టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు

 టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు

టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు.. 6 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు

తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో బాలికలు.. తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బాలుర కంటే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96 శాతానికి పైగా పాస్ కాగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 94 శాతానికి పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 5731 స్కూళ్లలో అందరు విద్యార్థులు పాస్ కాగా.. 6 ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇక అత్యధికంగా పాస్ పర్సెంటేజ్‌తో ములుగు జిల్లా టాప్‌లో ఉండగా.. అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో హైదరాబాద్ చిట్టచివరి స్థానంలో నిలిచింది.

SSC Results
టెన్త్ ఫలితాల్లోనూ మళ్లీ సత్తా చాటిన బాలికలు
ఏ పరీక్షలైనా బాలికలదే పై చేయి కొనసాగుతోంది. మొన్న విడుదలైన ఇంటర్మీడియట్ రిజల్స్ట్ అయినా.. తాజాగా రిలీజ్ అయిన టెన్త్ ఫలితాల్లో అయినా బాలికలే సత్తా చాటారు. ఇక మొత్తం మీద 95 శాతానికి పైగా విద్యార్థులు పాస్ అయ్యారు. తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు.. తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు బుధవారం మధ్యా్హ్నం విడుదల చేశారు.

ఇక రాష్ట్రంలోని తెలుగు మీడియం స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం 89.14 శాతంగా ఉండగా.. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో 95 శాతం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న 86.18 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో 4,97,312 మంది విద్యార్థులు పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థుల పాస్ పర్సెంటేజీ 95.15 శాతంగా ఉందని తెలిపారు. ఇందులో 96.26 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. 94.07 శాతం మంది బాలురు పాసైనట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఉన్న 5731 పాఠశాలల్లో వందకు వంద శాతం విద్యార్థులు పాస్ అయినట్లు వివరించారు. ఇక 6 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని.. అవన్నీ ప్రైవేటు స్కూల్స్‌ అని వెల్లడించారు.

ఇక జిల్లాల పరంగా చూసుకుంటే.. 99.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక 89.23 శాతం ఉత్తీర్ణత శాతంతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://bse.telangana.gov.in/ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. 8096958096 వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేసినా రిజల్ట్స్ నేరుగా వస్తాయని తెలిపింది. విద్యాశాఖ తొలిసారిగా పదవ తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది. ఇక గతేడాది 2025 విద్యా సంవత్సరంలో ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 92.78 శాతం కాగా.. గతం కంటే ఇప్పుడు కొంత పెరిగింది. అబ్బాయిలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది పోలిస్తే పెరిగిందని తెలిపారు.

ఈ క్రమంలోనే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఒక్కో సబ్జెక్టు రీ కౌంటింగ్‌ కోసం రూ.500 ఫీజును నిర్ణయించగా.. రీ వెరిఫికేషన్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.1000 అని తెలిపారు. ఇక టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈనెల 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *