Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌, ప్రభావతిలని చూసి నవ్వుకున్న సత్యం.. మీనాని వెంటాడి విసిగిస్తున్న మురళీ

 Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌, ప్రభావతిలని చూసి నవ్వుకున్న సత్యం.. మీనాని వెంటాడి విసిగిస్తున్న మురళీ

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 22 ఎపిసోడ్: అందరి ముందు పరువుపోయిందిగా.. మనోజ్‌, ప్రభావతిలని చూసి నవ్వుకున్న సత్యం.. మీనాని వెంటాడి విసిగిస్తున్న మురళీ

Gundeninda Gudigantalu Serial 2026 April 22 Episode Preview గుండెనిండా గుడిగంటలు బుధవారం నాటి ఎపిసోడ్‌ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రభావతి, మనోజ్ చేసిన పరిహారం.. వాటి వెనుకున్న గుడ్ల కథను తెలుసుకుని సత్యం, బాలు తెగ నవ్వేస్తారు. ఇక మూఢనమ్మకాల గురించి సత్యం క్లాస్ పీకుతాడు. మరో వైపు మీనాని వెంటాడి విసిగిస్తుంటాడు మురళీ. ఈ విషయాన్ని బాలుకి చెబుతుంది మీనా. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపు బాలు ఏం చేస్తాడు? మురళీ పని పడతాడా? లేదా? అన్నది చూడాలి.

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్మాణిక్యం జరిగిందంతా చెబితే.. రోహిణి ఓ సలహా ఇస్తుంది. ఇంకెన్ని రోజులు ఇలా దాక్కోవాలి.. ఎంత కాలం నాటకం ఆడాలి, అబద్దం చెప్పాలని మాణిక్యం అంటాడు. అయితే అక్కడి నుంచి షాప్ తీసేయండని రోహిణి చెబుతుంది. అది మా పూర్వీకులు.. మటన్ కొట్టు మాణిక్యం అంటే పోస్ట్ మ్యాన్ పిన్ కోడ్ కూడా లేకుండా నేరుగా నా షాప్‌కే వస్తాడు అని షాప్ తీసేయడం కుదరదు అని అంటాడు. నిన్ను నమ్ముకుంటే నా తలరాతే మార్చేలా ఉన్నావే.. ఆఖరి సారిగా చెబుతున్నా.. మీనా నా దగ్గరకు వస్తే ఈ సారి నిజం చెప్పేస్తా అని మాణిక్యం అనడంతో రోహిణి షాక్ అవుతుంది. ఇప్పుడేం చేద్దామే అని రోహిణి, విద్య అనుకుంటారు. మనోజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్ని కష్టాలు పడుతున్నావ్.. నీకు తెలియకుండానే సమస్యలు చుట్టు ముడుతున్నాయ్ అని రోహిణితో విద్య అంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండు అని అని రోహిణికి విద్య సలహా ఇస్తుంది. ఏదో ఊహించుకుంటే ఏదో జరుగుతోందని తన పరిస్థితిని తలుచుకుని పిచ్చి పట్టిన దానిలా నవ్వుకుంటుంది రోహిణి. ఇక ఇలా రోహిణి నవ్వుకోవడం చూసి విద్య షాక్ అవుతుంది.

కిచెన్‌లో బాలు, మీనా ముచ్చట్లు..
కిచెన్‌లో బాలు, మీనా ముచ్చట్లు..

కిచెన్‌లో బాలు, మీనా ముచ్చట్లు..
మన ఇంట్లో మొదటి మహిళా వ్యాపార వేత్తవి నువ్వే.. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే జరిగింది తెలుసా? అని మీనాతో బాలు అంటాడు. అవునండి.. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టే ఇదంతా జరిగింది.. ఎక్కడో గుడి మెట్ల కాడ పూలు అమ్ముకునే దాన్ని.. ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకు వచ్చారు.. ఇదంతా మీ వల్లే జరిగింది.. నన్ను ప్రోత్సహించి.. నా వెంటే నిలబడ్డారు.. నా విజయం వెనుక మీరే ఉన్నారు.. అని మీనా చెబుతుంది. ఇక విజిటింగ్ కార్డ్‌ని కూడా తయారు చేసి మీనాకి ఇస్తాడు బాలు. ఇవి ఉంటే చాలా మందికి మన గురించి తెలుస్తుందని బాలు చెబుతాడు.

నా భార్య ఎంతో ఎత్తుకు ఎదగాలి..
నా భార్య ఎంతో ఎత్తుకు ఎదగాలి..

నా భార్య ఎంతో ఎత్తుకు ఎదగాలి..
నేను మామూలు ట్యాక్సీ డ్రైవర్నే కావొచ్చు.. కానీ నా భార్య పెద్ద బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవడంలో గర్వంగా ఉంది.. నాకు ఎప్పుడూ నీ గురించి, నీ బిజినెస్ గురించే ఆలోచనలు.. నీ పేరు పక్క రాష్ట్రాల్లో.. కాదు కాదు.. పక్క దేశాల్లో కూడా వినిపించాలి అని బాలు అంటాడు. ఇక బాలు మాటలకు మీనా ఎమోషనల్ అవుతుంది. చాలా మంది భర్తలు అసలు భార్యల్ని తక్కువ స్థాయిలోనే ఉండాలని చూస్తారు.. పురుషాధిక్యత చూపిస్తారు.. మీరు మాత్రం నేను ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని చూస్తున్నారు.. మీరు నా స్థాయిని పెంచాలని చూస్తున్నారు.. అంటూ మీనా ఎమోషనల్ అవుతుంది.

గుడిలో ప్రభావతి, మనోజ్ పరిహారం..

గుడిలో ప్రభావతి, మనోజ్ పరిహారం..
గుడిలో ప్రభావతి వేషం చూసి రోహిణి నవ్వుకుంటుంది. ఇక మనోజ్ అయితే ఆది మానవుడిలా ఒళ్లంతా వేపమండలు కట్టుకుని వస్తాడు. మనోజ్‌ని చూసి ప్రభావతి, రోహిణి నవ్వుకుంటారు. రాతియుగపు మనిషిలా దిగి వస్తున్నాడంటూ కౌంటర్లు వేస్తుంది ప్రభావతి. నాకు ఈ తిప్పలన్నీ ఏంట్రా అని ప్రభావతి అంటుంది. ఇదంతా మన మంచికే కదా?. అని మనోజ్ అంటాడు. ఏంట్రా ఈ శిక్ష, చేతులు కాలిపోతోన్నాయ్ అని ప్రభావతి అంటాడు. ఇక చేతిలో నిప్పుల కుండిని పట్టుకుని గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తుంటారు. అమ్మా కాలుతోంది అని మనోజ్ అంటే.. నాకు మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టు ఉందా అని ప్రభావతి కౌంటర్లు వేస్తుంది.

వీడియో తీసిన బాలు

వీడియో తీసిన బాలు
ఆకులు కట్టుకున్న ప్రభావతిని చూసి మీనా షాక్ అవుతుంది. ఎవరు ఆవిడ.. ఆకులు కట్టుకుంది అని బాలు మరింత షాక్ అవుతాడు. ఇక మనోజ్‌ని చూసి మీనా నోరెళ్లబెడుతుంది. వీడేంటి? ఇలా ఉన్నాడు.. రాతి యుగానికి దగ్గరగా ఉన్నాడు.. ఆకు రాలే కాలమిది.. ఆకులు రాలిపోతే ఎలా అని వారిని వీడియో తీస్తాడు బాలు. మన ఇంట్లో ఇద్దరు ఆదివాసీలు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది అని బాలు అంటాడు. కడుపు మంటతో బిర్యానీ తినలేదని అనుకున్నాను.. నిజంగానే దీక్ష చేస్తున్నారేమో అని మీనా అంటుంది. నష్టం వస్తుంది అంటేనో.. లాభం వస్తుందంటేనో ఇలా చేస్తుందని ప్రభావతి గురించి బాలు అంటాడు.

అందరికీ చూపించిన బాలు..

అందరికీ చూపించిన బాలు..
ఈ వీడియోని అందరికీ చూపిస్తాను అని బాలు ఇంట్లోకి వస్తాడు. ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని సత్యం అడుగుతాడు. క్రీస్తు పూర్వానికి, రాతి యుగానికి అని బాలు తన స్టైల్లో చెబుతాడు. కోతి ఏమైనా కనిపించిందా?.. అని రవి అడుగుతాడు. కోతి నుంచే కదా మనిషి వచ్చాడు అని ఆకులు కట్టుకున్న కోతుల్ని చూశా? అని బాలు అంటే.. ఈ కాలంలో అనాగరికులా? అని శ్రుతి షాక్ అవుతుంది. ఇంతలో మనోజ్, రోహిణి, ప్రభావతి కూడా వస్తారు. ఇక గుడిలో తీసిన వీడియోని ల్యాప్ టాప్‌లో పెట్టి మరీ అందరికీ చూపిస్తాడు.

పగలబడి నవ్విన సత్యం..

పగలబడి నవ్విన సత్యం..
వేపావతి.. వేపావతి.. మీ వేప వస్త్రములు ఎచట పెట్టితిరి అని ప్రభావతిని అడుగుతాడు బాలు. క్రీస్తు పూర్వంలో ఆది మానవులు మీలానే ఉండేవారా? అని మనోజ్‌ని అడుగుతాడు బాలు. నాకేం తెలుసు అని మనోజ్ అంటే.. మనోజ్ వీడియోని చూపిస్తాడు బాలు. వీడెవడు ఆదిమ మానవుడు అని సత్యం షాక్ అవుతాడు. ఇక ప్రభావతి, మనోజ్‌లను చూసి సత్యం పగలబడి నవ్వేస్తాడు. రవి, శ్రుతి ఇలా అందరూ నవ్వుకుంటారు. ఆకులు, అలములు అన్నీ దారిలోనే మింగేశావా? అని బాలు అడుగుతాడు. ఇదంతా ఏంటి.. మీకు బుద్ది లేదా? సిగ్గనిపించలేదా? అని సత్యం ఫైర్ అవుతాడు.

మూఢ నమ్మకాలపై ఫైర్..

మూఢ నమ్మకాలపై ఫైర్..
ఇదంతా ఎందుకు చేశారు? అని సత్యం నిలదీస్తాడు. ఇదంతా మంచి కోసమే కదా? చేశాను అని మనోజ్ అంటాడు. షాప్ ముందు ఎవడో మూడు గుడ్లు పెట్టాడని మనోజ్ చెబుతాడు. కోళ్లు గుడ్లు పెడతాయి.. మనిషి ఎందుకు పెడతాడు.. అని బాలు కౌంటర్ వేస్తాడు. స్వామిజికి చెబితే అవి అవే అని కన్ఫామ్ చేశాడని మనోజ్ చెబుతాడు. అయితే ఏం అవుతుందట అని బాలు ప్రశ్నిస్తాడు. నా బిజినెస్ పోతుందట.. అమ్మ ప్రాణం పోతుందట అని మనోజ్ అంటాడు. వాడి జాతకం వాడికే తెలీదు.. ఇలాంటివి ఎవడ్రా చెప్పాడు అని బాలు ఫైర్ అవుతాడు. నమ్మేవాళ్లుంటే ఇలానే చెబుతారు.. నమ్మేవాళ్లదే తప్పు అని మీనా అంటుంది.

అసలు నిజం ఇదే..

అసలు నిజం ఇదే..
నమ్మితే దైవ శక్తినే నమ్మాలి.. ఇలాంటి వాటిని నమ్మకూడదు అని సత్యం చెబుతాడు. మేం చేయాల్సిన పరిహారం చేశాం.. త్వరలోనే అన్నీ బయట పడతాయి.. అని మనోజ్ అంటాడు. ఇంతలోనే ఆఫీస్‌లో పని చేసే అసిస్టెంట్ వచ్చి అసలు నిజం చెబుతాడు. మన షాప్ పక్కన ఏటీఎంలో పని చేసే తాత తెలుసు కదా? అతని మనవడు ఆ గుడ్ల మీద బొమ్మలు గీశాడట.. వాళ్లు ఇంటికి తీసుకెళ్లడం మర్చిపోయి.. అక్కడే పెట్టారట అని అంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మనోజ్ తెల్లమొహం వేస్తాడు. సత్యం, రవి, బాలు ఇలా అందరూ పగలబడి నవ్వేస్తారు.

మీనాని విసిగిస్తున్న మురళీ..

మీనాని విసిగిస్తున్న మురళీ..
మీనాని మురళీ వెంటాడి విసిగిస్తుంటాడు. ఈ సారి ఏకంగా మీనాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. మీరు చాలా అందంగా ఉన్నారు.. అంటే.. మీ మనసు చాలా మంచిది.. మీరు ఎక్కడ ఉంటే అక్కడంతా మంచే జరుగుతుంది.. మిమ్మల్ని చూడగానే నాకు ప్రమోషన్ వచ్చింది.. మనస్పూర్తిగా ఇదంతా చెబుతున్నాను.. మీ పేరు నాకు తెలీదు.. అందుకే నేను మీకు ఓ పేరు పెట్టుకున్నాను.. లక్కీ అని పేరు పెట్టుకున్నాను.. లక్కీ అని పేరు పెట్టుకున్నాను.. ఈ విషయం చెప్పాలనే వచ్చాను.. చెప్పాను.. వెళ్తున్నాను అని వెళ్లిపోతాడు. ఇక ఇదే విషయాన్ని బాలుకి ఫోన్ చేసి చెబుతుంది మీనా. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *