రాశిఫలాలు 09 మే 2026: ఈరోజు శుక్ల యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు కెరీర్లో పురోగతి

 రాశిఫలాలు 09 మే 2026: ఈరోజు శుక్ల యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు కెరీర్లో పురోగతి

రాశిఫలాలు 09 మే 2026: ఈరోజు శుక్ల యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు కెరీర్లో పురోగతి

horoscope today 09 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్ల, బ్రహ్మ యోగాల ప్రభావంతో మేషం, కన్య సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May9

horoscope today 09 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శుక్ల, బ్రహ్మ యోగాలు ఏర్పడనున్నాయి. శుక్రుడు వృషభరాశిలో, మేష రాశిలో బుధుడు, సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఈ గ్రహాల ప్రభావంతో మేషం, కన్య సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసి రానుంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. గ్రహాల సంచారం కారణంగా మీకు శుభ ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే పనిలో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడిని పొందుతారు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభించే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన పనిలో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశాలున్నాయి. శని దేవుని అనుగ్రహంతో పెండింగులో ఉన్న మీ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు మంచి ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈరోజు మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవ్వొచ్చు. మీరు చేసే పనిలో కొత్త బాధ్యతలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్లేందుకు మంచి అవకాశాలు లభించొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనిలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలపై రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉండొచ్చు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగా మెరుగుపడుతుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. మీకు అప్పుల నుంచి విముక్తి లభించొచ్చు. మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. పాత వివాదాల నుంచి బయటపడొచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు అనవసరమైన గొడవలు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనులను ఉత్సాహంగా చేసేందుకు ప్రయత్నించాలి. ఈరోజు పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ప్రతికూల ఫలితాలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రాకపోవచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు పని చేసే చోట ఎవరినీ నమ్మకండి. ఉద్యోగులు తమ యజమాని మద్దతు పొందే అవకాశాలున్నాయి. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభించనుంది. ఈరోజు అపరిచితులకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభించొచ్చు. మీరు చేసే ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఇతరులతో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఉండే విభేదాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ఈరోజు వాహనాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొంత ఆందోళన ఉంటుంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఒక కొత్త స్నేహితుని రాక మీలో ఆనందం, ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. పాత బకాయిలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి రావొచ్చు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన పరిస్థితులు పెరగొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *