Gundeninda Gudigantalu Serial Today సెప్టెంబర్ 28 ఎపిసోడ్: చింతామణిని బోల్తా కొట్టించాలనుకున్న బాలు.. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా మారిన వైనం.. క్షణక్షణం భయపడిన రవి

 Gundeninda Gudigantalu Serial Today సెప్టెంబర్ 28 ఎపిసోడ్: చింతామణిని బోల్తా కొట్టించాలనుకున్న బాలు.. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా మారిన వైనం.. క్షణక్షణం భయపడిన రవి

Gundeninda Gudigantalu Serial Today సెప్టెంబర్ 28 ఎపిసోడ్: చింతామణిని బోల్తా కొట్టించాలనుకున్న బాలు.. ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా మారిన వైనం.. క్షణక్షణం భయపడిన రవి

Gundeninda Gudigantalu Serial Today Episode గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో చింతామణి నుంచి డబ్బు కాజేయాలని బాలు ప్లాన్ వేస్తాడు. మీనా దగ్గర కొట్టేసిన ఆ డబ్బుని ఎలాగైనా సరే తిరిగి తీసుకోవాలని బాలు అనుకుంటాడు. అందుకోసం ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తుతాడు. ఈ ప్లాన్‌లో ప్రతీ క్షణం భయపడుతూ ఉంటాడు రవి. శ్రుతి ఏమో ధైర్యంగా ముందుకు వెళ్తుంటుంది. ఇక చింతామణి ఇంటి నుంచి బయటకు వెళ్లడంతోనే బాలు అండ్ టీం లోపలకు వెళ్తుంది.
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
సుమతి తీసుకు వచ్చిన మూడు లక్షల గురించి మీనా కంగారు పడుతుంది. అతని వద్ద ఎందుకు తీసుకున్నావే.. అది ముందే చెప్తే వద్దని అనేదాన్ని.. ఇప్పుడు అతను ఏం అనుకుంటాడో.. మామూలుగానే భార్యాభర్తలే మధ్యే ఈ డబ్బుకి సంబంధించి గొడవలు అవుతుంటాయి.. ఇంక మీరు కాబోయే భార్యాభర్తలు.. నా వల్ల నీకు ఏమైనా సమస్యలు వస్తే నేను తట్టుకోలేను. ఈ డబ్బు గురించి వాళ్లేం అనుకుంటారో అని మీనా కంగారు పడుతుంటుంది. ఎక్కువగా ఆలోచించకు అక్క.. ఏం కాదు లే.. వాళ్లు ఏం అనుకుంటారో అని నీతో అన్నాను అంతే.. అని సుమతి అంటుంది. కానీ మీనా మాత్రం సుమతి గురించి అలా ఆలోచిస్తూనే ఉంటుంది. నా వల్ల సుమతి పెళ్లికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు.. ముందు ఆ మూడు లక్షలు తీసుకు రావాలి.. కానీ ఎలా తీసుకు రాగలను.. అంత డబ్బు ఎలా సర్దగలను అని మీనా స్కూటీ మీద వెళ్తూ తన మనసులో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు ఇంటికి మీనా మీనా అని గుమ్మం నుంచే పిలుస్తాడు. కానీ మీనా అప్పుడు స్కూటీ నుంచి దిగుతుంది.

బాధ పడ్డ మీనా..

నా వల్ల సుమతి పెళ్లి చెడిపోతుందేమో.. నా వల్ల సుమతి జీవితం ఇబ్బందుల్లో పడుతుందేమో అని మీనా అంటూ ఉంటుంది. ఆ డబ్బులకి, సుమతి జీవితానికి ఏం సంబంధం ఏం మాట్లాడుతున్నావ్ అని బాలు అంటాడు. అడిగిన వెంటనే ఫ్రెండ్ వద్ద డబ్బులు తీసుకు వచ్చి ఇచ్చింది.. మనం తిరిగి ఇవ్వలేకపోతోన్నాం కదా.. అని మీనా అంటుంది. నువ్వేం బాధ పడకు.. నీ వల్ల ఎవ్వరి జీవితాలు పాడు అవ్వవు.. మనం వెంటనే ఆ డబ్బులు తీసుకు వద్దాం.. ఆల్రెడీ ప్లాన్ వేశా సరేనా? అని అంటాడు బాలు.

ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా..

ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా..

మనం ఒక నేరం చేయాలి.. అని బాలు అంటాడు. నేరమా? అని రవి భయపడతాడు. అవును నేరమే.. ఘోరం ఏమీ కాదు.. మీనా డబ్బుల్ని కాజేసిన చింతామణి ఇంటికి ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లుగా వెళ్లాలి.. ముళ్లుని పిన్నీసుతోనే తీయాలని బాలు అంటాడు. ముళ్లుని ముళ్లుతోనే అని అంటారు కదా అని శ్రుతి అంటే.. మళ్లీ ముళ్లు గుచ్చుకుంటుంది కదా అని బాలు అంటాడు. కానీ పోలీసులకు దొరికితే ఎలా అని రవి భయపడుతుంటాడు. అవును రా అని రాజేష్ అంటాడు. మీరేం భయపడకండి రా అలా జరగదు అని బాలు అంటాడు.

కామాక్షి అత్త ఇంట్లో చింతామణి..

కామాక్షి అత్త ఇంట్లో చింతామణి..

మరి ఆ చింతి మనల్ని గుర్తు పడుతుంది కదా.. నేను అసలే దాన్ని చాలా తిట్టాను అని శ్రుతి అంటుంది. ఆ చింతి.. చీ.. చీ.. ఆ చింతామణి ఇంట్లో ఉండదు.. కామాక్షి అత్త వాళ్ల ఇంట్లో ఉంటుంది.. ఆ టైంలో మనం ఇంట్లోకి వెళ్లి.. మన డబ్బు మనం తీసుకు రావాలి అని బాలు అంటాడు. మరి మనకు ఐడీ కార్డులు కావాలి కదా అని రవి అంటే.. వీడు సినిమాలు బాగా చూస్తాడు.. అని బాలు అంటాడు. అవును.. మనం వెళ్లి వీ ఆర్ ఫ్రమ్ ఇన్ కం ట్యాక్స్ అని అంటాం.. వాళ్లు డబ్బులన్నీ తెచ్చి కుప్పలు కుప్పలుగా పడేస్తారు అని రవి అంటాడు.

భయపడిన రవి..

భయపడిన రవి..

ఇలా తప్పుడు దారిలో వెళ్లాలా? నాకు భయంగా ఉందని మీనా అంటుంది. సుమతి వద్ద తీసుకు వచ్చిన డబ్బుని మనం తిరిగి ఇవ్వాలి.. క్రిమినల్స్‌ని పట్టుకునేందుకు ఇలా చేయడం తప్పు కాదు.. ఈ టీంకి లీడర్ రాజేష్.. శ్రుతి బాస్.. ఆమెకి నేను అసిస్టెంట్.. నాకు వీళ్లు అసిస్టెంట్లు అని బాలు అంటాడు. ఇక రవి భయపడుతూ ఉంటాడు. వీడ్ని ఆపేద్దాం బాలు అని శ్రుతి అంటుంది. లేదు వదిన కోసం నేను కూడా వస్తా అని రవి అంటాడు. ఇప్పుడు నా హజ్బెండ్ అనిపించుకున్నావ్ అని రవిని మెచ్చుకుంటుంది శ్రుతి.

చింతామణి కడుపులో తేడా..

ఇక చింతామణి ఎప్పుడు బయటకు వెళ్తుందా? అని బయట కారులో వెయిట్ చేస్తుంటారు బాలు అండ్ కో. మరో వైపు చింతామణి అన అసిస్టెంట్లకు పనులు చెప్తూ ఉంటుంది. కామాక్షి ఇంట్లో పూజ ఉంది కదా వెళ్దాం అని తన అసిస్టెంట్‌తో చెప్తుంది చింతామణి. మందిని ముంచి.. అలా దేవుడు ముందు కూర్చుంటే మాత్రం గుర్తు పట్టడా? అని వాడు కౌంటర్లు వేస్తే.. వాడ్ని లాగి పెట్టి కొడుతుంది చింతామణి. ఇక చింతామణి బయల్దేరే టైంలోనే కడుపులో ఏదో తేడా కొడుతుంది. నువ్వు చేసిన పప్పు వల్లే రా ఇదంతా అని తిడుతుంది.

ఫోన్‌లో కామాక్షి..

ఫోన్‌లో కామాక్షి..

చింతామణి కారు అలా బయటకు వెళ్లడంతో బాలు అండ్ టీం రెడీ అవుతారు. ఇంతలో కామాక్షి నుంచి ఫోన్ వస్తుంది. అత్తా.. చింతామణి ఇప్పుడే బయల్దేరింది.. ఇక నీదే బాధ్యత అని బాలు అంటాడు. ఇంతలో రవి ఫోన్ తీసుకుంటాడు. అత్త నువ్వు అక్కడ చింతామణిని అరెస్ట్ చేయకపోతే.. ఇక్కడ మేం అరెస్ట్ అవుతాం అని భయపడుతుంటాడు. అత్త నువ్వు మాత్రం జాగ్రత్త.. అని బాలు అంటాడు. మీనా కోసం చేస్తున్నాం కదా.. అంతా మంచే జరుగుతుంది.. మీరేం భయపడకండి అని కామాక్షి అంటుంది.

తడబడ్డ రవి..

తడబడ్డ రవి..

బాలు అండ్ టీం చింతామణి ఇంట్లోకి వెళ్తారు. కానీ వీళ్లని ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ఉంటారు. ఏంటి మేం వస్తే పట్టించుకోరా? అని శ్రుతి, బాలు అంటారు. మీరు ఎవరు మీకోసం.. మేం పని మానుకోవాలా? అని ఓ అసిస్టెంట్ అంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని రాజేష్ కొడతాడు. వీ ఆర్ ఫ్రమ్ సీబీఐ అని అంటాడు రవి. శ్రుతి కాదు అని అడ్డంగా తలూపుతుంది. అదే సీబీఐలో పని చేసి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం అని కవర్ చేస్తాడు రవి.

చింతామణి ఇంట్లో సోదాలు..

చింతామణి ఇంట్లో సోదాలు..

ఏమైనా సరే మా మేడంకి చెప్పాక చేసుకోండి అని అసిస్టెంట్ అంటాడు. దీంతో మళ్లీ ఒకటి కొడతాడు రాజేష్. అందరి మొబైల్ ఫోన్స్ రాజేష్ తీసుకుంటాడు. మేం ఈ ఇంటిని సోదా చేయాలి అంటూ హిందీ, ఇంగ్లీష్‌లో శ్రుతి మాట్లాడుతుంది. మాకు అర్థం కాలేదు అని అసిస్టెంట్లు అంటారు. మీరేం చూస్తున్నారు.. రండి.. సోదా చేద్దాం అని బాలు, రవి, రాజేష్‌లను తీసుకు పోతుంది శ్రుతి. ఇక అందరూ కలిసి రూంలో వెతుకుతూ ఉంటే.. ఇంట్లోని పని వాళ్లంతా అదోలా చూస్తూ ఉంటారు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

‘గుండెనిండా గుడిగంటలు’ నేటి ఎపిసో‌డ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? మీ ఆలోచనలను కామెంట్ బాక్స్‌లో పంచుకోండి.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *