Gundeninda Gudigantalu Serial Today 30 August Episode: శాడిస్ట్ మొగుడి గురించి చెప్తూ మౌనిక కన్నీరు.. బాధపడ్డ మీనా.. చెల్లి గురించి బాలు కలలు
Gundeninda Gudigantalu Serial Today 30 August Episode: శాడిస్ట్ మొగుడి గురించి చెప్తూ మౌనిక కన్నీరు.. బాధపడ్డ మీనా.. చెల్లి గురించి బాలు కలలు

నేను వెళ్లకపోతే మా బాలు అన్నయ్య చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు అత్తయ్య.. నా కోసం అక్కడ మా అన్నయ్య ఎదురు చూస్తుంటాడు అని మౌనిక ఏడుస్తుంది. నువ్వేం బాధ పడకు అమ్మ.. వాడు బయటకు వెళ్లిన తర్వాత.. నిన్ను మీ ఇంటికి పంపిస్తా అని అంటుంది సువర్ణ. అది జరగదు.. ఆయన మనల్ని నమ్మడు.. వెళ్తే మళ్లీ ఇంకా ఎంత గొడవ చేస్తాడో.. నా కర్మ ఇంతే అనుకుంటా అత్తయ్య.. ఈయనకు తోడబుట్టిన వాళ్లుంటే ఆ బాధ ఏంటో అర్థమయ్యేది.. అని మౌనిక ఏడుస్తుంది.
మంచిగా నిద్ర పోతున్న మీనాని మధ్యలోంచి లేపుతాడు బాలు. అలా నిద్రలేపి ఇంట్లో క్యారెట్ ఉందా? అని అడుగుతాడు. దీనికి ఇప్పుడు నిద్ర లేపాలా? ఉదయం అడగొచ్చు కదా? అని అంటుంది మీనా. మౌనికకి క్యారెట్ హల్వా ఇష్టం కదా.. అందుకే అడిగా అని బాలు అంటాడు. మౌనిక పెద్దింట్లో ఉంటుంది.. కాస్ట్ లీ స్వీట్‌లు ఉంటాయి.. కానీ తనకు ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి పెడితే బాగుంటుంది కదా అని బాలు అంటాడు. అసలు మౌనిక వస్తుందని మీకు చెప్పిందా? మీరు ఫోన్ చేశారా? అని మీనా అడుగుతుంది.
నా కోసం కచ్చితంగా వస్తుంది.. ఆపడానికి అతను ఎవరు.. నేను అయినా వెళ్తాను.. అని బాలు అంటాడు. మళ్లీ గొడవలు ఎందుకు అండి అని మీనా అంటుంది. చిన్నప్పుడు మా అమ్మ కూడా మౌనికను నాకు దూరంగానే ఉంచేది.. చిన్నప్పుడు నాకు ఎవరైనా రాఖీ కడతారా? అని ఎదురు చూసేవాడ్ని.. కాస్త పెద్దయ్యాక ఈ ఇంటికి వచ్చా.. అప్పుడు కూడా నన్ను ఈ మనోజ్ గాడు దూరం పెట్టేవాడు.. రవి గాడికి ఏం తెలిసేదీ కాదు.. నాకు మా అమ్మ ఏనాడూ అన్నం పెట్టలేదు.. కానీ మౌనిక మాత్రం ప్రతీ రోజు అన్నం పెట్టేది.. నన్ను అమ్మలా చూసుకునేది
మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు.. వస్తుందని కలలు కంటున్నారు.. అసలు అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? వస్తుందని అంత నమ్మకంగా ఎలా అనుకుంటున్నారు అని మీనా అడుగుతుంది. మౌనికకి నేను అంటే చాలా ప్రేమ.. కచ్చితంగా వస్తుంది అని బాలు అంటాడు. ఒక వేళ రాకపోతే ఏం చేస్తారండి అని మీనా అడుగుతుంది. అలా అనకు మీనా.. నా కోసం కచ్చితంగా వస్తుంది అని బాలు ఎమోషనల్ అవుతాడు. మీరు మరీ చిన్న పిల్లాడిలా అవుతున్నారు అని మీనా అంటుంది. నా చెల్లి కోసం కదా అని బాలు అంటాడు.
తోడు పెడతాను అని చెప్పి కిచెన్‌లోకి వెళ్లి మౌనికకు ఫోన్ చేస్తుంది. వదిన ఫోన్ చేస్తోంది ఏంటి? అని కన్నీటిని ఆపుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మౌనిక. ఎలా ఉన్నావ్ మౌనిక అని మీనా అడుగుతుంది. నీకు సమాధానం తెలిసే అడుగుతున్నావ్ కదా వదిన.. నా ఐశ్వర్య గురించి నీకు తెలిసిందే కదా.. పాములు మెడలో వేసుకుని ఉన్నట్టుగా ఉంది.. కొండంత బంగ్లాలో ఒంటరిగా ఉన్నట్టు ఉంది.. శిక్ష వేయని జడ్జ్.. జైలు, తినడానికి పంచ భక్ష్య పరమాన్నం.. కానీ వడ్డించే వంట మనిషిలా తప్పా.. కలిసి కూర్చుని తినే ఇంటి మనిషిలా లేను..
ఇక్కడ కత్తులు, బల్లెం వంటివి ఏం లేవు వదినా.. ఒక్క మా ఆయన మాటలు తప్పా.. ఇక్కడ క్రూర మృగాలు, జంతువులు ఏం లేవు వదినా.. ఒక్క మా ఆయన తప్పా.. నాకు వీటితో సంసారం చేయడం అలవాటు అయింది.. భరించేస్తాను.. ఈయనకు తోబుట్టువులు ఉంటే ఆ బంధం తెలిసేది.. కానీ.. ఒంటరిగా పెరిగిన వాడికి బంధం విలువ ఏం తెలుస్తుంది వదినా అని అంటుంది మౌనిక. నువ్వు వస్తావ్ అని, రాఖీ కడతావ్ అని మీ అన్న కలలు కంటూ ఉంటున్నాడు.. అని మీనా అంటుంది.
వచ్చి రాఖీ కడతావా? అని మీనా అడిగితే.. రాఖీలో ఏం లేదు.. రంగు దారాలు, మెరిసే కాగితాలు తప్పా.. వస్తేనే ప్రేమ ఉన్నట్టు, కడితేనే ప్రేమ ఉన్నట్టు.. రాకపోతే లేనట్టు కాదు అని చెప్పు వదిన.. అన్నంటే ఈ చెల్లికి ఎప్పుడూ ప్రేమే అని చెప్పు వదినా అని కన్నీరు పెట్టుకుంటుంది మౌనిక. ఇంత చిన్న వయసులో అంత వైరాగ్యం వచ్చినట్టు మాట్లాడుతోంది మీనా కన్నీరు పెట్టుకుంటుంది. తోడు పెట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు అని బాలు అడుగుతాడు. ఏం లేదు అని చెప్తుంది.. రేపు ఎలాగైనా మౌనిక వచ్చేలా చేయ్ దేవుడా అని మీనా అనుకుంటూ నిద్రపోతుంది.
ఉదయాన్నే టిఫిన్ కావాలని మనోజ్ అంటాడు. కిచెన్‌లోనే ఉంది.. మీ ఆవిడను పెట్టమను అని మీనా అనేసి వెళ్లిపోతుంది. ఇంతలో రోహిణి వచ్చి.. నేను పెడతాను అని అంటుంది మనోజ్. ఏనాడైనా చేసి పెట్టిన మొహమేనా? అని మనోజ్ తిడతాడు. నువ్వు అవసరం లేదు.. నేనే పెట్టుకుంటా అని పెట్టుకుని తింటూ ఉంటాడు మనోజ్. మింగు మింగు అని రోహిణి లోలోపల అనుకుంటుంది. నాక్కూడా ఆకలి అవుతోంది.. తినిపించొచ్చు కదా అని అడుగుతుంది రోహిణి. నువ్వే తిను.. నేను తినిపించను అని అంటాడు మనోజ్.
మనోజ్ కంట్లో కారం పడితే.. చూస్తుంటుంది రోహిణి. కానీ ప్రభావతికి మాత్రం ఆ ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చీ ఛీ.. చండాలం.. దూరంగా జరిగారా? అని గట్టి గట్టిగా అరిచేస్తుంది ప్రభావతి. దీంతో అందరూ కిందకు వస్తారు. మీరు అనుకున్నట్టుగా ఏం జరగలేదు అత్తయ్య అని రోహిణి అంటుంది. అసలేం జరిగింది అని సత్యం అడుగుతాడు. అలాంటి నికృష్టమైన పనుల గురించి ఎలా చెప్పాలి అని ప్రభావతి అంటుంది. పలకడానికే కష్టంగా ఉంది.. అలాంటి పని నువ్వేం చేశావ్ రా అని మనోజ్‌ని బాలు అడుగుతాడు.