Gundeninda Gudigantalu Serial Today June 15th Episode: నోటిదూలతో అరుణ్‌ను రెచ్చగొట్టిన బాలు.. పోలీసోడితోనే సుమతి పెళ్లి?.. డబ్బు కోసం మీనా ఆలోచన
Gundeninda Gudigantalu Serial 2026 June 15th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్లో సోమవారం నాడు అరుణ్‌ను కావాలనే బాలు రెచ్చగొడతాడు. దీంతో మళ్లీ అక్కడ ఓ చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఇంకో వైపు సుమతి అయితే అరుణ్‌కి దగ్గరయ్యేలా కనిపిస్తోంది. మరో వైపు మీనా కోసం శివ తన ప్రొఫెసర్ నుంచి ఓ పెద్ద ఆర్డర్‌ను తీసుకు వచ్చాడు. ఆ ఆర్డర్‌ని ఎలా పూర్తి చేయాలా? అని మీనా డబ్బుల కోసం కంగారు పడుతుంటుంది.

రవి, శ్రుతి వెడ్డింగ్ యానివర్సరీలో మనోజ్, రోహిణి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు. గోల్డ్ విలువ పెరుగుతున్నట్టే.. మీ విలువ కూడా పెరగాలి అని గోల్డ్ రింగ్ ఇస్తాడు మనోజ్. వద్దు అన్నయ్య అని రవి అంటే.. జీవితంలో మొదటి సారిగా గిఫ్ట్ ఇస్తున్నాడు.. తీసుకో అని బాలు అంటాడు. మీరు కూడా ఏదో ఒక విలువైన గిఫ్ట్ తెచ్చే ఉంటారు కదా ఇవ్వండి అని బాలుకి మనోజ్ కౌంటర్ వేస్తాడు. స్పెషల్ పూల బొకేని మీనా, బాలు ఇస్తారు. అది చూసి శ్రుతి వావ్ అంటుంది. ఇక మరో వైపు శ్రుతి తండ్రి సురేంద్ర అయితే బాలుతో గొడవ పెట్టుకోవాలని చూస్తాడు. ఫంక్షన్‌కి వస్తే పలకరించాలని కూడా తెలీదా అని అంటాడు. అనుకున్నా.. ఇంకా రాలేదేంటి? అని.. గొడవ ఇంకా పెట్టుకోవడం లేదేంటి? అని అనుకున్నా.. మీకు నన్ను గెలికి, గొడవపెట్టుకునేంత తీరిక ఉన్నా.. నాకు అంత ఓపిక లేదు అని చెప్పి వెళ్లిపోతాడు బాలు. ఇంకో వైపు ఇంట్లో ప్రభావతి తన కాళ్ల నొప్పులతో బాధపడుతుంది. కాపడం పెట్టాలా? వేడి నీళ్లు తీసుకు రావాలా? అని మీనా అంటుంది. నా నెత్తి మీద పొయ్యి అని ప్రభావతి అంటుంది. సరే అని మీనా వెళ్తుంది.
మీనాకి శ్రుతి గిఫ్ట్..
మీనాకి శ్రుతి గిఫ్ట్..
ఏంటి నా నెత్తి మీద నిజంగానే పోస్తుందా? అని ప్రభావతి భయపడుతుంది. అత్తగారి మాటను మీరకూడదు కదా అని సత్యం కౌంటర్లు వేస్తాడు. వేడి నీళ్లు కావు.. వేడి పాలు..తాగి పడుకోండని మీనా అంటుంది. ఇదే కాపడం పెట్టమని రోహిణిని అడగండి.. పెడుతుందేమో అని మీనా కౌంటర్లు వేస్తుంది. ఇంతలో రవి, శ్రుతి వచ్చి మీనాకి కాస్ట్ లీ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇస్తారు. ఇదంతా నాకు ఎందుకు అని మీనా అంటుంది. నీ బిజినెస్‌కి పనికి వస్తుందని శ్రుతి, రవి అంటారు. మనం గోల్డ్ గిఫ్ట్‌గా ఇచ్చాం.. కానీ మనకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు అని రోహిణి, మనోజ్ అనుకుంటారు.
అరుణ్‌కి సుమతి సాయం..
మరో వైపు అరుణ్ తన తల్లి రాజేశ్వరికి హెల్త్ బాగోలేదని సుమతి ఉన్న హాస్పిటల్‌కి తీసుకు వస్తాడు. అక్కడ అరుణ్ తల్లిని ఒక రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెబుతాడు. తనకు పని ఉందని, అలా అడ్మిట్ చేయలేను అని అరుణ్ అంటాడు. అప్పుడే స్టేషన్ నుంచి అర్జెంట్ కాల్ కూడా వస్తుంది. నేను ఉంటాను.. నేను చూసుకుంటాను.. మీరు వెళ్లండని అరుణ్‌కి సుమతి చెబుతుంది. సుమతి మంచితనాన్ని చూసి రాజేశ్వరి కూడా ముచ్చటపడుతుంది. ఈ కాలంలోనూ ఇంత మంచి వాళ్లు ఉన్నారా? మేం పరాయి వాళ్లమే అయినా సొంత వారిలా చూసుకుంటోందని సుమతి గురించి రాజేశ్వరి అనుకుంటుంది.
బాలు భజన..
బాలు భజన..
ఇంకో వైపు రోహిణి, విద్య ఎటో వెళ్తుంటారు. నీకు ఓ విషయం చెప్పాలా? అని.. భయపడకూడదు మరి అని విద్య అంటుంది. ఏంటో చెప్పు.. అని రోహిణి అంటుంది. బండికి బ్రేకులు పడటం లేదు అని విద్య అనడంతో.. కంగారు పడి దూకేస్తుంది రోహిణి. ఏంటి అలా దూకేసేశావ్ కాస్త కూడా ఆలోచించవా? అని అబద్దం చెప్పాను.. బ్రేకులు పడుతున్నాయ్ అని విద్య నవ్వుతుంది. ఆ తర్వాత గుణ టాపిక్ వస్తుంది. వాడికి బాలునే కరెక్ట్.. బాలు చాలా తెలివైన వాడు.. అని బాలు గురించి గొప్పగా చెబుతుంది విద్య. అలా బాలు భజన చేస్తుంటే రోహిణికి మండిపోతుంటుంది.
మీనా న్యూ ఐడియా..
ఇక ఇంతలో మీనా కనిపించిందని విద్య అటు వైపుగా వెళ్తుంది. మీనాని పిలిచి మాట్లాడుతుంది విద్య. నీ ప్రేమ కథ ఎక్కడి వరకు వచ్చిందని, ఐడియా వర్కౌట్ అయిందా అని మీనా అడుగుతుంది. లేదు.. ఎలా అడుగు ముందుకు వేయాలో తెలీడం లేదని విద్య అంటుంది. అయితే ఈ సారి ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నావ్ అని గట్టిగా అడుగు.. అప్పుడు తనలో ఉన్న ఇష్టం గురించి చెబుతాడు.. అప్పుడు ఈ ఫోన్స్ ఎక్స్ ఛేంజ్ గురించి చెప్పు.. నీ వరకు ఓ వేరే ఫోన్ ఇవ్వు అని విద్యకు ఐడియా చెబుతుంది మీనా. ఈ ఐడియా బాగుందని విద్య అంటుంది. ఇంతలో మీనాకి పని ఉండటంతో వెళ్తాను అని చెబుతుంది.
ఏం మాట్లాడుకున్నారో..
మీనా, విద్య అంత క్లోజ్‌గా మాట్లాడుతూ ఉండటంతో రోహిణికి మండుతుంది. ఏ విద్య.. అని రోహిణి అరుస్తుంది. అమ్మో అని విద్య అనుకుంటూ వెళ్తుంది. మీనాతో ఏంటి మాట్లాడుతున్నావ్ అని రోహిణి అడుగుతుంది. తర్వాత చెప్తాలే.. అని విద్య అంటుంది. నాకు తెలియని సీక్రెట్ ఉందా? ఏం మాట్లాడుకున్నారో అని రోహిణి అనుకుంటుంది. మనం వెళ్దాం పదా అని విద్య అంటే.. నువ్వు డ్రైవ్ చేయకు.. నేను చేస్తాను తల్లి అని రోహిణి అంటుంది. అక్కడ సీన్ కట్ చేస్తే రాజేష్, బాలు ఓ హోటల్‌కి వెళ్తారు. అదే హోటల్‌కి అరుణ్ కూడా వస్తాడు.
అరుణ్‌ను గెలికిన బాలు..
అరుణ్ ఉన్న విషయాన్ని గమనించిన బాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కొందరు దౌర్జన్యం చేసిన, వృద్దుల మీద కోపాన్ని చూపించి.. నిజాయితీగా ఉండే వాళ్ల మీద కేసులు పెట్టి.. రికమండేషన్‌లో ఉద్యోగాలు కొట్టి ఓవర్ చేస్తుంటార్రా అని రాజేష్‌తో అంటాడు బాలు. అలాంటి వాళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నార్రా.. అని రాజేష్ ఉంటారు. ఉంటార్రా కొంత మంది.. అలా సంపాదించే డబ్బులతో కడుపునిండా భోజనం చేస్తుంటారు.. అసలు వారికి ఎలా సహిస్తుందో అని అరుణ్‌ను ఇంకా రెచ్చగొడతాడు బాలు. దీంతో బాలు కాలర్ పట్టుకుంటాడు అరుణ్.
వీడియో తీసిన రాజేష్..
బాలు ప్లేట్ ఫిరాయించి.. అమాయకుడిలా నటించేస్తాడు. చూశారా? నా కాలర్ పట్టుకుంటున్నాడు.. మొన్నీ మధ్యే ఓ బామ్మని తోసేశాడు.. నా మీద తప్పుడు కేసు పెట్టారు.. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు.. అందరూ రికార్డ్ చేయండి.. చేయండి అని అంటాడు. దీంతో రాజేష్‌తో పాటుగా చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా వీడియోలు తీస్తుంటారు. నా ఉద్యోగం పీకించాలని చూస్తున్నావ్ కదా అని అరుణ్ అంటే.. అవును రా అని బాలు అంటాడు. చూస్తా.. నువ్వే నా ఏకైకా శత్రువు అని అనుకుంటూ అరుణ్ వెళ్లిపోతాడు. వాడితో నీకు ఎందుకు రా అని రాజేష్ అంటాడు.
సుమతి పెళ్లి టాపిక్..
ఇంకో వైపు పూల కొట్టు వద్దకు సుమతి, మీనా వస్తారు. అక్కడ కాసేపు శివ గురించి, ఆ లీక్డ్ వీడియో గురించి మాట్లాడుకుంటారు. హాస్పిటల్‌కి వెళ్లొస్తా.. అక్కడ ఓ పేషెంట్ ఉన్నారు అని సుమతి అంటుంది. పక్క వారికి సాయం చేయడంలో మన నాన్ననే గుర్తు చేస్తుంటుంది సుమతి.. నాన్న కూడా అంతే అందరికీ సాయం చేసేవారు అని మీనా అంటుంది. ఇక సుమతికి పెళ్లి చేయాలని.. అంతా అడుగుతున్నారని అమ్మ చెప్పడంతో మీనా కూడా సరే చూద్దాం అని అంటుంది. ఇంతలో శివ వస్తాడు. ఓ గుడ్ న్యూస్ చెప్తాడు.
డబ్బుల కోసం..
పెద్ద ఆర్డర్ వచ్చిందని, అది చేయడానికి కేవలం 20 వేల అడ్వాన్స్ ఇచ్చారని బాలుతో మీనా చెబుతుంది. కానీ దగ్గరదగ్గరగా 70 వేలు ఖర్చు అవుతోందని.. మిగిలిన యాభై వేలు ఎలా సర్దాలి అని మీనా కంగారు పడుతుంటుంది. మన రవి, శ్రుతిలను అడుగుదామా? అని మీనా అంటుంది. రవి గాడు మనోడు.. మరి శ్రుతి అని బాలు అని అంటాడు. శ్రుతి కూడా మంచిదే.. అడిగితే.. ఇస్తుందిలే.. ఏమీ అనదు అని మీనా అంటుంది. అయితే సరే నీ ఇష్టం అడుగుదాం లే అని బాలు అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.