Gundeninda Gudigantalu Today మే 8 ఎపిసోడ్: రోహిణిని చావబాదిన ప్రభావతి.. చంపేస్తా అంటూ ఊగిపోయిన అత్త.. నక్కలా జారుకున్న మనోజ్
Gundeninda Gudigantalu Today మే 8 ఎపిసోడ్: రోహిణిని చావబాదిన ప్రభావతి.. చంపేస్తా అంటూ ఊగిపోయిన అత్త.. నక్కలా జారుకున్న మనోజ్

ఆ లక్షలు ఎవరి దగ్గర రాబట్టామో నీకు తెలుసా? సాక్ష్యం ఉందా? అని బాలుని దబాయిస్తుంది రోహిణి. తెలుసు.. సాక్ష్యమే కాదు.. సాక్షి కూడా ఉన్నారు అని బాలు చెప్పడంతో రోహిణి మొహం మాడిపోతుంది. కల్పన పేరు బాలు ఎత్తగానే మనోజ్, రోహిణి దెబ్బకు షాక్ అవుతారు. కల్పనా ఎక్కడకో కెనాడికి వెళ్లింది.. అని మనోజ్ అంటే.. వచ్చింది.. సాక్ష్యం తెచ్చింది అని బాలు అంటాడు. ఫారినమ్మ అని కల్పనని లోపలకు పిలుస్తాడు బాలు. ఆమెను చూసి రోహిణి, మనోజ్ భయంతో వణికిపోతారు. ఆ రోజు సాక్షి సంతకం పెట్టింది బాలు గాడా? అని మనోజ్ లోలోపల అనుకుంటాడు. అవును అని బాలు తలూపుతాడు. మనోజ్‌కి ఈవిడ ఎలా పడిందబ్బా? అని శ్రుతి అంటే.. మా అన్నే ఆవిడ వల్లో పడ్డాడు అని రవి కౌంటర్ వేస్తాడు. ఆంటీ, అంకుల్ సారీ.. మీ అబ్బాయిని మోసం చేయడం, నలభై లక్షలు పట్టుకుని కెనడాకి పారిపోయింది కూడా నిజమే అని కల్పన అంటుంది. అంత సులువుగా ఎలా చెబుతున్నావ్ అమ్మ.. నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు అని సత్యం అంటాడు.
కల్పనను నిలదీసిన ప్రభావతి
కల్పనను నిలదీసిన ప్రభావతి
నేను చెమట్చోడి, రక్తం చిందించి సంపాదించిన డబ్బుని తీసుకెళ్లడానికి నీకు మనసెలా ఒప్పింది అని సత్యం నిలదీస్తాడు. కాస్త జాలి, దయ కూడా లేకుండా తీసుకెళ్లిపోయావే నీకు న్యాయంగా ఉందా? అని సత్యం అంటాడు. సారీ అంకుల్.. ఆ టైంలో నా గురించి మాత్రమే నేను ఆలోచించాను అని కల్పన అంటుంది. చీ నోర్ముయ్ సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నావే.. అది దొంగపని.. దొంగతనం చేసి దేశం విడిచి పారిపోయిందే కాక.. ఇంకా ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడుతున్నావ్ అని కల్పనని తిడుతుంది ప్రభావతి. నీకు అసలు మనస్సాక్షి ఉందా? ఎంత ధైర్యమే నీకు అని నిలదీస్తుంది ప్రభావతి.
కన్నతల్లిని, కన్నతండ్రిని మోసం చేయలేదా
మరి మీ అబ్బాయికి ఎంత ధైర్యం? మీ అబ్బాయికి మనస్సాక్షి ఉందా? నేనంటే పరాయి దాన్ని.. మీరెవరో నాకు తెలీదు.. మీ అబ్బాయికి వల వేశాను.. పట్టాను.. డబ్బు తీసుకుని పారిపోయాను.. మనోజ్ మీ కొడుకు.. మీరు నమ్మి 40 లక్షలు ఇచ్చారు.. పట్టుకుని పారిపోయాడు.. ఇతనికి ఉందా సిగ్గు, ఇతనికి ఉందా మనస్సాక్షి.. అని కల్పన నిలదీస్తుంది. ఇతను చేసింది దొంగ పని కాదా? కన్నతల్లిని, కన్నతండ్రిని మోసం చేయలేదా? అని కల్పన అంటుంది. ఆవిడ ఏదో అడుగుతోంది.. జవాబు చెప్పడం లేదేంటి.. అని ప్రభావతిని నిలదీస్తుంది మీనా.
డబ్బు తిరిగి ఇచ్చింది కూడా నేనే
నా భర్త కష్టాన్ని దోచుకుపోవడానికి నీకు సిగ్గు లేదా? అని ప్రభావతి అంటుంది. నీ భర్త కష్టపడి సంపాదించిన దాన్ని దోచుకపోయి ప్రియురాలి చేతుల్లో పెట్టింది మీ కొడుకు.. ఆ ప్రియురాలి తప్పు ఎలా అవుతుంది? మీ కొడుకు తప్పు అవుతుంది అని కల్పన అంటుంది. మరి ఆ డబ్బు అంతా అనుభవించింది నువ్వు కాదా? అని ప్రభావతి నిలదీస్తుంది. ఆ డబ్బు తిరిగి ఇచ్చింది కూడా నేనే అని కల్పన చెప్పడంతో ప్రభావతి, సత్యం షాక్ అవుతారు. ఏంటి చూస్తున్నారు.. మీరంతా సరిగ్గానే విన్నారు అని బాలు అంటాడు.
మొత్తం నిజం చెప్పిన కల్పన..
నువ్వు తిరిగి ఇచ్చింది గ్రాట్యుటీ డబ్బా? అని ఆశ్చర్యంతో అడుగుతాడు సత్యం. అంతే కాదు అంకుల్.. వడ్డీతో సహా 45 లక్షలు ఇచ్చాను.. అని కల్పన చెప్పడంతో సత్యం నోరెళ్లబెట్టేస్తాడు. ఇంట్లో వారంతా కూడా మనోజ్ చేసిన పనికి షాక్ అవుతారు. 45 లక్షలు ఇచ్చావా? ఎవరికి ఇచ్చావ్ అని ప్రభావతి అడుగుతుంది. మీ ముద్దుల కొడుకు, కోడలికే ఇచ్చాను. వడ్డీ డిమాండ్ చేసిందే మీ కోడలు అని కల్పన నిజాలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా అబద్దం, బాలు ఆడుతున్న నాటకం అని రోహిణి, మనోజ్ బుకాయిస్తుంటారు.
పోలీసుల్ని పిలిపించాలా?
పోలీసుల్ని పిలిపించాలా?
ఇంకా నువ్వు మా ఆయన్నే అంటున్నావా? మా ఆయన మీదకే నెట్టేస్తున్నావా? దేవుడు లాంటి మామయ్యకి, ఈ ఇంటికి మీరు చేసిన మోసం గురించి ఎలాంటి సాక్ష్యం లేకుండా మా ఆయన వస్తాడని అనుకుంటున్నావా? అని రోహిణికి కౌంటర్ వేస్తుంది మీనా. సాక్ష్యం ఉందా? అని ప్రభావతి అడుగుతుంది. సాక్ష్యం లేకుండా వస్తానా? బాలుకి తెలియకుండానే ఇక్కడ సాక్షి సంతకం చేశాడు అని చెప్పడంతో రవి వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తాడు. ఇదంతా నమ్మకు అమ్మా అని మనోజ్ అంటాడు. పోలీసుల్ని పిలిపించమంటారా? అని కల్పన, బాలు బెదిరిస్తారు.
బాలు మంచోడు..
మీ కొడుకు చవటదద్దమ్మ.. కానీ మీ కోడలు మాత్రం పెద్ద ఖిలాడీ.. మీ కొడుకు ఈ విషయం దాచి పెట్టాడంటే.. ఇదంతా మీ ఖిలాడీ కోడలివే.. నన్ను క్షమించండి అంకుల్.. మీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చాను.. మీ కొడుకే మిమ్మల్ని మోసం చేశాడు.. అని కల్పన చెప్పి వెళ్తుంది. వెళ్లే ముందు.. మీరు మనోజ్‌ని చాలా చదివించి ఉండొచ్చు.. చాలా డిగ్రీలు వచ్చి ఉండొచ్చు.. కానీ అమ్మానాన్నల మీద మాత్రం అస్సలు ప్రేమ లేదు.. కానీ బాలుకి ఏ డిగ్రీలు లేకపోయి ఉండొచ్చు.. నిజాయితీ గల వ్యక్తి.. ఎవ్వరినీ మోసం చేయడు.. ఇదంతా బాలు కోసమే చేశాను అని చెప్పి వెళ్తుంది.
ఇంట్లో దోషిగా రోహిణి, మనోజ్..
ఏం మనిషివిరా నువ్వు.. అని రవి తిడతాడు. ఇద్దరికిద్దరు ఇంత ఫ్రాడ్ చేశారా? అని శ్రుతి అంటుంది. ఒకరు ఫ్రాడ్ ఉంటే.. ఇంకొకరు సిన్సియర్‌గా ఉంటారు.. కానీ మీరు మాత్రం దారుణంగా ఉన్నారు అని శ్రుతి అంటుంది. అంకుల్ని, రవి, బాలుని మోసం చేశారు.. అందరి డబ్బు లాగేశారు.. దొరికిపోతే ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలీదా? అని శ్రుతి తిడుతుంది. అత్తగారింటి విషయాల్ని నేను చేరవేస్తున్నాను అని ఇంతకు ముందు అత్తగారు ఏదో అన్నారు.. మరి పెద్ద కోడలు 45 లక్షలు ఎక్కడకు చేరవేసిందో అడగరా? అని ప్రభావతికి మీనా కౌంటర్ వేస్తుంది.
రోహిణిని ఏమీ అనలేకపోయిన సత్యం..
మనోజ్‌ని సత్యం ఎడాపెడా తిడుతూ, చీవాట్లు పెడతాడు. అమ్మా రోహిణి.. కోడల్లని కూతుళ్లలానే చూశాను కదా.. నువ్వైనా నా గురించి ఆలోచించలేదా? ఆ మాత్రం మనసు రాలేదా? అని సత్యం నిలదీస్తాడు. 45 లక్షలు ఏం చేశారో అడగరా? అని బాలు అంటాడు. ఆ డబ్బుతో ఫర్నీచర్ షాప్ పెట్టారా? అని సత్యం అడిగితే.. అవును అని రోహిణి చెబుతుంది. దీంతో మరోసారి అంతా షాక్ అవుతారు. నాన్న, మామ ఇచ్చారని రోహిణి చెప్పిన అబద్దాన్ని గుర్తు చేసుకుంటాడు సత్యం. ఇక మనోజ్‌ని ప్రభావతి నిలదీస్తుంది.
మనోజ్ కాలర్ పట్టుకుని..
నలుగురిని కన్నాను.. కానీ నీ గురించే కలలు కన్నాను అంటూ ప్రభావతి ఎమోషనల్ అవుతుంది. నోరు కట్టుకుని, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని అందరూ పంచుకోకుండా నువ్వొక్కడివే తీసుకుని పోయావే.. ఆ రోజు కూడా నువ్వు నా మీద జాలి చూపించలేదే.. మీ నాన్న కష్టాన్ని దోచుకుని ఇంకెవరికో దోచిపెడుతున్నప్పుడు ఆ రోజు కూడా ఈ తండ్రి మీద నీకు జాలి కలగలేదా? మళ్లీ ఆ డబ్బు తిరిగి వస్తే అప్పుడు కూడా మేమంతా గుర్తుకు రాలేదా? మా అందరికీ ద్రోహం చేసేందుకు మనసు ఎలా వచ్చింది.. అని మనోజ్‌ని ప్రభావతి నిలదీస్తుంది.
రోహిణి మీదకు నెట్టేసిన మనోజ్..
డబ్బు రాగానే.. ఈ డబ్బు వాళ్ల నాన్న ఇచ్చాడని, షోరూం ఓపెన్ చేద్దామని ఐడియా ఇచ్చింది రోహిణినే.. నాకు ఏం తెలీదు అమ్మా అని మొత్తం రోహిణి మీదకు నెట్టేస్తాడు మనోజ్. దీంతో ఇంట్లో వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. రవి, శ్రుతి ఇందాక అత్తగారు ఏమన్నారో తెలుసా.. నీ పుట్టింటి నుంచి రూపాయి తెచ్చే గతి లేదు.. నా పెద్ద కోడలిని చూడు.. వాళ్ల నాన్నని అడిగి 25 లక్షలు తెచ్చి షోరూంని ఓపెన్ చేయిందని చెప్పింది.. ఎవరిని అడిగి.. వాళ్ల నాన్నని అడిగి.. అని మీనా కౌంటర్లు వేస్తుంది. ఇప్పుడు అసలు విషయం తెలిసిందా? అని ప్రభావతిని నిలదీస్తుంది మీనా.
రోహిణిపై ప్రభావతి ఫైర్..
ఇక రోహిణి చెప్పిన అబద్దాల్ని ప్రభావతి గుర్తు చేసుకుంటుంది. ఏరా బిజినెస్ మెన్.. మీ మామ డబ్బులు ఇచ్చారా? అని బాలు కౌంటర్లు వేస్తాడు. నిన్ను నెత్తిన పెట్టుకున్నాను.. నువ్వు మా అందరినీ ఇంత మోసం చేస్తావా? ఎందుకు చేశావే.. అని లాగి పెట్టి కొడుతుంది ప్రభావతి. కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు కదే.. అప్పుడైనా నిజం చెప్పాలని అనిపించలేదా?.. అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. సిగ్గు లేదానే నీకు.. అని రోహిణిని కుక్కని కొట్టినట్టు కొడుతుంది ప్రభావతి. నన్ను ఆపకండి.. ఇది నా నమ్మకాన్ని ముక్కలు చేసింది అని ప్రభావతి ఫైర్ అవుతుంది.
ఎదురు తిరిగిన రోహిణి..
మళ్లీ రోహిణి ఏదో ఒక అబద్దం చెప్పాలని చూస్తుంది. దీంతో ప్రభావతి మరింత ఫైర్ అవుతుంది. చంపేస్తావా? ఏంటి అని సత్యం అడిగితే.. అవును చంపేస్తా.. ఇంత నమ్మక ద్రోహాన్ని భరించలేను.. జీవితంలో క్షమించలేను.. అని ప్రభావతి అంటుంది. నేనే గనుక షోరూం పెట్టించకపోతే మీ కొడుకు గుడి మెట్ల వద్ద అడుక్కుతినేవాడు అని రోహిణి అంటుంది. మా డబ్బులు కొట్టేసి నా కొడుకుని ఉద్దరించినట్టుగా చెబుతున్నావ్ ఏంటి? అని ప్రభావతి శివాలెత్తుతుంది. నా కొడుక్కి చదువులేదా? తెలివి లేదా? అని రోహిణిని అడుగుతుంది ప్రభావతి.
చితకబాదిన ప్రభావతి..
తెలివే ఉంటే కల్పన దగ్గర ఎందుకు మోసపోతాడు.. నేను కాబట్టి ఆమెను పట్టుకుని డబ్బులు వసూల్ చేశాను అని రోహిణి ఎదురు తిరుగుతుంది. ఆ మాటలతో రోహిణిని చితకబాదుతుంది ప్రభావతి. నీ అయ్య కష్టార్జితం అని ఎందుకు చెప్పావ్.. ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా అని ప్రభావతి ఆగ్రహిస్తుంది. నా కొడుక్కి జీవితాన్ని దానం చేసినట్టుగా మాట్లాడుతోంది.. అసలు దీన్ని.. అని ప్రభావతి ఫైర్ అవుతుంది. అమ్మా రోహిణి ముందు నువ్వు లోపలకు వెళ్లు అని సత్యం అంటాడు. ఇక ఇంట్లో వారంతా ప్రభావతిని తిడతారు.
ప్రభావతిని నిందించిన శ్రుతి..
తప్పు ఇద్దరిదీ ఉంది.. మీరు మీ కొడకుని ఏమీ అనకుండా కోడలిని మాత్రం కొడుతున్నారు.. ఇది తప్పు అని శ్రుతి అంటుంది. పార్లరమ్మ చెబితే వీడి బుద్ది ఏమైంది.. తప్పు ఇద్దరిదీ అని బాలు అంటాడు. మెల్లిగా జారుకుందామని మనోజ్ ట్రై చేస్తాడు. ఇంతలో మనోజ్‌ని లాగి పడేస్తుంది ప్రభావతి. పెళ్లాం మాట విని అందరికీ ద్రోహం చేశావ్.. అని మనోజ్‌ని తిడుతుంది ప్రభావతి. ఇంటి కోడలి మీద చేయి చేసుకోవడం తప్పు అని సత్యం అంటాడు. నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక కొట్టింది అని రవి అంటాడు.
షాక్‌లో నలుగురు..
జరిగిన ఘటనల్ని గుర్తు చేసుకుని బాలు, రవి, శ్రుతి, మీనా తమ తమ స్టైల్లో అనుకుంటూ ఉంటారు. ఇదంతా నిజమేనా? మనలో మనం గిల్లుకుని చూద్దాం అని అందరూ కామెడీ చేస్తారు. ఈ కోర్ట్ సీన్ భలేగా ఉంది.. అని రవి, శ్రుతి అంటుంది. కల్పన వచ్చి నిజం చెప్పకపోయి ఉంటే.. ఇంకా అదే అబద్దాన్ని నమ్మేవాళ్లం.. అని మీనా అంటుంది. ఇన్ని క్యాబ్స్ ఉండగా కల్పన.. నీ క్యాబ్‌లోనే ఎందుకు ఎక్కాలి.. సాక్షి సంతకం నువ్వే ఎందుకు పెట్టాలి అని ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవే కాదు.. ఇంత కంటే పెద్ద విషయాలు దాచి పెట్టి ఉందని నా అనుమానం అని రోహిణి గురించి బాలు అంటాడు.
నలుగురి మాటలు విన్న మనోజ్..
రోహిణి అలా మా అన్నయ్యని ఇరికించడం, మా అన్న గురించి తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు అని రవి, బాలు అంటారు. ఇదంతా మనోజ్ వింటూ ఉంటాడు. విషయం తన మీదకు వచ్చే సరికి వాడ్ని ఇరికించేసిందని బాలు అంటాడు. మీ అన్న కూడా తక్కువేం కాదు.. దొరికిపోగానే రోహిణిని ఇరికించేశాడు.. అని మీనా అంటుంది. మనోజ్ మంచి భర్త కాదు.. అలా కొడుతుంటే ఆపను కూడా ఆపలేదు అని శ్రుతి అంటుంది. ఈ మాటలన్నీ మనోజ్ విని బాధపడుతూ వెళ్లిపోతాడు. ఇక రూంలో రోహిణి ఒంటరిగా బాధపడుతుంది. మనోజ్ తన మీదకు నెట్టేయడం, ప్రభావతి కొట్టడం గురించి తల్చుకుని బాధ పడుతుంటుంది.
నా గుండె ముక్కలైంది..
నన్ను ముట్టుకోకు.. నా దగ్గరకు రాకు.. అత్తయ్య కోప్పడుతుందని అనుకున్నాను.. కానీ ఇలా చేయి చేసుకుంటుందని అనుకోలేదు.. నేను ఇంకా ఎక్కువ షాక్ అయిన విషయం చెప్పాలా? అక్కడ అంత జరుగుతుంటే నువ్వు కనీసం సపోర్ట్ చేయలేదు చూశావా.. ఆ నిమిషంలో నా గుండె ముక్కలైంది మనోజ్.. అరె నన్ను అంతమంది ముందు కొడుతుంటే వద్దనే ప్రయత్నం చేయలేదు.. చాలు ఇక.. వెళ్లిపో.. అని రోహిణి అంటుంది. అంటే నువ్వు చేసింది తప్పు కాదా.. అని మనోజ్ రివర్స్ అవుతాడు. నేను తప్పు చేశానా? ఒక్కదాన్నే చేసిన తప్పు ఏంటి? అని రోహిణి అంటుంది.
అందరి ముందు నన్ను అలా అనడం తప్పు కదా అని మనోజ్ అంటాడు. మీ అమ్మ నన్ను కొట్టడం తప్పు కాదు.. నీ గురించి అనడం తప్పు.. వాటే సన్.. వాటే మదర్.. నా చదువులు, నా డిగ్రీలు ఎందుకు పనికి రావని ఎందుకు అన్నావ్? అని మనోజ్ అంటాడు. అవును.. నీ చదువులు, డిగ్రీలు ఎందుకు పనికి వచ్చావ్.. ఇంటి ముందు దిష్టి బొమ్మకి పోటీగా తప్పా ఎందుకు పనికి వచ్చావ్.. నీ చదువులతో నువ్వు సాధించింది ఏంటి? అని మనోజ్‌ని ఇంకా కించపరుస్తుంది రోహిణి.