Gundeninda Gudigantalu Serial Today June 29th Episode: టైం చూసి దెబ్బ కొట్టిన బాలు.. అరుణ్ ఉద్యోగం ఊడుతుందా?.. సుందరి పెళ్లిలో రోహిణి ఖేల్ ఖతం
Gundeninda Gudigantalu Serial Today June 29th Episode: టైం చూసి దెబ్బ కొట్టిన బాలు.. అరుణ్ ఉద్యోగం ఊడుతుందా?.. సుందరి
Gundeninda Gudigantalu Serial 2026 June 29th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్లో సోమవారం నాడు అరుణ్‌ను ఇరికిస్తాడు బాలు. హెల్మెట్ లేకుండా ఫోన్ నడుపుతూ.. నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేయడం వంటివి అన్నీ రికార్డ్ చేస్తాడు బాలు. నీకు మాత్రం రూల్స్ వర్తించవా? మాకు మాత్రమే రూల్స్ అంటూ ఫైన్స్ వేస్తారా? అని బాలు నిలదీస్తాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలు చెబుతాడు. ఇక రంగా, కామాక్షి తాంబూలం ఇచ్చి పెళ్లికి పిలిచేందుకు ప్రభావతి ఇంటికి వస్తారు. నన్ను పొగడకండి.. పొగిడితే.. వీళ్లకు మండుతుంది అని బాలు కౌంటర్లు వేస్తాడు.

మీనాని ఆపాలని చింతామణి వేస్తున్న నాటకాలు అందరికీ తెలిసిందే. మళ్లీ ప్రభావతి వద్దకు చింతామణి వస్తుంది. డెకరేషన్ విషయంలో ప్రభావతి ఏం చేయలేకపోయిందని చింతామణి దెప్పి పొడుస్తుంది. ఇన్ని రోజులు ప్రభావతి వస్తే లేచి నిలబడిన చింతామణి.. ఇప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. అది ప్రభావతికి నచ్చదు. మీరు ఇలానే చూస్తూ ఉండండి.. మీనా అంచలంచెలుగా ఎదుగుతుంది.. అని చింతామణి అంటుంది. అది పూలమ్ముకునేది అని ప్రభావతి అంటుంది. మీరు అంతే అనుకోండి.. ఒకప్పుడు పూలు, డెకరేషన్, ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ అలా చూస్తూ ఉంటే.. పర్వతంలా ఎదుగుతుంది.. అప్పుడు కదల్చడం ఎవ్వరి వల్ల కాదు అని ప్రభావతిని రెచ్చ గొడుతుంది చింతామణి. దాన్ని ఆపడం క్షణం పట్టదు.. ఇంట్లోనే కూర్చోబెడతా.. పూలు, డెకరేషన్, డ్రైవింగ్ స్కూల్ ఇవన్నీ బంద్ చేయిస్తా అని చింతామణితో ప్రభావతి అంటుంది. అనడం కూడా ప్రయత్నం చేయండి.. ఆపండి.. కానీ మీనా ఆగదు.. ఎదుగుతూనే ఉంటుంది.. అప్పుడు మీ పరువే పోతుంది.. అంతా మీనా గురించే చెప్పుకుంటారు అని ప్రభావతిని రెచ్చగొడుతారు. ఈమె కావాలనే వదినని రెచ్చగొడుతోంది.. ఈ విషయం వదినకు తెలియడం లేదు అని కామాక్షి అనుకుంటుంది. మీనాని ఆపుతా.. అప్పుడు మీరు నా వద్దకు వచ్చి నిలబడి మాట్లాడాలి అని ప్రభావతి చెప్పి వెళ్లిపోతుంది.
మనోజ్‌కి మండినట్టుంది..
జలుబు చేసిందని హాల్లో బాలు, మీనా దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకుంటారు. హాల్లో ఇదంతా ఏంట్రా అని తిట్టేసి వెళ్తుంది ప్రభావతి. ఇక ఫోన్లో బిజీగా ఉన్న మనోజ్.. అక్కడున్న వేడినీళ్లను చూసుకోకుండా కాలు వేస్తాడు. వీళ్లే నా కాలు కాలేలా చేశారు అని మనోజ్ ఆరోపిస్తాడు. నువ్వు చూడకుండా కాలేసి మమ్మల్ని అంటావా? అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఇదంతా రూంలో చేసుకోవచ్చు కదా అని రోహిణి అంటే.. మాకు రూం ఎక్కడుందని బాలు అంటాడు. అవును కదా.. వాళ్లు హాల్లోనే ఉంటారు.. ఇది కూడా హాల్లోనే చేసుకుంటున్నారు అని శ్రుతి అంటుంది. ఇదంతా మేడ మీదున్న మీ కలల రూంలో చేసుకోండని ప్రభావతి కౌంటర్లు వేసి వెళ్లిపోతుంది. కచ్చితంగా మీద ఒక రూం కట్టుకుంటాం అని బాలు అంటాడు.
డ్రైవింగ్ నేర్చుకుంటున్న మీనా..
మీనాకి డ్రైవింగ్ నేర్పిస్తాడు బాలు. కారు స్టార్ట్ చేసిన దానికే.. ఇంత ఈజీనా అని అనేస్తుంది మీనా. అంతలోనే కారు ఆగిపోతుంది. ఈజీనా అని అన్నావ్ కదా? అని గేర్ ఎలా మార్చాలి.. క్లచ్ ఎలా వాడాలి.. యాక్సిలేటర్ ఎలా ఇవ్వాలని మీనాకి అర్థమయ్యేలా బాలు చెబుతాడు. ఇక రోడ్డు మీదకు వచ్చిన తరువాత మీనా భయపడుతుంది. రోడ్డు చిన్నగా కనిపిస్తోందండి అని మీనా కంగారు పడుతుంది. ముందు అలానే ఉంటుంది.. ఆ తర్వాత రోడ్డు చిన్నగా అనిపిస్తుంది.. కారు నీ మాట వింటుందిలే అని నేర్పిస్తుంటాడు బాలు.
రెస్టారెంట్లో శ్రుతి, రవి..
రెస్టారెంట్లో శ్రుతి చకచకా పనులు చేస్తుంటుంది. అది చూసి రవి మురిసిపోతాడు. నీతూ కూడా శ్రుతిని మెచ్చుకుంటుంది. అయితే ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసి టైం అవుతోంది.. ఇంకా రాలేదు అని అంటాడు. దీంతో రవి మీద శ్రుతి ఫైర్ అవుతుంది. కష్టమర్ వెయిట్ చేస్తున్నాడు.. ఇంకెంత సేపు అని అంటుంది. సరే అంత వరకు ఈ సూప్ తీసుకు వెళ్లి ఇవ్వు అని అంటాడు. సూప్ ఇస్తుంది.. కానీ స్పూన్ మర్చిపోతుంది. దీంతో కస్టమర్ కౌంటర్ వేస్తాడు. స్పూన్ ఇవ్వాలని తెలీదా అని రవిని శ్రుతి అంటాడు. వీళ్ల గొడవని నీతూ చూస్తుంది. మీరు ఇలానే గొడవ పడుతుంటారా? అని కౌంటర్లు వేస్తుంది. వెళ్లి కస్టమర్‌కి ఇవ్వండని అంటుంది.
రికార్డ్ చేసిన బాలు..
అరుణ్ హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటాడు. పైగా నో పార్కింగ్ వద్ద బండిని పార్క్ చేస్తాడు. ఇదంతా రికార్డ్ చేస్తాడు బాలు. మనల్ని అయితే ఇలా వదిలేస్తాడా? బండిని సీజ్ చేస్తాడు.. కదా.. ఇప్పుడు వాడి బండిని కూడా గొలుసుతో కట్టేద్దామని బాలు కట్టేస్తాడు. మనకు ఎందుకు రా అని రాజేష్ అంటాడు. కానీ బాలు వినడు. దీంతో అరుణ్‌కి కోపం వస్తుంది. మాకు అయితే రూల్స్ అని ఫైన్స్ వేస్తావ్.. బండిని సీజ్ చేస్తావ్.. మీకు మాత్రం రూల్స్ వర్తించవా? అని అరుణ్‌ను నిలదీస్తాడు బాలు.
సోషల్ మీడియాలో పెట్టేస్తా..
మాకు రూల్స్ అంటారు.. మీకు మాత్రం రూల్స్ వర్తించవా?. అతను అడిగిన దాంట్లో తప్పేం ఉందని చుట్టు పక్కల జనాలు కూడా అడుగుతారు. ఎమర్జెన్సీ ఉంది రా.. అయినా నువ్వేంటి కంపలా నాకు తగులుకున్నావ్ అని అరుణ్ అంటాడు. ఇక రాజేష్ కాస్త తగ్గి.. రేయ్ వాడితో మనకు ఎందుకు.. పైగా హాస్పిటల్ రిపోర్టులు చేతిలో ఉన్నాయి.. ఇలాంటి టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.. అని ఆ గొలుసు తీసి ఇస్తాడు. సార్ ముందు మీరు వెళ్లండని రాజేష్ అంటాడు. దీంతో అరుణ్ వెళ్లిపోతాాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేస్తా అని బాలు అంటాడు.
పెళ్లికి పిలిచిన రంగా, కామాక్షి..
సుందరి పెళ్లికి అందరూ రావాలి.. నాలుగు జంటలు.. రావాలి అని రంగా, కామాక్షి పిలుస్తారు.. ఇంకా శుభలేఖలు రాలేదు.. వచ్చాక మళ్లీ చెప్తాం అని రంగా అంటాడు. అసలు మా సుందరి పెళ్లి జరగడానికి, మేం ఇలా సంతోషంగా ఉండటానికి కారణం బాలు, మీనా అని రంగా పొగిడేస్తుంటాడు. ఆ ఏదో చేశాడు లే అన్నయ్య.. అని ప్రభావతి తీసి పారేసినట్టుగా అంటుంది. మమ్మల్ని పొగడకు మామయ్య.. ఇక్కడ కొంత మందికి మండుతుంది.. ఓర్చుకోలేరు అని బాలు కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు.
తలా ఒక పని..
పెళ్లి పనులు ఎలా చేయాలో తోచడం లేదు రా సత్యం అని రంగా అంటాడు. అవన్నీ మేం చూసుకుంటాం కదా.. అని బాలు, మీనా అంటారు. డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను అని మీనా, రవాణాకి సంబంధించి నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. మేకప్ అంటే రోహిణి చూస్తుంది అని శ్రుతి చెబుతుంది. దీంతో శ్రుతి తప్పక ఒప్పుకుంటుంది. మా రెస్టారెంట్లోనే నేను తక్కువకి మాట్లాడతాను అని రవి అంటాడు. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది అని రంగా ఎమోషనల్ అవుతాడు.
నేను పెద్ద బిజినెస్ మెన్ని..
మీరే నాకున్న బంధువులు మీరంతా రావాలి అని రంగా అంటాడు. నేను పెద్ద బిజినెస్ మెన్ని.. నేను చాలా బిజీ అని మనోజ్ అంటాడు. దీంతో బాలు కౌంటర్లు వేస్తాడు. నీ బిజీ అందరికీ తెలుసులేరా.. కుక్కలు బట్టలు చింపినోడా అని తిడతాడు బాలు. కొత్త తిట్టా? భలే ఉందే.. దాని కథ ఏంటి? అని కామాక్షి అడుగుతుంది. బాలు చెప్పబోతోంటే.. ఎహె ఆపండి అని ప్రభావతి అంటుంది. పెళ్లికి నాకు చీరలు కావాలని సత్యంతో ప్రభావతి చెబుతుంది. మేం పెడతాం కదా అని కామాక్షి అంటే.. అవి కాదు.. పెళ్లిలో కట్టుకోవడానికి అని ప్రభావతి అంటుంది.
ఇక్కడే మటన్ కొట్టు అంట..
అందరికీ బట్టలు కొంటాను అని సత్యం అంటాడు. పెళ్లి కొడుకు తరుపు వాళ్లు బాగానే మాట్లాడుతున్నారా? అని రంగాని సత్యం అడుగుతాడు. పెళ్లి కొడుకు మామయ్య అంట.. ఇక్కడే మటన్ కొట్టు ఉందట.. అని రంగా చెప్పడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి ఆ మాటలో రోహిణికి లైట్ వెలుగుతుందా? తన మలేషియా నాటకం బయట పడకుండా ఏమైనా అడ్డుకుంటుందా? అన్నది చూడాలి