Podarillu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్ : ఒక్క ఫోన్ చేస్తే గాయత్రికి విడాకులు.. కేశవ వార్నింగ్.. గమ్యానికి చేరువలో మహా

 Podarillu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్ : ఒక్క ఫోన్ చేస్తే గాయత్రికి విడాకులు.. కేశవ వార్నింగ్.. గమ్యానికి చేరువలో మహా

Podarillu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్ : ఒక్క ఫోన్ చేస్తే గాయత్రికి విడాకులు.. కేశవ వార్నింగ్.. గమ్యానికి చేరువలో మహా

Podarillu Serial 2026 April 28th Episode Preview పొదరిల్లు బుధవారం నాటి ఎపిసోడ్‌లో పెద్దిని నవ్వించేందుకు అందరూ తెగ ప్రయత్నిస్తారు. ఇక మరో వైపు కేశవని రెచ్చగొట్టేందుకు రమణయ్య ప్రయత్నిస్తాడు. కానీ కేశవ తిరిగి వార్నింగ్ ఇస్తాడు. మీ వాళ్లు మా అన్నయ్య కాళ్లు పట్టుకుంటే ఈ పెళ్లి జరిగింది.. ఓవర్ యాక్షన్ చేస్తే ఆ వినోద్‌కి ఒక్క ఫోన్ చేస్తా.. వీసా రాకముందు విడాకులు ఇచ్చేస్తాడు అంటూ రమణయ్యని కేశవ బెదిరిస్తాడు. ఇక అలా ఈ ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్ట్‌లు గానీ ఎమోషన్ గానీ ఏమీ లేకుండానే సాగినట్టు అనిపిస్తుంది.

పొదరిల్లు టుడే ఎపిసోడ్
పొదరిల్లు టుడే ఎపిసోడ్
తెల్లారినా పెద్ది పడుకుని ఉంటాడు. కాఫీ పెడదామని మహా ట్రై చేస్తుంది. కానీ ఇంతలో కిచెన్‌లో ఏదో కింద పడేస్తుంది. దీంతో పెద్ది వెంటనే లేచి వచ్చి చూస్తాడు. పెద్దికి ఏదో ఒక పని చెప్పాలి.. అప్పుడే అన్నీ మర్చిపోతాడు అని ఉప్మా చేసి పెడతావా? అని అడుగుతుంది మహా. ఇక పెద్దిని మాటల్లో పెట్టి, వంట చేయిస్తూ నవ్విస్తుంది మహా. మహా కోరినట్టుగా పెద్ది ఉప్మా చేసి పెడతాడు. నేను ఏడ్చి నిన్ను బెదరగొట్టి ఉంటాను.. సారీ అమ్మ.. అని మహాని పెద్ది అడుగుతాడు. మీ ప్రేమ గురించి నాకు తెలుసు.. మీ గుండె ఎంత ముక్కలై ఉంటుందో నాకు తెలుసు అని మహా అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఉప్మా తింటుండగా.. కన్నా వస్తాడు. ఉప్మాకి దండం పెట్టి వెళ్తాడు. ఓ లేడీ కష్టమర్ కారులో చక్రి బుర్ర తింటుంది. నన్ను నా డ్రైవింగ్ చేసుకోనివ్వండి.. మీరు సైలెంట్‌గా ఉండండి అని సెటైర్ వేస్తాడు చక్రి. ఇంతలో చక్రికి మహా ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో.. అర్థం కావడం లేదు అని మహా అంటుంది. ప్రపోజ్ చేస్తుందేమో అని చక్రి సంబరపడిపోతాడు.

బాధపడ్డ మహా..

బాధపడ్డ మహా..

బాధపడ్డ మహా..
చాలా బాధగా ఉంది.. అని మహా.. ప్రేమిస్తే సంతోషంగా ఉంటుంది కదా?. బాధగా ఎందుకు ఉంటుంది.. అని చక్రి అంటాడు. పెద్ది గురించి అని మహా చెబుతుంది. అన్నయ్యకి ఇప్పుడు ఏమైంది? అని చక్రి అంటాడు. గాయత్రి పెళ్లి జరిగిపోయింది కదా? అని మహా అంటుంది. అన్నయ్యే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.. దానికి మనం ఏం చేస్తాం.. వాళ్ల మొసలి కన్నీళ్లకు కరిగిపోయాడు.. తాళి కట్టకుండా వదిలేసింది తనే కదా.. మర్చిపోమనండి అంటూ చక్రి చెబుతాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు అని మహా చెప్పడంతో చక్రి ఎమోషనల్ అవుతాడు.

కంటతడి పెట్టిన చక్రి..
కంటతడి పెట్టిన చక్రి..

కంటతడి పెట్టిన చక్రి..
పెద్ది అలా చిన్నపిల్లాడిలా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధేసింది.. చిన్నప్పటి నుంచి ప్రేమించిన గాయత్రి పెళ్లి అయిపోతే పెద్ది మనసు ఎలా బాధపడి ఉంటుందో అర్థం చేసుకోగలను.. అందుకే బాధ అంతా పోయే వరకు ఏడ్వండి అని చెప్పాను.. అసలు పెద్ది తన మనసులో అంత ప్రేమను దాచుకుని మన అందరితో అలా ఎలా సరదాగా, నవ్వుతూ ఉన్నాడో అర్థం కావడం లేదు.. అని పెద్ది గురించి మహా చెబుతుంది. ఇక మహా మాటలకు చక్రి కన్నీరు పెడతాడు. ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నాడు.. రమ్మంటారా? అని చక్రి అడిగితే.. వద్దు పని చూసుకుని రండి అని చెబుతుంది.

కారులో చక్రి, కేశవ

కారులో చక్రి, కేశవ
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురించి మహాకి యూనివర్సిటీ నుంచి ఫోన్ వస్తుంది. చూస్తుంటే మహా తన గమ్యానికి చేరువ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక కారులో కేశవ, చక్రి వెళ్తుంటారు. మాధవ ఏడ్చిన ఘటన గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. పాపం గాయత్రి అన్నయ్యని ప్రాణంగా ప్రేమించింది.. నేను ఎంత బెదిరించినా, తిట్టినా అన్నయ్యని కలుస్తూనే ఉండేది అని కేశవ అంటాడు. మనకు ఉన్న ఒక్కగానొక్క బంధువు వెళ్లిపోయింది.. అని చక్రి అంటాడు. ఇంత బాధలో కూడా మహా నాకు ఫోన్ చేసింది కదా.. అదే నాకు సంతోషంగా ఉందిరా అని చక్రి అంటాడు.అన్నయ్య గురించి బాధ లేదు గానీ, మహాలక్ష్మీ ఫోన్ చేస్తే హ్యాపీగా ఉందని అంటావా? కారులోనే చక్రి, కేశవ గొడవ పడుతుంటారు.

పరధ్యానంలో పెద్ది..

పరధ్యానంలో పెద్ది..
చక్రి తీసుకు వచ్చే బిర్యానీ కోసం కన్నా, మహా వెయిట్ చేస్తుంటారు. అందరం కలిసి భోజనం చేద్దామని మాధవని పిలుస్తారు. అక్కడ కేశవ, చక్రి గొడవ పడుతుంటారు. అందరూ నవ్వుతూ ఉన్నా పెద్ది మాత్రం పరధ్యానంలో ఉంటాడు. ఇంతలో నారాయణ వచ్చి.. ఈటింగ్? చీటింగ్? అని తాగేసి వాగుతుంటాడు. నాకు కూడా బిర్యానీ పెట్టండి రా అని ప్లేట్ తెచ్చుకుంటాడు. పెద్ది తినకుండా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ఏమైంది అన్నయ్య.. తిను.. కేశవ, చక్రి అంటాడు. అది తలనొప్పి అని అక్కడ కన్న, కేశవ, చక్రి కామెడీ చేస్తారు. పెద్దిని నవ్వించేందుకు కన్నా లేడీ వేషంలో డ్యాన్స్ చేస్తాడు. నారాయణ కూడా వచ్చి ఈ డ్యాన్స్ పార్టీలో చేరతాడు. అందరూ కలిసి స్టెప్పులు వేస్తారు.

రమణయ్య ఓవర్ యాక్షన్

రమణయ్య ఓవర్ యాక్షన్
టీ షాప్ వద్ద రమణయ్య తమ ఇంట్లో గురించి జరిగిన పెళ్లి గురించి గొప్పగా చెబుతుంటాడు. అక్కడే ఉన్న కేశవ ఇవన్నీ విని ఆగ్రహిస్తాడు. ఆపాలని చూసినా మేం పెళ్లి చేసి పంపాం.. వాళ్లంతా కుళ్లుకునేలా పెళ్లి చేసి పంపించాం అని రమణయ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఏమైందిరా.. మీ అన్నయ్యకి పెళ్లి చేస్తామని అన్నారు.. పిల్ల దొరకలేదా? అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పాడుబడ్డ కొంపకి పిల్లని ఎవరిస్తారు రా అని వెక్కిరిస్తాడు.ఏంట్రా.. ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అని రమణయ్యని బెదిరిస్తాడు కేశవ.

రమణయ్యకి వార్నింగ్..

రమణయ్యకి వార్నింగ్..
గాయత్రే ప్రేమించింది.. తెల్లారితే పెళ్లి అనగానే.. రాత్రి మా ఇంటికి వచ్చింది.. పెళ్లి మీరు చేస్తే జరగలేదు.. మా అన్నయ్య బిక్షతో జరిగింది.. మా అన్నయ్య కాళ్లని మీ వాళ్లు పట్టుకుంటే జరిగింది.. పెళ్లి చేశాం పెళ్లి చేశాం అని ఎగిరి పడుతున్నావ్.. మీ వినోద్ గాడికి ఒక్క ఫోన్ చేసి చెబితే.. వీసా రాకముందే విడాకులు వస్తాయ్.. చేయమంటావా? అని కేశవ భయపెడతాడు. నేను మా అన్నయ్య అంత మంచివాడ్ని అయితే కాదు.. గుర్తు పెట్టుకో.. పెదనాన్నవి అని పద్దతిగా చెబుతున్నా.. ఇంకో సారి ఓవర్ యాక్షన్ చేస్తే చంపేస్తా అని కేశవ వార్నింగ్ ఇస్తాడు. ఇక అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *