Gundeninda Gudigantalu Serial Today 29 August Episode: మీనాని తొక్కేందుకు చింతామణితో మళ్లీ చేతులు కలిపిన ప్రభావతి.. అన్న కోసం మౌనిక ఆరాటం.. హింసిస్తున్న శాడిస్ట్ మొగుడు

 Gundeninda Gudigantalu Serial Today 29 August Episode: మీనాని తొక్కేందుకు చింతామణితో మళ్లీ చేతులు కలిపిన ప్రభావతి.. అన్న కోసం మౌనిక ఆరాటం.. హింసిస్తున్న శాడిస్ట్ మొగుడు

Gundeninda Gudigantalu Serial Today 29 August Episode: మీనాని తొక్కేందుకు చింతామణితో మళ్లీ చేతులు కలిపిన ప్రభావతి.. అన్న కోసం మౌనిక ఆరాటం.. హింసిస్తున్న శాడిస్ట్ మొగుడు

Gundeninda Gudigantalu Serial Today Episode గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మీనాని అణగ తొక్కేందుకు మళ్లీ చింతామణితో చేతులు కలుపుతుంది ప్రభావతి. మీనా ఎప్పటికీ తన చెప్పుచేతల్లోనే ఉండాలని ప్లాన్స్ వేస్తుంది ప్రభావతి. ఇంకో వైపు చెల్లి కోసం ఓ చీర కొంటాడు బాలు. రాఖీ పండుగకు నా చెల్లి వస్తుందని మీనాతో సంబరంగా చెప్పుకుంటాడు. ఇంకో వైపు మౌనిక ఏమో రాఖీలు కొన్న విషయాన్ని తెలుసుకున్న సంజు.. ఆమెని హింసిస్తుంటాడు. మీ అన్నని చంపేస్తా అంటూ సంజు రెచ్చిపోతుంటాడు.
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
మీ ఆవిడకు కొమ్ములు వచ్చాయ్ రా అని బాలుతో ప్రభావతి కోపంగా అంటుంది. నీకు ఎలా తెలుసు.. కొంపదీసి పొడిచిందా? ఏంటి? అని బాలు అంటాడు. మీ సంగతి చెప్తా ఆగు అని ప్రభావతి అంటుంది. ఇప్పుడే చెప్తావా? వచ్చాక చెప్తావా? ఒక్కొక్కరికి ఒక్కోసారి ఎందుకు.. అందరికీ ఒకేసారి చెప్పుచ్చు కదా అని బాలు ఏడ్పిస్తాడు. దీంతో ప్రభావతి చిరాగ్గా, కోపంతో బయటకు వెళ్తుంది. ఏంటి మీనా.. మా అమ్మ అంత కోపంగా వెళ్తోందని బాలు అడుగుతాడు. మీనా మన ఆంటీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది.. అందుకే ఆ కోపం అని శ్రుతి అంటుంది. అవునా? నా భార్య.. మా అమ్మకి ఎదురు సమాధానం చెప్పిందా? అని ఎత్తుకుని తింపుతాడు బాలు. అయ్యో ఆగండి.. ఎవరున్నారో కాస్త చూసుకోండని మీనా సిగ్గు పడుతుంది. నేనేం అనుకోను అని శ్రుతి అంటుంది. పొలం అమ్మేస్తా అని చెప్పిందంటూ శ్రుతి అంటుంది. అవునా? అమ్మేద్దామా? శీలా డార్లింగ్‌ను అడగాలా? అని బాలు అంటాడు. పెద్దల ఆస్తిని అమ్మకూడదు.. పెంచకపోయినా పర్లేదు, అమ్మ కూడదు.. అది భావి తరాలకు చెందాలని మీనా అంటుంది. ఆ మాటలకు బాలు, శ్రుతి షాక్ అవుతారు. కావాలంటే సింగరాజు గారిని డబ్బులు అడుగుదాం అని మీనా సలహా ఇస్తుంది.

వేరే దారి లేదు..

వేరే దారి లేదు..

నువ్వు అడిగితే బామ్మ ఇస్తుంది.. కావాలంటే పొలం అయినా అమ్మేస్తుంది.. అడుగుతాను మీనా అని బాలు అంటాడు. నేను ఎందుకు అలా అడుగుతాను అండి.. పెద్దల ఆస్తిని మనం మన పిల్లల కోసం ఉంచాలన్నట్టుగా మీనా మాట్లాడుతుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకు వద్దాం అని బాలు అంటే.. మళ్లీ ఆ సింగరాజు గారినే అడుగుదాం అని మీనా అంటుంది. నువ్వే కదా.. ఆ సింగరాజు గారిని అడగొద్దు అని అన్నావ్.. అని బాలు అంటే.. మనకు వేరే దారి లేదు కదండి అని మీనా అంటుంది.

మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందట..
మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందట..

ప్రభావతికి స్వీట్ ఇస్తుంటుంది కామాక్షి. నాకు స్వీట్ వద్దు కారం కావాలి.. మండిపోతుంది అని అంటుంది ప్రభావతి. తీపి తింటే స్వీట్ మాటలు వస్తాయి.. అని కామాక్షి అంటే.. దీని కోసం రాలేదు.. ఆ చింతామణి కోసం వచ్చా.. అని ప్రభావతి అంటుంది. చింతామణి అయితే మంచి మాటలు మాట్లాడుతూ గోతులు తీస్తుంది లే అని అంటుంది కామాక్షి. అదే టైంకి చింతామణి వస్తుంది. మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చింది.. ఐదు లక్షలు అడ్వాన్స్ కట్టాలంట కదా అని ప్రభావతి చెబుతుంది. అవునా అయితే.. స్వీట్ తినాల్సిందే అని కామాక్షి అంటుంది.

దానికి ఆర్డర్ రావొద్దు..

మీనాకి ఆ ఆర్డర్ రాకూడదు.. ఆ డబ్బుల కోసం నా ఇంటికి ఎసరు పెట్టాలని చూసింది.. కానీ నేను ఒప్పుకోలేదు.. మా అత్త గారి పొలాన్ని అమ్మాలని చూస్తుందంటూ ప్రభావతి చెబుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆర్డర్ మీనాకి దక్క కూడదు.. దానికి పొగరు పెరిగిపోతుంది.. అది నా చెప్పు చేతల్లోనే ఉండాలి.. నువ్వేం చేస్తావో నాకు తెలీదు.. అలా అని లాస్ట్ టైం అయినట్టు.. దానికి నష్టం అయితే రాకూడదు.. అసలు ఆర్డర్ రాకుండానే చేయాలి అని చెబుతుంది ప్రభావతి. మీరేం కంగారు పడకండి.. అని చింతామణి అంటుంది.

బాలు గెలిపిస్తాడు..

బాలు, మీనా అడిగితే మా అత్త పొలం ఇస్తుంది అని ప్రభావతి అంటే.. రెండు రోజుల్లో పొలం అమ్మడం, డబ్బులు రావడం జరగదు.. కాబట్టి మీనాకి ఆర్డర్ రాదు లే అని చింతామణి అంటుంది. మీనాకి కచ్చితంగా ఆర్డర్ వస్తుంది.. బాలు గాడు మీనాని గెలిపిస్తాడు.. కావాలంటే మీకు రాసిస్తాను చూసుకోండని కోపంతో వెళ్లిపోతుంది కామాక్షి. ఆమె మాటల్ని అంతగా పట్టించుకోకు.. కానీ నా మాటల్ని మాత్రం సీరియస్‌గా తీసుకో అని అంటుంది ప్రభావతి. సరే అని చెప్తుంది చింతామణి. ఇంకో వైపు బాలు కొత్త చీరను పట్టుకొస్తాడు.

మా చెల్లి కోసం తీసుకున్నా..

మా చెల్లి కోసం తీసుకున్నా..

అప్పటికే తన తమ్ముడు శివకి రాఖీ కట్టాలని, కొత్త చీర లేదే అని మీనా అనుకుంటూ ఉంటుంది. అంతలో బాలు కొత్త చీర తీసుక వస్తే.. బాగుందని మీనా అంటుంది. కానీ బాలు చెప్పేది మీనా వినదు. ఇది మా చెల్లి మౌనికకి తీసుకు వచ్చా అని బాలు అంటాడు. నాకు నచ్చింది.. నేను తీసుకుంటా అని కావాలనే అంటుంది మీనా. సరే అని బాలు డల్ అవుతాడు. నాకు తెలుసండి.. ఇది మౌనిక కోసమే తీసుకు వచ్చారు అని మీనా అంటుంది. కానీ మౌనికను వాళ్ల ఆయన పంపిస్తాడా? అని మీనా అడుగుతుంది. కచ్చితంగా వస్తుందని బాలు అంటాడు.

సంజుకి అనుమానం..

సంజుకి అనుమానం..

ఇంతలో మౌనిక కొన్ని రాఖీలను ఆర్డర్ పెడుతుంది. ఏంటి అది అని సంజు అడుగుతాడు. ఏం లేదు.. రేపు వ్రతం కదా.. పసుపు, కుంకుమ ఆర్డర్ పెట్టా అని చెబుతుంది. దీంతో సంజుకి అనుమానం వస్తుంది. సరే నాకు ఏదైనా చేసి పెట్టు అని సంజు అడిగితే.. కిచెన్‌లోకి వెళ్తుంది మౌనిక. అంతలోపు సంజు బెడ్రూంలోకి వెళ్లి.. మౌనిక దాచి పెట్టిన కవర్‌ను వెతుకుతాడు. ఇక మౌనికకి కూడా అనుమానం వస్తుంది. మౌనిక బెడ్రూంలోకి వచ్చే సిరిక సంజుకి ఆ రాఖీలు కనిపిస్తాయి. ఇవేనా పసుపు, కుంకుమ అని సంజు అడుగుతాాడు.

చంపాలని చూస్తున్నా..

మరి పూలు ఏవి.. నా చెవిలో పెట్టావా? అని సంజు కౌంటర్ వేస్తాడు. నేను వస్తాను అని మా అన్నలు ఎదురు చూస్తుంటారు అని మౌనిక అంటే.. అందులో ఒకడ్ని చంపాలని నేను చూస్తున్నా అని సంజు అంటాడు. ఎందుకు అండి అలా మాట్లాడతారు.. ఎవరు గొడవ పడినా.. ఎవరో ఒకరి ఐదో తనం పోతుంది కదా అని మౌనిక అంటుంది. అంటే మీ అన్న.. నన్ను చంపేస్తాడా? చూద్దాం.. ఎవరు ఎవరిని చంపేస్తారో.. నువ్వు మాత్రం అక్కడకు వెళ్లడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తాడు సంజు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *