏంటో అని కేశవ అంటాడు. ఏంటి? అని మహా అంటే.. ఏం లేదండి సరదాకే అన్నాను అని కేశవ అంటాడు.

మళ్లీ అలాంటి రోజు వస్తుందేమో

మళ్లీ అలాంటి రోజు వస్తుందేమో

మాకు అన్నాచెల్లెళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు కదమ్మా అని పెద్ది అంటాడు. మాకు తెలిసింది ఈ నారాయణ, ఆ తాయారు.. వీళ్లు అన్నాచెల్లెళ్లు కాదు.. శత్రువులు అని చక్రి అంటాడు. మేం ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండే వాళ్లం.. మా మధ్య దూరం పెరిగింది అని నారాయణ కన్నీరు పెట్టుకుంటాడు. మళ్లీ అలాంటి రోజు వస్తుందేమో మామయ్య అని గాయత్రి అంటుంది. మీ అమ్మ.. మారదు.. కావాలంటే నేను, నా కుటుంబం నాశనం అవ్వాలని కోరుకుంటుంది తప్పా.. మాకు మంచి జరగాలని అనుకోదు అని నారాయణ బాధ పడతాడు.

చెల్లిల్ని గుర్తు చేసుకుంటూ..

చెల్లిల్ని గుర్తు చేసుకుంటూ..

ఆది ఏవో ఫైల్స్ వెతుకుంటే.. రాఖీల డబ్బా కింద పడుతుంది. అందులోంచి రాఖీలు బయట పడతాడు. ఆ రాఖీల్ని చూస్తూ మహాని గుర్తు చేసుకుంటుంది ఆది. ఇంకో వైపు మహా కూడా ఆ తెగిన గొలుసుని పట్టుకుని ఆదిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది.. ఏం చూస్తున్నారు అండి అని హారిక అడుగుతుంది. ఇవి నా చెల్లెలు ప్రతీ ఏడాది కట్టిన రాఖీలు అని అంటాడు ఆది. అన్నీ దాచి పెట్టుకున్నారా? అని హారిక అడిగితే.. అవును.. ప్రతీ ఏడాది రాఖీకి.. మహా బయటకు వెళ్లి.. నా చేతికి ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసి మరీ తీసుకు వచ్చేది..

అది ఆ డ్రైవర్ గాడితో వెళ్లిపోయింది

అది ఆ డ్రైవర్ గాడితో వెళ్లిపోయింది

రాఖీ కట్టిన తర్వాత.. ఏం కావాలో అడిగి మరీ నాతో కొనిపించుకునేది. నేను కూడా అది అడిగిందల్లా కొనిచ్చేవాడ్ని.. ఏదీ కాదనే వాడ్ని కాదు.. ఒక్కత్తే ఆడపిల్ల అని ఎంతో గారాభంగా పెంచుకున్నాం.. పెద్దింటి కోడలిగా చేయాలని అనుకున్నాం.. కానీ అది ఆ డ్రైవర్ గాడితో వెళ్లిపోయింది అని ఆది బాధ పడుతుంటాడు. ఇక నా చెల్లి రాఖీలు కట్టదు.. ఇవే నాకు గుర్తుగా మిగిలాయ్ అని ఆది బాధపడుతుంటాడు. ఆది మాటలకు హారిక ఎమోషనల్ అవుతుంది. ఇంకో వైపు మహా కూడా అలానే బాధ పడుతూ ఉంటుంది.

బాధపడ్డ మహా..

బాధపడ్డ మహా..

ఎందుకమ్మా అంతలా బాధ పడుతున్నావ్.. కావాలంటే నువ్వు వెళ్లి రాఖీ కట్టి రావొచ్చు కదా.. ఇది మంచి సమయం.. నిన్ను ఆదరించే అవకాశం ఉంది అని పెద్ది అంటాడు. అలా చేయలేను.. వాళ్లు క్షమించలేరు.. మేం ఆడవాళ్లం కదా.. ఏదైనా మా మనసులోనే దాచి పెట్టుకుంటాం.. అది బాధైనా, ప్రేమైనా సరే అని మహా అంటుంది. ఇక మహా బాధని దూరం చేయానలి, అన్నతో కలిసేలా చేయాలని, రాఖీ కట్టించాలని అనుకుంటాడు. అలా చేస్తే మహాలక్ష్మీ కూడా ఇంప్రెస్ అవుతుందని చక్రి అనుకుంటాడు. ఇక హారికకి చక్రి ఫోన్ చేస్తాడు.

ఇంటి పేపర్ల మీద సంతకం..

ఇంటి పేపర్ల మీద సంతకం..

రేపు ఉదయం ఎక్కడికి వెళ్లకు అన్నయ్య.. నీకు రాఖీ కడతా అని రమణయ్యతో తాయారు అంటుంది. నువ్వు నారాయణ మామయ్యకి కూడా రాఖీ కట్టాలి.. లేదంటే నేను నా భర్తకు అన్ని నిజాలు చెప్పేస్తా.. అని గాయత్రి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏంటే అలా అంటున్నావ్ అని తాయారు భయపడుతుంది. చెల్లెమ్మ వాడు కూడా మన వాడే కదా.. కట్టు అని అంటాడు రమణయ్య. దీంతో గాయాత్రి లోపలకు వెళ్లిపోతుంది. రాఖీ కట్టి.. ఇంటి పేపర్ల మీద సంతకం పెట్టు అని అడుగు అని తాయారుకి సలహా ఇస్తాడు రమణయ్య.

కలిపే ప్లాన్..

కలిపే ప్లాన్..

ఫోన్ ఎత్తగానే.. మహాకి బాగా లేదా.. ఏమైనా అయిందా? ఆరోగ్యం బాగా లేదా? నువ్వు ఏమైనా అన్నావా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది హారిక. నేను ఆమెని అనేంత సాహసం చేయలేను అని .. మహా బాధ గురించి చెప్తాడు చక్రి. వాళ్ల అన్న ఇచ్చిన గొలుసు లింక్ తెగిందనే బాధ పడుతోంది.. రేపు వాళ్ల అన్నకి రాఖీ కట్టించాలి.. అని ఓ ప్లాన్ చెప్తాడు చక్రి. ఇక హారికకి కూడా ఆది బాధ పడుతున్న విజువల్స్ గుర్తుకు వస్తాయి. సరే ఆయన్ని బయటకు తీసుకు వస్తా అని అంటుంది హారిక.

సంతకం అని సైగ..

సంతకం అని సైగ..

ఉదయం పూట రమణయ్యకి రాఖీ కడుతుంది తాయారు. మీ అన్నా చెల్లెళ్ల ప్రేమ చూసి ఆనందం వేస్తోంది అని గాయత్రి సెటైర్ వేస్తోంది. నా చెల్లికి నేనంటే ప్రేమ అని రమణయ్య అంటే.. అవును ఆ మామయ్య మీదున్న ప్రేమను కూడా నీ మీదే చూపిస్తుందని గాయత్రి అంటుంది. మరి ఆ మామయ్యకి కడుతున్నావా?లేదా? అని గాయత్రి అంటే.. కట్టను అని అంటుంది తాయారు. సంతకం అని సైగ చేస్తాడు రమణయ్య. దీంతో కడతాను అని అంటుంది తాయరు. దీంతో గాయత్రి సంబర పడుతుంది.

హడావిడిగా వచ్చిన గాయత్రి..

హడావిడిగా వచ్చిన గాయత్రి..

వర్క్ చేసుకుంటున్న మహా వద్దకు చక్రి వస్తాడు. ఈ రోజు మీకు ఒక సర్ ప్రైజ్.. మనం బయటకు వెళ్లాలి అని అంటాడు చక్రి. ఇంతలో గాయత్రి హడావిడిగా వస్తుంది. మామయ్య లేడా? అని అడుగుతుంది. ఏమైందే అని పెద్ది అడుగుతాడు. మా అమ్మ.. వస్తుంది.. మామయ్యకు రాఖీ కడుతుంది అంట అని గాయత్రి చెబుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. ప్రోమోని బట్టి చూస్తే రాఖీ కట్టిన తర్వాత ఇంటి పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగినట్టుగా కనిపిస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *