రాశిఫలాలు 27 జూన్ 2026: ఈరోజు శని ప్రదోష, త్రికోణ యోగం ప్రభావంతో వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు

రాశిఫలాలు 27 జూన్ 2026: ఈరోజు శని ప్రదోష, త్రికోణ యోగం ప్రభావంతో వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు

horoscope today 27 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రికోణ యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 మూడింతల ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 27 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శని గ్రహం మీనరాశిలో సంచారం చేస్తూ చంద్రుడితో త్రికోణ యోగాన్ని ఏర్పరచనుంది. ప్రస్తుతం చంద్రుడు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. దీంతో గురు, శుక్ర, బుధ గ్రహాలతో త్రికోణ యోగాన్ని ఏర్పరచడమే కాకుండా, కుజ గ్రహంతో సమసప్తక యోగం, చంద్రునిపై కుజుడి సప్తమ ద్రుష్టి ఉండటం కారణంగా ధన యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా ఈ శుభ యోగాల కారణంగా మేషం, వృశ్చికం సహా ఈ రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. మరికొన్నిరాశులపై శని ప్రభావంతో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి నుంచి చంద్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కుజుడి ద్రుష్టి పడనుంది. ఈ కారణంగా మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఖర్చులు, మీ బడ్జెట్‌ను పాడు చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు త్రికోణ యోగం ప్రభావంతో శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు పొందొచ్చు. మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. మీ పిల్లలతో ఆనందంగా గడపొచ్చు. మీ అభిరుచులకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సూర్యుడి అనుగ్రహంతో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ అవసరాలకు సంబంధించి కొన్ని ఖర్చులు పెరగొచ్చు. మీరు చేసే పనిలో విశ్వసనీయత పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు కొత్త మార్గాలను తెరుస్తాయి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు త్రికోణ యోగం కటాక్షంతో సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందొచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ఇదే రాశిలో గురు గ్రహం ఉండటంతో మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలున్నాయి. మీ అభిరుచులకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభించొచ్చు. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ప్రణాళికల ప్రకారం పనులన్నీ సకాలంలో పూర్తి చేయొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సాయంత్రం, రాత్రి సమయాల్లోనూ ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా గడుపుతారు. వ్యాపారులు ఊహించని విదంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శని దేవుని అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి పొందొచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన పనుల గురించి సీనియర్ల నుంచి సలహాలు తీసుకవోడం మంచిది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి చాలా ఓపికగా ఉండాలి. అయితే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పని చేసే ప్రాంతంలో అందరితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తారు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు త్రికోణ యోగం ప్రభావంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇదే రాశిలో ధనయోగం ఏర్పడటం కారణంగా మీరు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశం ఉంది. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటి అలంకరణ కోసం కొంత ఖర్చు చేస్తారు. మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన రిస్క్‌లు తీసుకోకూడదు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. పనికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు అంచనాలకు మించిన లాభాలు రావొచ్చు. కెరీర్ పరంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరొచ్చు. మీ లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. త్రికోణ యోగం ప్రభావంతో మీరు చేసే ప్రణాళికల వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు సాధించొచ్చు. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. మీ సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. విభిన్నమైన ఆలోచనలతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకునే మార్గాలను ఆలోచించాలి. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.