Podarillu Today జూన్ 03 ఎపిసోడ్ : ఇదయ్యా.. మీ అసలు రూపం.. పిడికిలి బిగించిన పెద్ది.. చక్రిని కాపాడిన అన్నదమ్ములు

 Podarillu Today జూన్ 03 ఎపిసోడ్ : ఇదయ్యా.. మీ అసలు రూపం.. పిడికిలి బిగించిన పెద్ది.. చక్రిని కాపాడిన అన్నదమ్ములు

Podarillu Today జూన్ 03 ఎపిసోడ్ : ఇదయ్యా.. మీ అసలు రూపం.. పిడికిలి బిగించిన పెద్ది.. చక్రిని కాపాడిన అన్నదమ్ములు

Podarillu Serial 2026 June 3rd Episode Preview పొదరిల్లు సీరియల్‌లో బుధవారం నాడు ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఇన్నాళ్లు ఎంతో ప్రశాంతంగా, శాంతిమూర్తిలా ఉన్న పెద్దిలోని అసలు రూపం బయటకు వచ్చింది. తమ్ముడికి ప్రమాదం అని తెలియడం, రౌడీలు కంట పడితో తన ఉక్కు పిడికిలిని బిగించాడు పెద్ది. రౌడీ మూకను పెద్ది, కేశవ, చక్రి, కన్నా కలిసి తరిమి కొట్టేశారు. నలుగురు అన్నదమ్ముల పవర్ ఏంటో రౌడీలకు రుచి చూపించారు.

పొదరిల్లు టుడే ఎపిసోడ్
పొదరిల్లు టుడే ఎపిసోడ్
కిడ్నాపర్ల దగ్గరకు ఆది, ప్రతాప్ వెళ్తారు. బ్యాగ్ తీసుకున్న తరువాత నేను ఒక సారి లోపలకు వెళ్లి వస్తాను అని ఆది అంటాడు. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని మంకీ క్యాప్ వేసుకుని ఆది లోపలకు వెళ్తాడు. మరోవైపు పెద్ది, నారాయణ ఇలా అందరూ చక్రి కోసం ఆలోచిస్తుంటారు. ఇదంతా వాళ్ల పనే.. ఇంటికి వెళ్లి అడుగుదాం.. అని ఆయుధాలు తీయరా కేశవ అని నారాయణ అంటాడు. వాళ్లు చేశారో లేదో కూడా తెలీదు.. ఒక వేళ చేయకపోయి ఉంటే.. మనం ఇలా గొడవ చేస్తే మహా ఫీల్ అవుతుంది కదా అని పెద్ది అంటాడు. ముందుగా వాళ్ల ఇంటికి వెళ్లి మామూలుగా అడుగుదాం.. అని పెద్ది అంటాడు. సరే పదా అని నారాయణ అంటాడు. నువ్వొద్దు నాన్న.. ఇక్కడే ఉండు.. మేం ముగ్గురం వెళ్తాం అని పెద్ది అంటాడు. నువ్వు ఎవర్రా.. మంకీ మ్యాక్.. ఈ గ్యాంగులో కొత్తగా చేరావా? ఈ చూపులు ఎక్కడో చూసినట్టుందే.. ఏరా పాపిష్టి బామ్మర్ధి.. కోతిలా బలే ఉన్నావ్ రా.. ఇదంతా నీ ప్లానేనా? ఇప్పుడు కన్ఫామ్ అయింది రా.. అని ఇలా ఆదిని రెచ్చగొడుతుంటాడు చక్రి.

పిచ్చ కొట్టుడు కొట్టిన ఆది..

పిచ్చ కొట్టుడు కొట్టిన ఆది..

పిచ్చ కొట్టుడు కొట్టిన ఆది..
చెవులు దొబ్బాయా? క్యాప్ తీయ్ రా అని చక్రి అంటాడు. ఇక ఆది గాడు తన కోపాన్ని తీర్చుకునేలా దబాదబా వాయించేస్తాడు. చక్రిని పిచ్చి కొట్టుడు కొట్టేస్తాడు. నీకు దమ్ముంటే కట్లు తీసి కొట్టరా.. అని చక్రి అంటాడు. దీంతో మొహం ఎక్కడ బయట పడుతుందో అని వెంటనే ఆది వెళ్లిపోతాడు. వాడికి డౌట్ వచ్చింది నాన్నా అని ప్రతాప్‌తో ఆది అంటాడు. డౌటే కదా.. నిన్ను అయితే చూడలేదు కదా.. మంకీ క్యాప్ తీయలేదు కదా? అని ప్రతాప్ అంటాడు. ఆ.. నాన్న అని ఆది అంటాడు. వాడ్ని జాగ్రత్తగా చూసుకోండి అని రౌడీలకు చెప్పి వెళ్తారు ప్రతాప్, ఆది.

విసిగించిన శైలు..
విసిగించిన శైలు..

విసిగించిన శైలు..
సారీ చెబుదామని ఫోన్ చేస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నా ఫోన్ కట్ చేస్తావా? లిఫ్ట్ చేసి తిట్టేసి పెడతావా? ఏరా ముంగీసా నీకు అంత పొగరా? ఇప్పుడు మా అమ్మ నంబర్ నుంచి చేస్తాను ఆగు అని శైలు కాల్ చేస్తుంది. ఎన్ని సార్లు లిఫ్ట్ చేయకపోతే అన్ని సార్లు కాల్ చేస్తాను శైలు అంటాడు. కన్నా గాడే ఫోన్ వస్తుంది అన్నయ్య అని అంటాడు. ఆ బుస్సు చేస్తుందేమో రా అని కేశవ అంటే.. చక్రి కూడా అయి ఉండొచ్చు కదరా అని పెద్ది అంటాడు. అవును నిజమే అన్నయ్య.. అని బండి ఆపి చెక్ చేస్తాడు.

తిట్టి పెట్టేసిన కేశవ..

తిట్టి పెట్టేసిన కేశవ..
ఇదేదో కొత్త నంబర్ అన్నయ్య అని కేశవ అంటాడు. కచ్చితంగా అది చక్రిదే అని పెద్ది అంటాడు. దీంతో కేశవ తిరిగి ఫోన్ చేస్తే శైలు లిఫ్ట్ చేస్తుంది. అవతల మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసుకోవా.. ఇంకోసారి ఫోన్ చేస్తే చస్తావ్ అని పిచ్చిపిచ్చిగా తిట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు కేశవ. ఇంకో వైపు మహా అయితే ఇంట్లో కంగారు పడుతూ ఉంటుంది. చక్రికి ఏమై ఉంటుందా? అని మహా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైనా తినండి అత్తయ్య అని హారిక అంటే.. నా కూతురు భవిష్యత్తే సర్వ నాశనం అయింది నేనేమీ తినను లలిత అంటుంది.

ప్రమాదం జరిగి ఉండొచ్చు..

ప్రమాదం జరిగి ఉండొచ్చు..
ఇంతలో ప్రతాప్, ఆది వస్తారు. ఏవండీ డబ్బు దొరికిందా?, బంగారం దొరికిందా అని లలిత అడుగుతుంది. నీ డబ్బు, బంగారం తరువాత.. చక్రి ఏమయ్యాడు అని మహా అడుగుతుంది. మాయమయ్యాడు.. పరారయ్యాడు.. ఆది చెప్పిందే నిజమైంది.. డబ్బు, బంగారంతో ఉడాయించాడు.. అని ప్రతాప్ అంటాడు. రుజువేంటి అని మహా అడుగుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, కారు రూట్ మార్చి, ఎవరికేం చెప్పలేదు అంటే అర్థం ఏంటి? అని ఆది అంటాడు. పారిపోయాడనే కాదు.. ప్రమాదం జరిగి ఉండొచ్చు.. ఇంకా ఏమైనా జరిగి ఉండొచ్చు అని మహా అంటుంది.

లీగల్‌గా విడాకులు ఇప్పిస్తా..

లీగల్‌గా విడాకులు ఇప్పిస్తా..
చాల్లే ఊరుకోవే..వాడ్నెవడినో పెళ్లి చేసుకుని వెళ్లావ్.. నమ్మి ఇంటికి తీసుకు వస్తే.. చేతిలో డబ్బు పెడితే.. మోసం చేసి పోయాడు.. ఇంకా వాడ్నే నమ్ముతావా.. అని లలిత అంటుంది. డబ్బు కోసం చక్రిని ఎవరైనా ఏమైనా చేసి ఉండొచ్చు కదా అని హారిక అంటే.. మీరు ఇంట్లో కూర్చుని దొంగని దేవుడ్ని చేయకండి అని ఆది అంటాడు. అలాంటి వాడితో నువ్వు ఎలా ఉంటావ్.. డబ్బు పోతే తిరిగి సంపాదించుకుంటా.. నీకు ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా.. లీగల్‌గా విడాకులు ఇప్పిస్తా.. మళ్లీ సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తా అని ప్రతాప్ అంటాడు.

నా చేతుల మీదుగా పెళ్లి..

నా చేతుల మీదుగా పెళ్లి..
ఇంత జరిగినా భూషణ్ దీని కోసమే ఇండియాలో ఉన్నాడు.. అని ఆది అంటాడు. దీంతో హారిక, మహా ఇద్దరూ షాక్ అవుతారు. ప్రతాప్‌కి డౌట్ వచ్చి.. రేయ్ ఆగరా.. ముందు ఆ దొంగ సంగతి తేలాలి.. తరువాత మిగతా విషయాలు ఆలోచించాలి.. ఆ దేవుడు ఉన్నాడు.. మళ్లీ నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా ఘనంగా జరిపించే అవకాశం ఇచ్చాడు అని ప్రతాప్ అంటాడు. వారి మాటల ఆంతర్యం అర్థం చేసుకున్న మహా వారితో మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. మరో వైపు చక్రి ఫోటో పట్టుకుని రోడ్లపై అడుక్కుంటూ ఉంటారు పెద్ది, కేశవ, కన్నా.

అలిసిన అన్నదమ్ములు

అలిసిన అన్నదమ్ములు
చక్రి కోసం వెతికి వెతికి ముగ్గురూ అలిసిపోతారు. మరో వైపు చక్రి కూడా బయట పడేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ లంకినిలా ఆ లేడీ రౌడీ కాపలా ఉందని చక్రి అనుకుంటాడు. నలుగుర్ని ఒకేసారి తన్నగలిగే వాడు ఇంకా ఎందుకు మనకు సమాచారం ఇవ్వడం లేదు.. అని పెద్ది అనుకుంటాడు. మనం అసలు చక్రి అన్నయ్యని బాగా చూసుకోనే లేదు అని కన్నా ఎమోషనల్ అవుతాడు. రేయ్ ఏ ఇంట్లో అయినా ఇంతే.. ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడే ప్రేమ బయటకు వస్తుంది రా అని పెద్ది అంటాడు. వాళ్ల ఇంటికి వాళ్లని పీకితే నిజం బయట పడుతుందని కేశవ అంటాడు.

ఆడ రౌడీతో పులిహోర..

ఆడ రౌడీతో పులిహోర..
చక్రి ప్రయాణించిన రూట్‌ని మహా ద్వారా కన్నా తెలుసుకుంటాడు. దీన్ని ఏదో విధంగా ఫ్లర్ట్ చేద్దాం.. పడితే పని ఈజీ అవుతుందని చక్రి అనుకుంటాడు. సుజుకా అని ప్రేమగా పిలుస్తాడు. ఎవర్రా సుజుకా.. నా పేరు లావణ్య అని అంటుంది ఆ లేడీ రౌడీ. నువ్వు మహా అద్భుతంగా ఉన్నావ్.. ఇంత అందాన్ని పెట్టుకుని.. అందాల పోటీలోకి వెళ్లకుండా.. ఈ గ్యాంగ్ ఏంటి.. అని చక్రి తన పులిహోర పనుల్ని స్టార్ట్ చేస్తాడు. అద్దం ముందుకు వెళ్లి మిమ్మల్ని మీరే చూసుకోండి.. నమ్మలేరు అని పంపించేస్తాడు చక్రి. లావణ్య ఫోన్ అక్కడే పెట్టి వెళ్తుంది. దీంతో కేశవకి ఫోన్ చేయాలని చక్రి అనుకుంటాడు.

విషయం చేరవేసిన చక్రి..

విషయం చేరవేసిన చక్రి..
మరో వైపు కేశవ, కన్నా, పెద్ది అందరూ కూడా చక్రి కోసం రోడ్ల మీద అడుగుతూ వెళ్తుంటారు. ఇక ఎలాగోలా కష్టపడి కేశవకి కాల్ చేస్తాడు చక్రి. కానీ రీచ్ అవ్వదు.. పెద్దికి చేద్దామని అనుకుంటాడు చక్రి. పెద్దికి ఫోన్ చేసి మాట్లాడతాడు చక్రి. అసలు విషయం చెబుతాడు.. కట్టేసి పెట్టారు.. కాలితో ట్రై చేసి ఫోన్ చేశా.. ఇదేదో గోడౌన్‌లా ఉంది.. త్వరగా రండి అని చెబుతాడు. ఇంతలో రౌడీలు వస్తే.. ఫోన్‌ని వెనక్కి తన్నేస్తాడు. ఏంట్రా ఏదో వెనక్కి తన్నావ్.. అని రౌడీలు అడుగుతుంటారు. అంతా వెతికితే ఫోన్ కనిపిస్తుంది. లావణ్య ఫోన్ అక్కడికి ఎలా వెళ్లిందని రౌడీలకు అనుమానం వస్తుంది.

రౌడీలకు అనుమానం..

రౌడీలకు అనుమానం..
ఆ రౌడీలకు అనుమానం వచ్చి లావణ్యను తిట్టి పంపిస్తారు. ఇక ఆ రౌడీలకు అసలు విషయం తెలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రతాప్‌కి, ఆదికి చెబుతాడు ఆ రౌడీ గాడు. ముందు ఫాం హౌజ్‌కి షిఫ్ట్ చేసేయండని ఆది చెబుతాడు. ఆ స్పీడులో వెళ్లిన కారు.. కేశవ బైకుని గుద్దేస్తుంది. దీంతో ఆ కారు వాడితో కేశవ గొడవ పెట్టుకుంటాడు. సారీ చెప్పాడు కదా వదిలేయ్.. మనం వేరే పని మీద ఉన్నాం.. అది చూసుకుందాం పదా అని పెద్ది అంటాడు. సరిగ్గా కారు వదిలి వెళ్లే టైంకి అందులో చక్రి ఉన్నాడని కన్నా చూస్తాడు. దీంతో ఆ కారుని కేశవ ఫాలో అవుతాడు.

పెద్ది విశ్వ రూపం..

పెద్ది విశ్వ రూపం..
కారుతో గుద్దావ్.. మానవత్వంలో వదిలేశా.. అదే కారులో నా తమ్ముడు ఉంటే ఎలా వదిలేస్తారా అని ఎగిరి తంతాడు పెద్ది. ఇక పెద్దిలోని ఆ ఆవేశాన్ని చూసి కేశవ, కన్నా ఆశ్చర్యపోతారు. ఏంట్రా కొత్తగా చూస్తున్నారు అని పెద్ది అంటే.. కొత్తగా కనిపిస్తున్నావ్ అన్నయ్య అని అంటారు. కొట్లాకు వచ్చినప్పుడు కొత్తా పాతా ఏంట్రా.. కుమ్మేసేయండి అని పెద్ది అంటాడు. దీంతో కన్నా గాడు చక్రి కట్లు విప్పేస్తాడు. నలుగురు అన్నదమ్ముళ్లు కలిసి అందరినీ కుమ్మేస్తారు. ఇక నేరుగా మహా ఇంటికి వెళ్తాడు చక్రి. దీంతో లలిత, ఆది, ప్రతాప్ కంగారు పడిపోతారు. మీరు క్షేమంగానే ఉన్నారా? మీకేమైందో అని కంగారు పడుతున్నా అని మహా అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *