సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం!
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం!
సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. తాగిన మత్తులో మటన్ వండలేదని భార్యతో గొడవపడుతున్న సమయంలో.. అడ్డొచ్చిన అత్తపై ఓ అల్లుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హైలైట్:
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలో దారుణం
అత్తపై అల్లుడి అత్యాచారం
భార్యతో గొడవ పడుతున్న సమయంలో అడ్డొచ్చిన అత్త
Son in law rape mother in law sangareddy
వట్‌పల్లిలో అత్తపై అల్లుడి అత్యాచారం
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యను వేరే గదిలో బంధించి, అత్త మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అల్లుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వట్ పల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్నిరోజులుగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఇంటికి రోజూ తాగి వస్తుండటంతో భార్య భర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన బాధలను తల్లి వద్ద వాపోయింది అతని భార్య. దీంతో అల్లుడికి నచ్చజెప్పి, కూతురి కాపురాన్ని చక్కదిద్దాలనే ఉద్దేశంతో అత్త.. వేరే ఊరి నుంచి బయల్దేరి అల్లుడి ఇంటికి చేరుకుంది. అయితే శుక్రవారం రాత్రి ఆ వ్యక్తి మరోసారి తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు.
మటన్ వండలేదనే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలోనే అల్లుడికి నచ్చజెప్పేందుకు వెళ్లింది అత్త. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి అత్తను బూతులు తిడుతూ నెట్టేశాడు. ఆ తర్వాత భార్యను ఓ గదిలోకి నెట్టేసి, తలుపుకు గడియపెట్టి, అత్తను మరో గదిలోకి లాక్కెళ్లాడు. గది తలుపుకు గడియపెట్టి అత్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఏడుస్తూ గది నుంచి బయటకు వచ్చిన అత్త.. పక్క గది తలుపు తీసి కుమార్తెకు అసలు విషయం చెప్పింది. అనంతరం తన అల్లుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ వట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అల్లుడిని అరెస్ట్ చేసి.. కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని.. కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ వెల్లడించారు.