Podarillu Today జూన్ 05 ఎపిసోడ్ : అస్థిత్వం, వ్యక్తిత్వం కోల్పోయా.. ఆది, ప్రతాప్లపై హారిక తిరుగుబాబు.. శైలు గుండెకి గాయం చేసిన కేశవ
Podarillu Today జూన్ 05 ఎపిసోడ్ : అస్థిత్వం, వ్యక్తిత్వం కోల్పోయా.. ఆది, ప్రతాప్లపై హారిక తిరుగుబాబు.. శైలు గుండెకి గాయం చేసిన కేశవ
Podarillu Serial 2026 June 5th Episode Preview పొదరిల్లు సీరియల్లో శుక్రవారం నాడు హారిక తిరుగుబాటు చేస్తుంది. అసలు ఇలాంటి ఇంట్లో, ఇలాంటి మనుషుల మధ్య ఉండలేను.. నా కూతురిని పెంచలేను అని హారిక అంటుంది. ప్రతాప్ వేడుకోవడంతో, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయము అని చెప్పడంతో హారిక కూల్ అవుతుంది. ఇంకో వైపు కేశవ తనని వెతుక్కుంటూ వచ్చిన శైలుని దారుణంగా అవమానిస్తాడు.. కొట్టి పంపిస్తాడు. శైలు కన్నీరు పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. మరో వైపు చక్రి ఏమో మహా ఆలోచనలతో గాల్లో తేలిపోతోంటాడు.

ఇదంతా నా వల్లే జరిగింది నన్ను క్షమించండి అని కారులో వెళ్తున్న టైంలో ఎమోషనల్ అవుతుంటుంది మహా. మీరు మాకు క్షమాపణలు చెప్పొద్దు అని అందరూ అంటారు. మీరు ఉన్నప్పుడు అల్లుడు గారు అనే వాళ్లు మీరు లేనప్పుడు డ్రైవర్ అనేవాళ్లు.. నన్ను ఓ సారి కింద కూర్చోపెట్టి నీ స్థాయి అదే అని అన్నారు అని చక్రి అంటాడు. అవునా.. ఇది నాకు ఎందుకు చెప్పలేదు రా.. చెప్తే వచ్చి వాళ్లని కూడా నేల మీద పడుకోబెట్టేవాడ్ని అని కేశవ ఫైర్ అవుతాడు. వద్దు అలా మాట్లాడకూడదు అని మాధవ అంటాడు. కేశవ అన్నదాంట్లో తప్పేముంది.. అని మహా అంటుంది. సారీ అండి.. నేను వాళ్ల అతి ప్రేమలో పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యాను.. అందుకే ఇంకేం ఆలోచించలేకపోయాను అని మహా మళ్లీ సారీ చెబుతుంది. మనం చేసిన తప్పులకు మనం సారీ చెప్పాలి.. ఎదుటి వారు చేసిన తప్పులకు కాదు అని మాధవ అంటాడు. అవును.. ఎవరి సామానులకు వారే బాధ్యులు అన్నట్టు.. ఎవరి తప్పులకు వారే బాధ్యులు అని చక్రి కామెడీ చేస్తే.. మీకు ఇంకా వెటకారం తగ్గలేదు అని మళ్లీ చక్రిని ఏడ్పిస్తుంది మహా. మాకు కావాల్సిన మహాలక్ష్మీ వచ్చారు.. ఇప్పుడు మా నాన్న చూస్తే శివంగీ ఈజ్ ఆన్ డ్యూటీ అని అంటాడు అని చక్రి కామెడీ చేస్తే మహా నవ్వేస్తుంది.
ఖరీదైన బంగ్లాలో ఓ వంట మనిషిగా..
ఖరీదైన బంగ్లాలో ఓ వంట మనిషిగా..
సిరి పాపని, తన లగేజ్ను తీసుకుని హారిక ఇంటి నుంచి వెళ్లిపోతుంటుంది. ఏమైంది? ఎటు వెళ్తున్నావ్.. అని ఆది, లలిత అడుగుతారు. ఈ ఇంటికి దూరంగా నా బిడ్డను పెంచాలని అనుకుంటున్నాను. నేను కూడా మహాలానే చదువుకున్నాను.. ఈ చదువుని త్యాగం చేసి.. ఈ ఇంటికి కోడలిగా వచ్చాక.. ఈ ఖరీదైన బంగ్లాలో ఓ వంట మనిషిగా మారాను.. నా కంటూ వ్యక్తిత్వం లేకుండా పోయింది.. ఓ అస్థిత్వం లేకుండా పోయింది.. నిర్ణయం చెప్పే అధికారం లేదు.. అభిప్రాయం పంచుకునే స్వేచ్చ లేదు.. నిలువెత్తు పురుష అహంకారానికి భార్యగా మిగిలిపోయాను..
నీకు మాట్లాడే అర్హత లేదు..
అందుకే నేను ఈ ఇంటికి దూరంగా పాపని పెంచాలని అనుకుంటున్నాను అని హారిక అంటుంది. ఎప్పుడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి? అని లలిత అంటుంది. ఎప్పుడూ చూడనిది, జరగనిది ఇప్పుడు ఇక్కడ చూశాను అని హారిక అంటుంది. ఈ ఇంట్లోని మనుషుల్లో ఉన్న పైశాచికత్వం, స్వార్థం, ద్వేషం ఇవన్నీ ఇప్పుడు చూశాను అని హారిక అంటుంది. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని ఆది అంటాడు. ఏంటి ఏయ్.. నీకు మాట్లాడే అర్హత లేదు.. నా మీద నువ్వు హక్కుని కూడా కోల్పోయ్ అని రెట్టించిన స్వరంతో హారిక అనడంతో ఆది ఒక్కసారిగా షాక్ అవుతాడు.
నాలో అగ్నిపర్వతం రగులుతూ
మహాలో పరాయి వ్యక్తులు ఓ అమ్మని, ఓ దేవతని చూశారు.. కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లని మాత్రం ఓ తండ్రి కూతురిగా చూడలేదు.. తల్లి కన్న ప్రేమను చూపించలేదు.. అన్న తోడబుట్టిన మమకారం చూపించలేదు అని హారిక అంటుంది. అమ్మా.. మా మీద నీ మనసులో ఇంత ద్వేషం, విషం నిండిపోయిందా? అని ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. మీరు మహా సర్టిఫికెట్లను కాల్చిన నాటి నుంచే నాలో అగ్నిపర్వతం రగులుతూ ఉంది.. ఈ రోజు మీలో హంతకులను, నేరస్తులను చూశాను.. ఇంకా ఈ ఇంట్లో నేను ఎలా ఉంటాను.. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న మీ మధ్యలో నా కూతురిని ఎలా పెంచాలి…
ఇలాంటి దుర్మార్గుడి అడుగు జాడల్లో..
అందుకే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతోన్నాను.. అని హారిక అంటుంది. నీ మంచికే చెబుతున్నాను.. లోపలకు వెళ్లు అని లలిత అంటుంది. ఏం చెప్తారు మీరు.. మీకు నచ్చని వాళ్లని చంపేయమని ఆది, మామయ్య గారితో చెబుతారు అంతే కదా.. అని హారిక అంటుంది. దీంతో లలిత నోరు ఎత్తదు. ఆదర్శ శ్రీమూర్తి.. భర్త అడుగు జాడల్లో మీరు నడుస్తారేమో.. ఇలాంటి దుర్మార్గుడి అడుగు జాడల్లో నడవాల్సిన కర్మ నాకు పట్టలేదు.. నా కాళ్ల మీద నేను నడవగలను.. నా భవిష్యత్తు, కలలు, ఆశయాల వైపు అని హారిక అంటుంది. నా కూతురిని నాకు ఇచ్చి వెళ్లు అని ఆది గొడవ చేస్తాడు.
ముమ్మాటికి తప్పే.. పరువు హత్యే
ఆది అలా ప్రవర్తిస్తుంటే.. ప్రతాప్ లాగి పెట్టి కొడతాడు. నిజంగా తప్పు నాదే అమ్మ.. వీడ్ని ఇలా మూర్ఖంగా పెంచింది, చేసింది నేనే.. నా లానే ఆలోచించే కొడుకు పుట్టాడని గర్వపడ్డాను.. నాలానే హింసవైపు నడిపించాను.. మాలో ఈ నేర ప్రవృత్తి లేదు.. నీకు ఓ కూతురు ఉంది.. బాగా చదివించి భద్రంగా చూసుకుని ఓ పెద్ద ఇంటికి ఇవ్వాలని అనుకుంటావ్ కదా.. ఎవరో ఒకడు అనామకుడు వచ్చి తీసుకుపోతే ఎలా ఉంటుంది.. అని ప్రతాప్ అంటాడు. దానికి మార్గం ఇది కాదు.. మీ తండ్రీకొడుకులు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే.. పరువు హత్యే అని హారిక అంటుంది.
ఇంటి కోడలు కూడా వెళ్లిపోతే..
ఇంకోసారి ఇలాంటి తప్పు చేయము అమ్మా అని ప్రతాప్ అంటాడు. ఒకసారి చేసినా, రెండు సార్లు చేసిన తప్పు తప్పే.. అని హారిక అంటుంది. ఇంకోసారి ఇలా జరగదు.. మేం కూడా వారి గురించి ఆలోచించం.. మహా బావ గారు చెప్పినట్టు నా ఇంటి నుంచి నా ఐశ్వర్యమే పోయింది.. ఇప్పుడు ఈ ఇంటి కోడలు కూడా వెళ్లిపోతే.. ఈ ఇళ్లు పాడుబడిపోతుంది.. అని ప్రతాప్ అంటాడు. హారిక మేం చేసింది తప్పో ఒప్పో.. ఇంకెప్పుడు అలాంటివి జరగవు, చేయం అని లలిత అంటుంది. కన్న కూతురి దృష్టిలో చనిపోయాం.. ఇప్పుడు నీ దృష్టిలో కూడా కనీసం మనుషుల్లా ఉండకపోతే.. మేం బతికి కూడా వృథానే అని లలిత అంటుంది.
తండ్రి తరువాత తండ్రిలా మాటిస్తున్నా..
మీరు అవకాశం దొరికితే మళ్లీ మృగాలుగా మారిపోతారు.. అని హారిక అంటుంది. ఇకపై మేం హింసని వదిలేస్తాం.. నీకు కూడా వ్యక్తిగత గుర్తింపు, స్వేచ్చను ఇస్తాను.. ఉద్యోగం చేసుకో.. ఇవన్నీ మామయ్యలా కాదు.. తండ్రి తరువాత తండ్రిలా మాటిస్తున్నాను అని ప్రతాప్ అంటాడు. దీంతో హారిక ఎటూ తేల్చుకోలేక కాస్త కూల్ అయి లోపలకు వెళ్తుంది. ఇంకో వైపు నారాయణ హాయిగా పడుకుని ఉంటాడు. కన్నా గాడు దిండు కింద ఉన్న కీ తీయాలని చూస్తాడు. నిద్రలోనే కన్నా చేయి పట్టుకుని ఎవడ్రా వాడు అని నారాయణ అంటాడు. ఓ నువ్వేనా అని కళ్లు తెరిచి నారాయణ అంటాడు..
మేం కొట్టి వదిలేశాం..
అంతా ఫైటర్సే.. మీకు ఆయన నుంచే ఇదంతా వచ్చిందని మహా అంటుంది. నన్ను వదిలేసి పోయారేంట్రా.. అని నారాయణ అంటాడు. మేం సైట్ సీయింగ్ కోసం వెళ్లలేద.. ఫైటింగ్ కోసం వెళ్లామని కేశవ చెబుతాడు. నేను కూడా వచ్చేవాడ్ని కదరా మెకానిక్ అని నారాయణ అంటాడు. మేం కొట్టి వదిలేశాం.. నువ్వు చంపేవాడివి అని కేశవ అంటాడు. అబ్బా.. మంచి ఛాన్స్ మిస్ అయింది రా.. నేను అలిగాను.. అని నారాయణ అంటాడు. మరీ బుంగమూతి పెట్టుకోరా అని మహా కామెడీ చేస్తుంది. అది బుంగమూతిలా లేదు.. పంది మూతిలా ఉంది కన్నా కౌంటర్ వేయడంతో అంతా నవ్వేస్తారు.
ఇద్దరూ దొంగలే..
ఆ ఇంట్లో అందరూ నిన్ను దొంగా అని అన్నా కూడా మహాలక్ష్మీ మాత్రం నిన్ను నమ్మింది అని కేశవ, మాధవ అంటారు. అన్ని డబ్బులు, నగలు ఏం చేస్తారు అని ఓ రెండు లేపేశా అని గోల్డ్ కాయిన్స్ చూపిస్తాడు చక్రి. ఇవి పెనాల్టీగా తీసుకున్నా.. నన్ను కొట్టారు.. అవమానించారు.. దెబ్బలకు మందులు కావాలి కదా అని చక్రి అంటాడు. మాధవ తిడుతుంటే.. చక్రి చేసింది తప్పు లేదు.. ఎందుకంటే నేను కూడా కొట్టేశా.. నా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ ఇవన్నీ ఇంట్లోంచి ఎత్తుకొచ్చా అని మహా కూడా అంటుంది. ఇద్దరూ దొంగలే.. దొందుదొందే అని కేశవ కామెడీ చేస్తాడు.
చెట్టుకు కట్టేసి..
కారు తీసుకు వెళ్లడానికి డ్రైవర్ వస్తే.. దొంగ అనుకుని కట్టేసి కొడుతుంటాడు నారాయణ. మహా వచ్చి కారు తాళాలు ఇస్తుంది. ఆ డ్రైవర్ కారు చెక్ చేస్తూ ఉంటే.. మేం మీ బాస్ వాళ్లలా క్రిమినల్స్ కాదు.. చూసింది చాలు వెళ్లిపో అని మహా అంటుంది. చూశావా రా మన అని అంటుంది.. మన కుటుంబంలో కలిసిపోయింది.. మెల్లిగా నా భార్యలా మారిపోయింది అని చక్రి అంటాడు. అంత సంబరపడిపోకు అని కేశవ అంటాడు. నన్ను బావా అని పిలుస్తుందేమో.. బేబీ, స్వీట్ హార్ట్ అంటుందేమో అని చక్రి అంటాడు. నువ్వు ఇలానే కలలు కంటూ ఉండు మేం వెళ్లి పడుకుంటామని కేశవ కౌంటర్లు వేస్తాడు.
సేవలు చేయించుకోవాలి..
కన్నా గాడికి జ్వరం వచ్చిందని పనికి వెళ్లను అని పెద్ది అంటాడు. నేను చూసుకుంటాను మీరు వెళ్లండని మహా అంటుంది. ఆహా ఇదే మంచి సందర్భం.. నేను కూడా ఇంట్లో ఉండి.. సేవలు చేయించుకుని, సానుభూతి కొట్టేయాలని చక్రి అనుకుంటాడు. మీకు పనీ పాటా లేదా.. మీరు వెళ్లరా? అని మహా అంటుంది. బాడీ పెయిన్స్ అండి అని చక్రి చెబితే.. అందుకే హాస్పిటల్ అని అన్నాను. మీరే వద్దన్నారు అని మహా అంటుంది. వాడికి అయితే ఫీజు ఇవ్వాలి.. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అని చక్రి అంటాడు. కన్నా గాడు రూంలో పడుకోడానికి వెళ్తాడు.. హాల్లో ఉన్న చక్రికి బెడ్ షీట్ ఇస్తుంది మహా. ఇలానే సేవలు చేయించుకోవాలని చక్రి సంబరపడిపోతాడు.
లాగి పెట్టి కొట్టిన కేశవ..
ఇంకో వైపు కేశవ కోసం శైలు ఇంటికి వస్తుంది. శైలుని అలా చూసి కేశవ కంగారు పడతాడు. ఎందుకు వచ్చావ్ వెళ్లిపో అని అంటాడు. నా ఫోన్ కట్ చేస్తావా? స్టైలీష్ శైలు ఫోన్ కట్ చేస్తావా? అని ఓవర్ యాక్షన్ చేస్తుంది శైలు. గట్టిగా మాట్లాడకు.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని కేశవ అంటాడు. ఇక ఎంత చెప్పినా శైలు వినడం లేదు అని లాగి పెట్టి కొడతాడు కేశవ. నీకు నేను ఏమైనా బాకీ ఉన్నాను.. అప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్నానా.. ఒకడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లంలో ఉన్నాడని అర్థం చేసుకోవా.. నా డబ్బు నువ్వు కాజేసి.. ఇంకా జిడ్డులా తగులుకున్నావ్.. ఇంకోసారి నా చుట్టూ తిరిగే నీ ఇంట్లోనే పంచాయితీ పెడతా.. ఇంకోసారి నీ మొహం చూపించకు.. పో ఇక్కడి నుంచి అని కేశవ ఫైర్ అవుతాడు. దీంతో శైలు ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.