Gundeninda Gudigantalu Today జూన్ 05 ఎపిసోడ్: మరోసారి అడ్డంగా దొరికిపోనున్న రోహిణి.. బాలు చేతికి వచ్చిన ఫోన్.. విద్యని మాయ చేసిన మీనా
Gundeninda Gudigantalu Today జూన్ 05 ఎపిసోడ్: మరోసారి అడ్డంగా దొరికిపోనున్న రోహిణి.. బాలు చేతికి వచ్చిన ఫోన్.. విద్యని మాయ చేసిన మీనా
Gundeninda Gudigantalu Serial 2026 June 5th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్లో శుక్రవారం నాడు రోహిణికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. బాలు ఫోన్ తిరిగి దొరకడంతో విద్యని నిలదీస్తుంది రోహిణి. దీంతో రోహిణిని ఇంట్లోంచి వెళ్లిపో అని ఫైర్ అవుతుంది విద్య. ఇక బాలు, మీనాలకు రోహిణి, విద్య మీద అనుమానం వస్తుంది. ఆ అనుమానం తీర్చుకునేందుకు విద్య ఫోటోలను తీయాలని మీనా అనుకుంటుంది. ఓ వ్యక్తి ప్రేమలో విద్య ఉందని తెలుసుకుంటుంది. ఇక మాటల్లో పెట్టి విద్య ఫోటోలను మీనా తీస్తుంది.
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్

బాలు కౌంటర్లు
బాలు కౌంటర్లు
ఆ విషయం నాక్కూడా చెప్పండని ప్రభావతి గోల పెడుతుంది. నీకు తెలియకపోవడమే మంచిది.. తెలిస్తే చెప్పుతో కొడతావ్ అని బాలు అంటాడు. నాకు తెలియకపోతే బుర్ర బద్దలు అవుతుంది.. అదేంటో చెప్పండని ప్రభావతి అడుగుతుంది. చెప్పొద్దు నాన్నా.. బుర్ర బద్దలు కానివ్వు అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఆ తరువాత మనోజ్, రోహిణి, బాలు, మీనాలు ఎవరి రూంలోకి వారు వెళ్తారు. తాత ఇచ్చిన ఫోన్‌ను చూసి మీనా షాక్ అవుతుంది. ఏవండి.. ఇది మన ఫోన్ అని అంటుంది. అవును నిజమే అని బాలు షాక్ అవుతాడు.
ఫోన్ విషయం..
ఇక ఇదే విషయాన్ని ప్రభావతి, సత్యంకి బాలు చెప్తాడు. మనోజ్ ఫంక్షన్లో పోయిన నా ఫోన్ దొరికింది అని బాలు చెబుతుండగా.. రోహిణి చాటు నుంచి వింటుంది. ఈ ఫోన్ నుంచే కదా ఆ వీడియో లీక్ అయింది అని సత్యం అంటాడు. అవును నాన్నా.. ఓ లేడీ ఈ ఫోన్‌ని తాత షాప్ వద్ద పారేసుకుందట.. ఆ లేడీ ఎవరో కనిపెడతాను అని బాలు అంటాడు. వామ్మో.. అని రోహిణి కంగారు పడుతుంది. అంటే విద్య నాకు అబద్దం చెప్పిందా? అని రోహిణి అనుకుంటుంది. ఇక విద్యను నిలదీసేందుకు ఆమె ఇంటికి వెళ్తుంది రోహిణి.
రోహిణి, విద్యల వాగ్వాదం..
బాలు ఫోన్ ఏం చేశావ్ అని రెండు, మూడు సార్లు అడుగుతుంది రోహిణి. చెరువులోనే పారేశాను అని విద్య చెబుతుంది. మరి ఆ ఫోన్ మళ్లీ బాలు వద్దకు ఎలా వచ్చిందని రోహిణి అనడంతో అసలు విషయం చెప్పేస్తుంది విద్య. పారేయాలని అనుకున్నాను.. మధ్యలో ఎక్కడో మిస్ అయింది.. అప్పుడు చెబితే ఫైర్ అవుతావ్ అని చెప్పలేదని విద్య అంటుంది. నిన్ను నమ్మాను.. నువ్వు నాకు అబద్దం చెబుతావా? అని రోహిణి అంటుంది. అసలు నువ్వు చేసే పనులేవీ నాకు నచ్చడం లేదు.. ఏది అబద్దమో.. ఏది నిజమో తెలియడం లేదు అని విద్య రివర్స్ అటాక్ చేస్తుంది.
నువ్వు మోసం చేస్తున్నావ్..
నువ్వు నన్ను ఓ వస్తువులా వాడుకుంటున్నావ్.. నీ అవసరం కోసం ఉపయోగించు కుంటున్నావ్.. నేను స్నేహితురాలిగా చూస్తున్నా.. కానీ నువ్వు మాత్రం అలా చేయడం లేదు.. నీకు ఉపయోగపడితే స్నేహితురాలి.. లేకపోతే పరాయిదాన్ని అని రోహిణిని కడిగి పారేస్తుంది విద్య. మనోజ్‌ని, మీ ఇంట్లో వాళ్లందరినీ నువ్వు మోసం చేస్తున్నావ్.. అసలు నువ్వు నా ఇంట్లోంచి వెళ్లిపో అని విద్య అంటుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది. సరే వెళ్తా.. ఇంకెప్పుడూ నీ ఇంటికి కూడా రాను అని చెప్పి వెళ్లిపోతుంది రోహిణి. దీంతో విద్య కాస్త రిలీఫ్ అయినట్టుగా ఫేస్ పెడుతుంది.
బాలుకి అనుమానం..
ఇంకో వైపు లీకైన వీడియో గురించి శివని అడుగుతాడు బాలు. గుణ గాడి హస్తం ఏమీ లేదు అని శివ తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటాడు. ఇదే విషయాన్ని బాలుకి చెబుతాడు. మరి గుణ కాకపోతే ఇంకెవరు.. ఈ పార్లరమ్మ ఏమైనా లీక్ చేసి ఉంటుందా? అని బాలు అనుమానిస్తాడు. తను అలా చేయదు అని మీనా అంటే.. అందరూ మనలా మంచి వాళ్లలా ఉండరు.. సరే విద్య, రోహిణి ఫోటోలను తాతకు చూపిద్దాం.. వాళ్లు గుర్తు పడతారు కదా.. అని బాలు అంటాడు. విద్య ఫోటోని ఎలాగైనా సంపాదించి రా అని మీనాకి చెబుతాడు బాలు.
ప్రేమలో మురళీ, విద్య..
ఇంకో వైపు ఆ మురళీ ఏమో విద్య ఇంటి ముందే ఉంటాడు. అతడ్ని చూసిన విద్య లోపలకు రమ్మని పిలుస్తుంది. రెండ్రోజుల నుంచి మీరు కనిపించలేదు.. మిమ్మల్ని చూడాలని అనిపించింది.. అడ్రస్ కనుక్కుని వచ్చాను అని మురళీ అంటాడు. అవునా ఎందుకు.. అంటే మీరు నా వెంట పడుతున్నారా? అని విద్య అంటుంది. అది వెంట పడటం కాదు ఇంట్రస్ట్, ఇష్టం అని కూడా అనుకోవచ్చు కదా అని మురళీ అంటాడు. తన మనసులోని మాట చెప్పాలని అనుకుంటాడు.. కానీ చెప్పకుండానే తిరిగి వెళ్లిపోతాడు. ఇక మురళీ మాటల్ని తల్చుకుంటూ విద్య మురిసిపోతూ ఉంటుంది.
మాటల్లో పెట్టిన మీనా..
ఇంతలోనే మీనా వస్తుంది. ఇప్పుడే ఒకతను వచ్చాడు.. అతను నన్ను ఇష్టపడుతున్నాడు.. మంచివాడు.. నాకు మీ జంటే గుర్తుకు వచ్చింది.. అసలు కాబోయే వాడు మంచి వాడా? కాదా? అని ఎలా తెలుసుకోవాలి అని విద్య సలహా అడుగుతుంది. అతని ఫోన్ తీసుకుని రోజంతా నీతోనే పెట్టుకో అని మీనా అంటుంది. నీ మాటలు వింటుంటే అతనంటే కూడా నీకు ఇష్టమనే తెలుస్తోంది అని మీనా చెబుతుంది. అవునా.. అంత కచ్చితంగా అనిపిస్తోందా? అని రోహిణి అడుగుతుంది. అవును నీ కళ్లలో మెరుపు, బుగ్గల్లో సిగ్గు అన్నీ చెప్పేస్తున్నాయి.. అని మీనా చెబుతుంది.
పొగిడేసిన బాలు..
అవునా.. అని విద్య అంటే.. కావాలంటే ఫోటోలు తీసి చూపిస్తా చూడు అని తన పని కూడా చేసేసుకుంది మీనా. నాకు పని ఉంది ఇక వెళ్తాను అని మీనా బయటకు వస్తుంది. పని పూర్తి అవ్వడంతో మీనా సంతోషంగా ఉంటుంది. నువ్వు మాట్లాడితే అవతలి వాళ్లు మైమర్చిపోతారు.. ఏం ఇచ్చారో కూడా గుర్తుండదు అని బాలు అంటాడు. అంటే నేను మాయలమ్మనా? అని మీనా అంటుంది. ముందు ఈ ఫోటోలను తాతకు చూపిద్దాం.. అందులో ఆ అమ్మాయి ఉందా? అని అడుగుదామని బాలు ఫోన్ చేస్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.