రాశిఫలాలు 16 జూన్ 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 6 రాశులకు అన్నింటా విజయాలే

 రాశిఫలాలు 16 జూన్ 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 6 రాశులకు అన్నింటా విజయాలే

రాశిఫలాలు 16 జూన్ 2026: ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 6 రాశులకు అన్నింటా విజయాలే

horoscope today 16 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 5 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Jun16
Daily Horoscope in Tel Jun16
horoscope today 16 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు వృద్ధి, ధ్రువ, త్రిపుష్కర యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం, సింహం సహా ఈ రాశుల వారికి అన్ని రంగాల్లో మంచి విజయం లభించొచ్చు. అంతేకాదు కుజుడి స్థానం బలపడనుంది. కొన్ని రాశుల వారికి హనుమంతుని అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, సింహం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. త్రిపుష్కర యోగం కారణంగా అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరగొచ్చు. ఉద్యోగులకు ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచించే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి శుక్రుడు, గురుడు మూడో స్థానంలో నుంచి సంచారం చేయడం కారణంగా మీరు చేసే పనులన్నింట్లో శుభఫలితాలొస్తాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి. అప్పుడు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడొచ్చు. సాయంత్రం నుంచి రాత్రి వరకు దేవాలయాలను సందర్శించడం వల్ల మీకు మనశ్శాంతి లభించొచ్చు. మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేస్తారు..

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో నిరాశ ఎదురుకావొచ్చు. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. ఈ సాయంత్రం సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఇదే రాశిలో గురుడు, శుక్రుడు నివాసం ఉండటం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు భావోద్వేగంతో ఖర్చు చేయడం మానుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి నుంచి కుజుడు దశమ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఉద్యోగులకు కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి నుంచి పదకొండో స్థానంలో సూర్య, చంద్ర, బుధ గ్రహాల కలయిక వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే, దానికి పరిష్కారం లభిస్తుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభయోగాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. శుభ యోగాల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గ్రహాల అనుకూల ప్రభావంతో మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవ్వొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి చంద్రుడి అనుగ్రహంతో అనేక రంగాల్లో అదృష్టం కలిసిరానుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. చంద్రుడి ప్రభావంతో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపొచ్చు. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందొచ్చు. ఈ రాశి నుంచి గురుడు, శుక్ర గ్రహాల ఉనికి ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో గొప్ప ఫలితాలు రానున్నాయి. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. ఈ కారణంగా మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం దక్కే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ కారణంగా భవిష్యత్తులో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. శుభ యోగాల ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలున్నాయి. మీకు పాత అప్పుల నుంచి విముక్తి లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు. ఈరోజంతా మీరు చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించనుంది. మీరు గొప్ప విజయాలు సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంట్లో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే నష్టభయం ఉన్న పెట్టుబడులలో పెట్టకుండా జాగ్రత్త వహించాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మీ కుటుంబ అవసరాలు లేదా ఇంటి పనులకు సంబంధించి ఖర్చులు పెరగొచ్చు. ఇదే రాశిలో శని దేవుడు సంచారం చేయడం కారణంగా, మీరు చాలా బాధ్యతయుతంగా పని చేయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. అయితే ఆరోగ్య పరంగా కొంత ఆందోళన ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *