Podarillu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్ : కేశవ డబ్బుల్ని దొంగిలించిన చక్రి.. తన్నుకున్న అన్నదమ్ములు.. వీధీ రౌడీల్లా ఉన్నారని మహా ఆగ్రహం
Podarillu Serial 2026 April 22nd Episode Preview పొదరిల్లు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 22) నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. పెళ్లి చూపులు అలా అయ్యాయో లేదు.. ఇలా ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. కేశవకు తెలియకుండా అతని జేబులోంచి చక్రి డబ్బులు తీసుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీధి రౌడీల్లా చేస్తున్నారు అంటూ మహా లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి మహా ఇచ్చిన కోటింగ్‌కి చక్రి, కేశవ మారుతారని అనుకునే లోపు.. మళ్లీ ఉదయాన్నే గొడవ పడతారు. దీంతో గురువారం ఏం జరుగుతుందో చూడాలి.

మీతోనే ఉంటా..
ఈ ఇంట్లో నన్ను అందరూ చిన్న పిల్లాడిలానే చూస్తారు.. వచ్చే కొత్త వదిన కూడా అలానే చూస్తుందా? మా అందరినీ నీ అంత ప్రేమలా చూసుకుంటుందా? అని మహాతో కన్నా అంటాడు. మీ అందరి గురించి తెలియనప్పుడు నేను కూడా చాలానే భయపడ్డాను.. ఇప్పుడు మీ అందరితోనూ కలిసిపోయాను.. ఆమె కూడా అంతే.. మీ గురించి తెలిస్తే ఇంట్లోంచి ఎక్కడికి వెళ్లదు.. మీ అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు అని మహా నోరు జారేస్తుంది. అంటే అన్నయ్య పెళ్లి అయ్యాక మీరు వెళ్లిపోతారా?.. అటు అన్నయ్య వెళ్లిపోయి.. మీరు కూడా వెళ్లిపోతే మళ్లీ నాకు ఈ ఇల్లు నచ్చదు అని కన్నా ఏడ్చేస్తుంది. కన్నా కన్నీటిని తుడిచి.. నేను ఎక్కడికి వెళ్లను.. ఇక్కడే ఉంటాను అని మహా చెబుతుంది.
పెళ్లి చూపుల్లో మాధవ..
పెళ్లి చూపులు అనుకున్న టైం కంటే ముందే జరుగుతాయి. పెళ్లి వాళ్లు ముందు రావడంతో అందరూ కంగారు పడతారు. మాధవ ఇంకా రాలేదు అని అంతా అనుకుంటూ ఉన్న టైంలోనే.. సరైన టైంకి వచ్చేస్తాడు. ఇక మాధవ రెడీ అయ్యేలోపు పెళ్లి పిల్ల వాళ్లు కూడా వస్తారు. వారిని నారాయణ దగ్గరుండి రిసీవ్ చేసుకుంటాడు. మా అమ్మాయికి చాలా సంబంధాలు చూశాం కానీ మీ అబ్బాయి నచ్చినంతగా ఇంకెవ్వరూ నచ్చలేదు అని పెళ్లి కూతురు తండ్రి అంటాడు. స్వర్గంలో ఆల్రెడీ వీళ్లకి పెళ్లి జరిగింది.. ఇక మనదే లేటు అని మీడియేటర్ అంటాడు.
ముహూర్తం ఫిక్స్..
మీడియేటర్ కండీషన్ గురించి ప్రస్థావిస్తాడు. ఏం కండీషన్ అని మాధవ అడుగుతాడు. మీ వాళ్లు మీకు ఏ కండీషన్ గురించి చెప్పలేదా? అని మీడియేటర్ ప్రశ్నిస్తాడు. నాకు తెలీకుండా ఏం జరుగుతోంది.. ఇక్కడ ఏం దాచారు? అని చక్రిని మాధవ నిలదీస్తాడు. అయితే చక్రి మాటలతో మాయ చేసేస్తాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేస్తాడు. ఇక పంతులు పంచాంగం చూసి ముహూర్తం పెట్టేస్తాడు. వచ్చే నెల 3 అని చెప్పడంతో టైం తక్కువ ఉంది కదా? అని కేశవ అంటాడు. అందరం కలిసి తలా ఓ చేయి వస్తే అన్ని పనులు అయిపోతాయ్ అని ఆ ముహూర్తాన్నే ఫిక్స్ చేస్తారు.
కన్నా ఎమోషనల్..
పెళ్లి చూపులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది. పెళ్లి కూడా ఇలానే జరిగిపోతే.. పెద్ది ఓ ఇంటి వాడు అయిపోతాడు.. ఈ ఇంటికి పెద్ద కోడలు వస్తుంది అని మహా చెబుతూ సంబరపడుతుంది. నాకు పెళ్లి అయితే నాకంటే ఎక్కువగా కన్నా సంతోషిస్తాడు.. వదిన స్థానంలో అమ్మ వస్తుంది అని మాధవ అనడంతో కన్నా ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. నువ్వు పెళ్లి అయ్యాక మా అందరినీ వదిలేసి వేరే ఇంటికి వెళ్తావ్ కదా?.. వదిన రాగానే మా అందరినీ వదిలేస్తావా? అని కన్నా అడుగుతాడు. అదేంట్రా అలా అంటావ్.. నేను ఎందుకు వెళ్తాను.. అని మాధవ ప్రశ్నిస్తాడు. అత్తారింటికి వెళ్లి వస్తాడు.. అక్కడే ఉండడు అని చక్రి కవర్ చేస్తాడు.
పెళ్లికి డబ్బులు ఎలా?
పెళ్లికి టైం తక్కువగా ఉంది.. మన దగ్గర డబ్బు కూడా లేదు.. పెళ్లి ఎలా అవుతుంది అని మాధవ కంగారు పడతాడు. ఇక ఇంతలో మహా మధ్యలోకి దూరి.. అంతా చక్రి చూసుకుంటాడు.. ఇంతకు ముందు చెప్పాడు కదా.. అంతా నేనే చూసుకుంటాను అని.. అన్నయ్య పెళ్లి చేసిన తమ్ముడిలా చరిత్రలో నిలిచిపోతాడు.. ఏమండి.. అంతే కదా? అని సెటైరికల్‌గా అడుగుతుంది. అంతే అంతే అని చక్రి తప్పదన్నట్టుగా అనేస్తాడు. కానీ కేశవ, కన్నా మాత్రం చక్రిని అనుమానంగా చూస్తారు. నేనే అన్నీ చూసుకుంటాను అని చక్రి చెబుతాడు.
కేశవ, చక్రి గొడవ..
నా జేబులోంచి 500 తీశావా? అని చక్రిని కేశవ అడుగుతాడు. అవును.. తీశాను.. పెళ్లి చూపుల పనుల్లో ఉండి చెప్పడం మర్చిపోయా? అని అంటాడు. తీసినప్పుడు చెప్పాలి కదా? అని కేశవ సీరియస్ అవుతాడు. పెద్ద లక్షలు తీసుకున్నట్టుగా చేస్తున్నావ్.. నీ 500 నీకు ఇస్తాలే అని చక్రి అంటాడు. జేబులో 500 కూడా లేనప్పుడు పుడింగిలా పెళ్లి చేస్తాను అని అందరి ముందు మాటలు చెప్పడం ఎందుకు? అని నిలదీస్తాడు కేశవ. డబ్బులు లేనప్పుడు చేతగాని వాడిలా ఉండాల.. ఓవర్ చేయొద్దు అని కేశవ అనడంతో గొడవ మరింత ముదురుతుంది. టీ షర్టులు పట్టుకుని మరీ గొడవ పడతారు. కన్నా, మాధవ ఆపేందుకు ప్రయత్నించినా వినరు.
చీవాట్లు పెట్టిన మహా..
వాళ్ల గొడవని చూసి కిచెన్‌లోంచి ఓ ప్లేట్ తీసుకుని నేలకేసి కొడుతుంది మహా. ఆ శబ్దంతో అందరూ సైలెంట్ అవుతారు. పెద్ది పెళ్లి జరగబోతోందనే ఇంగీతం కొంచెమైనా ఉందా? అసలు మీరు అన్నదమ్ములా? ఆజన్మ శత్రువులా? వీధి రౌడీల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటారా? మీరేమైనా పాలు తాగి పసి పిల్లలు అనుకుంటున్నారా? ఇంకోసారి గొడవ పడితే.. నేను అస్సలు ఊరుకోను.. ఛ.. అని చీకొట్టి వెళ్లి పోతుంది మహా. ఇలా గొడవలు పడి ఏదో ఒక రోజు వదినను ఇంట్లోంచి పంపించేసేలా ఉన్నారని కన్నా విసిగించుకుంటాడు. ఇక ఉదయాన్నే లేచిన తరువాత కూడా మళ్లీ గొడవ పడతారు. చెప్పకుండా తీస్తే దొంగతనమే అంటారని మళ్లీ ఉదయం గొడవ పడతారు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ సారి మహా ఏం చేస్తుందో చూడాలి.