షుగర్‌ కంట్రోల్‌, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు, దొరికితే ఖచ్చితంగా తినండి

 షుగర్‌ కంట్రోల్‌, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు, దొరికితే ఖచ్చితంగా తినండి

ప్రకృతి మనకు అందించే నల్లటి వజ్రం నేరేడు పండు. కలర్‌ఫుల్‌ ప్యాకింగ్‌, రంగు రంగుల మెరుగులు లేకపోయినా స్వచ్ఛమైన మట్టి వాసనతో పెరిగే ఈ పండ్లు అద్భుతమైన ఆరోగ్య గని. శరీరంలోని వేడిని తగ్గించి ఉత్తేజాన్ని ఇచ్చే గుణం వీటి సొంతం. మనం రకరకాల విదేశీ పండ్ల వెంట పడుతున్నాం కానీ మన పెరట్లో, మన ఊర్లో ఊరికే దొరికే నేరేడు పండ్లలో ఉండే ఔషధ విలువలు అమోఘమని గ్రహించలేకపోతున్నాం. గింజ నుంచి తొక్క వరకు ప్రతి అణువులో ప్రాణవాయువు వంటి శక్తిని నింపుకున్న ఈ పండు ఎన్నో రోగాలను నయం చేసే వైద్యుడిలా, శరీరాన్ని శుద్ధి చేసే సాధనంలా పనిచేస్తుంది.

నేరుడు పండ్లు చూడటానికి నల్లటి రంగు.. తీపి, వగరు కలగలిపిన రుచి. వేసవి కాలం ముగిసి తొలి చినుకులు పలకరించే సమయంలో ప్రకృతి మనకు ఇచ్చే అద్భుతమైన వరం ఈ నేరేడు పండ్లు. మన పల్లెటూర్లలో చెట్ల కింద రాలే నేరేడు పండ్లను ఏరుకుని తిన్న అందమైన జ్ఞాపకాలు మనలో చాలా మందికి ఉండే ఉంటాయి. నేరుడు పండ్లు తిన్న తర్వాత నోరంతా నీలం రంగులోకి మారగానే చూసి మురిసిపోయే ఆ రోజులు ఎంతో స్పెషల్‌.

అయితే ఈ నేరేడు పండ్లు రుచికి మాత్రమే కాదు.. శరీరంలోని ప్రతి భాగానికి మేలు చేసే ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మన పూర్వీకుల కాలం నుంచి నేరేడు పండ్లను ఆయుర్వేదంలో దివ్యౌషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా షుగర్‌ ఉన్న వాళ్లకు నేరేడు పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరమని ResearchGate అధ్యయనం పేర్కొంది.

మోడ్రన్‌ సైన్స్‌ కూడా నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని NIH అధ్యయనం పేర్కొంది. ఎలాంటి ఖర్చు లేకుండా సహజంగా పెరిగే ఈ పండు మన రోజువారీ ఆహారంలో బాగమైతే అది మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

షుగర్‌ కంట్రోల్‌
షుగర్‌ కంట్రోల్‌

షుగర్‌ కంట్రోల్‌
నేరుడు పండు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని జంబోలిన్‌, జంబోసిన్‌ గ్లైకోసైడ్లు పిండి పదార్థం చక్కెరగా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. అలాగే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కారణంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరగవు. ముఖ్యంగా నేరుడు పండ్ల గింజల పొడి డయాబెటిస్‌ నియంత్రణకు చాలా మంచిది.

గుండె ఆరోగ్యం
గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం
నేరుడు పండులో గుండెకు మేలు చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి హార్ట్‌ స్ట్రోక్‌, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఎలాజిక్‌ యాసిడ్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ ఆక్సీకరణను అడ్డుకుంటాయి.

జీర్ణక్రియ మెరుగుదల

జీర్ణక్రియ మెరుగుదల
నేరుడు పండులో ఉండే యాస్ట్రింజెంట్‌ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా విరేచనాలు, డయేరియాను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

రోగనిరోధక శక్తి పెంపు

రోగనిరోధక శక్తి పెంపు
ఇందులో విటమిన్‌ సీ, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి శరీరానికి రోగాలతో పోరాడే ఇమ్యూనిటీ బలాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.

నోరు, చర్మం, కంటి ఆరోగ్యం

నోరు, చర్మం, కంటి ఆరోగ్యం
నేరేడు పండ్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడి మొటిమలు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. నోటి ఆరోగ్యానికి, చిగుళ్ల సంరక్షణకు తోడ్పడుతాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి
ఇక నేరేడు పండులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్లకి ఇదొక మంచి సూపర్‌ ఫుడ్‌ అని చెప్పొచ్చు.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలవ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. అయితే వీటిని పాటించే ముందు డాక్టర్‌ సలహా తీసుకోండి. వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *