రాశిఫలాలు 31 జూలై 2026: ఈరోజు సౌభాగ్య యోగం వేళ మిథునం సహా ఏ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం?

 రాశిఫలాలు 31 జూలై 2026: ఈరోజు సౌభాగ్య యోగం వేళ మిథునం సహా ఏ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం?
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

​మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సౌభాగ్య యోగం ప్రభావంతో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశాలున్నాయి. ముఖ్యమైన పనులు మొదటిభాగంలోనే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

సాయంత్రం వేళ అనుకోని ప్రణాళికల వల్ల మీ పనుల్లో ఆలస్యం కావొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

పరిహారం : ఈరోజు గ్రహణ యోగం, శని దోషం నుంచి ఉపశమనం పొందడానికి తేనే కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఏ పనినీ వాయిదా వేయకూడదు. వీలైనంత త్వరగా ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.

మీ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా ఊహించని ఫలితాలొచ్చే అవకాశం ఉంది. నెల చివరి రోజున మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ తల్లి నుంచి ప్రేమ, మద్దతు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రీ సూక్తం పఠించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారులకు ఊహించినట్టు కాకుండా ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. కాబట్టి చాలా ఓపికగా ఉండాలి. మీ స్నేహితులు కూడా శత్రువులుగా మారొచ్చు. మీ మాటలపై నియంత్రణ ఉండేలా చూసుకోవాలి.

ఏ పనినీ అజాగ్రత్తగా చేయకూడదు. లేదంటే మీరు చింతించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తీసుకోకూడదు. విద్యార్థులు ఉన్నత విద్యలో సీటు కావాలంటే మరింత కష్టపడాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేయడం మంచిది.

వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వినాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవి మంత్రాలను పఠించాలి.

 

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందే అవకాశం ఉంది.

మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అవసరం లేకుండా ఎలాంటి పనినీ చేయకండి. మీ అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించాలి. మీ కష్టానికి తగి ఫలితం రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. మీ పిల్లలతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు.

మీ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి అనేక రంగాల్లో మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

పరిహారం : ఈరోజు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తూ, శివలింగానికి జలాభిషేకం చేసి, 108 బియ్యం గింజలను సమర్పించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా గమనించాలి.

కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావడంతో కొంత నిరాశ చెందొచ్చు. మీ స్నేహితులతో విభేదాలు పెరగొచ్చు. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు పరిశీలించాలి. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఎదురుకావొచ్చు.

పరిహారం : ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రావొచ్చు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు మొదటి భాగంలో పూర్తి చేయడం మంచిది. మహాలక్ష్మీ ఆశీస్సులు లభించనున్నాయి.

ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సాయంత్రం వేళ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ లేదా వినోదభరితమైన సమయాన్ని గడపొచ్చు. మీరు చేసే ప్రయాణం వల్ల సానుకూల ఫలితాలు రావొచ్చు.

పరిహారం :ఈరోజు అవసరంలో ఉన్న పిల్లలకు పెన్నులు, నోట్‌బుక్‌లు దానం చేయాలి

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు జూలై నెల చివరిరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు రెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది.

మీ తెలివితేటలతో ప్రతికూల పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలచుకోగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

పరిహారం :ఈరోజు శ్రీ లక్ష్మీ చాలీసా పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు తాము చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించొచ్చు.

మరోవైపు మీ జీవితంలో కొత్త శత్రువు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటతీరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం :ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించొచ్చు.

 

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి ఫలితాలు రావొచ్చు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు పని నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

స్నేహితులతో కలిసి యాత్రకు ప్లాన్ చేస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు పాత అప్పుల నుంచి ఉపశమనం లభించొచ్చు.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *