పండగ పూట పరీక్షలు వద్దు.. ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా చేయండి.. సీఎం రేవంత్‌కు అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్
పండగ పూట పరీక్షలు వద్దు.. ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ వాయిదా చేయండి.. సీఎం రేవంత్‌కు అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మే 28న జరగాల్సిన బీఏ, బీకామ్, బీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లను కోరారు. ఆ రోజు ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ కావడమే ఇందుకు కారణం. పండుగ రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను మరో తేదీకి రీషెడ్యూల్ చేయాలని ఓవైసీ తన ట్వీట్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైలైట్:
మే 28న ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్
ఓయూ డిగ్రీ పరీక్షలను వాయిదా చేయండి
సీఎం రేవంత్‌కు అసదుద్దీన్ ఓవైసీ రిక్వెస్ట్
Asaduddin Owaisi
మే 28న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పలు డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆ రోజు ముస్లింల పవిత్ర పండుగ ఈద్ అల్-అధా (బక్రీద్) కావడంతో అదే రోజున పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావులను ఆయన ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
మే 28న ఓయూ పరిధిలో కీలకమైన బీకామ్, బీఎస్సీ, బీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల నాలుగో, ఆరవ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా బీకామ్ 4వ సెమిస్టర్ బిజినెస్ స్టాటిస్టిక్స్, 6వ సెమిస్టర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ వంటి ముఖ్యమైన సబ్జెక్టుల పరీక్షలు ఆ రోజు షెడ్యూల్ అయ్యాయి. పండుగ రోజున పరీక్షలు రాయడం వల్ల ముస్లిం విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారని, వారు నష్టపోయే ప్రమాదం ఉందని ఓవైసీ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్ఠిలో ఉంచుకుని ఈ పరీక్షలను మరొక అనుకూలమైన తేదీకి వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ రిక్వెస్ట్‌పై యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష EMCET- 2026 ఫలితాలు ఆదివారం జేఎన్టీయూహెచ్లో విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, జేఎన్టీయూహెచ్ వీసీ టి.కిషన్‌కుమార్‌రెడ్డి, కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డిలతో కలిసి ఈ ఫలితాల సీడీ, పాస్‌వర్డ్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది ఫలితాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. EMCET- 2026ఇంజినీరింగ్ విభాగంలో తొలిసారిగా ఒక అమ్మాయి ప్రథమ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రాంతానికి చెందిన మల్లాడి రుషి 160 మార్కులకు గాను 156.63 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు దక్కించుకుంది. సాధారణంగా మెడికల్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగాల్లో అమ్మాయిలే ఎక్కువసార్లు ప్రథమ ర్యాంకులు సాధిస్తుండగా.. ఈసారి అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో అబ్బాయి టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముఖరం అహ్మద్ 150.17 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. మెుత్తంగా ఇంజినీరింగ్‌లో 73.36 శాతం, అగ్రికల్చర్లో 86.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.