Gundeninda Gudigantalu Today జూన్ 04 ఎపిసోడ్: మనోజ్ చెంపలు వాయించిన కానిస్టేబుల్స్.. ప్రశ్నించు కానీ దౌర్జన్యం చేయకు.. బాలుకి ఎస్సై వార్నింగ్

 Gundeninda Gudigantalu Today జూన్ 04 ఎపిసోడ్: మనోజ్ చెంపలు వాయించిన కానిస్టేబుల్స్.. ప్రశ్నించు కానీ దౌర్జన్యం చేయకు.. బాలుకి ఎస్సై వార్నింగ్

Gundeninda Gudigantalu Today జూన్ 04 ఎపిసోడ్: మనోజ్ చెంపలు వాయించిన కానిస్టేబుల్స్.. ప్రశ్నించు కానీ దౌర్జన్యం చేయకు.. బాలుకి ఎస్సై వార్నింగ్

Gundeninda Gudigantalu Serial 2026 June 4th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కక్ష కట్టి బాలు మీద కేసు పెడతాడు. దీంతో బాలుని పోలీస్ స్టేషన్‌కి తీసుకు వస్తారు. అక్కడి తన పని మీద వచ్చిన మనోజ్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తాడు. కానిస్టేబుల్ చెవిలో ఏదో అంటాడు మనోజ్. దీంతో మనోజ్ చెంపల్ని కానిస్టేబుల్స్ వరుస పెట్టి వాయించేస్తుంటారు. అలా నేటి ఎసిసోడ్ మనోజ్ మూలాన ఫన్నీగా సాగింది.

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
తండ్రి ఫోటోను తీసుకు వచ్చి రోహిణి నాటకం ఆడుతుంది. ఆ ఫోటో ఫ్రేమ్‌ని చూసి మనోజ్ ఎమోషనల్ అవుతాడు. ఆస్తి వస్తుందని అనుకుంటే.. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చిందని ప్రభావతి బాధపడుతుంది. ఇక మనోజ్ ఆ ఫోటోకి దండ వేసి దండం పెడతాడు. ఇంతలో బాలు, మీనా వస్తారు. ఎవరు ఇతను అని అంటాడు. రోహిణి నాన్న అని మనోజ్ అంటాడు. ఒకసారి వచ్చి చూడు మీనా.. అని బాలు అంటాడు. ఈ మొహం మలేషియా మొహం లా లేదే.. కోట్లు సంపాదించిన వ్యక్తిలా లేదే అని బాలు అంటాడు. నేను దు:ఖంలో ఉంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నట్టుగా రోహిణి మాట్లాడుతుంది. ముందు పూలు పెట్టు అని మనోజ్ అంటాడు. ఎవరి చెవిలో అని బాలు అంటే.. మా మామ గారి ఫోటోకి అని మనోజ్ అంటాడు. ఇక రోహిణి, మనోజ్ బయటకు వెళ్తారు. ఆ తరువాత కానిస్టేబుల్స్ ఇంటికి వస్తారు. బాలు మీద కేసు ఫైల్ అయిందని చెప్పడంతో మీనా, సత్యం షాక్ అవుతారు. మా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకున్నావ్ కదా అని కానిస్టేబుల్స్ అనడంతో అసలు విషయం బాలు, మీనాలకు అర్థం అవుతుంది.

ఇంటికి పోలీసులు..

ఇంటికి పోలీసులు..

ఇంటికి పోలీసులు..
జరిగిన విషయం అంతా కూడా సత్యంకి బాలు, మీనాలు చెబుతారు. కానిస్టేబుల్స్‌ని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా మాకు తెలీదండి.. డ్యూటీకి అడ్డుపడ్డ బాలుని తీసుకు వెళ్తాం.. ఏమైనా ఉంటే స్టేషన్‌కి వచ్చి మాట్లాడుకోండని కానిస్టేబుల్స్ అంటారు. ఇక బాలు వెంటే మీనా కూడా వెళ్తాను అని అంటుంది. నువ్వు వెళ్తే ఇక్కడ వంట ఎవరు చేస్తారు అని ప్రభావతి అడుగుతుంది. అసలు మీరే అమ్మేనా? కన్నతల్లేనా? అన్నమే తింటున్నారా? ఒక పక్క కొడుకుని పోలీసులు పట్టుకు వెళ్తుంటే మీకు వంట కావాల్సి వచ్చింది.. ఇక నుంచి నేను వంటే చేయను.. అని మీనా అంటుంది.

అన్నం ఎలా సహిస్తుంది..
అన్నం ఎలా సహిస్తుంది..

అన్నం ఎలా సహిస్తుంది..
ఒక రోజు ఒక పూట అన్నం తినకపోతే ఏమైనా అవుతుందా? అని మీనా చీదరించుకుంటుంది. బాలు మాత్రం వద్దు లే నేను వెళ్లి వస్తాను.. నువ్వు ఇంట్లోనే ఉండు అని మీనాకి చెబుతాడు. ఇక మీనా అన్న మాటలకు సత్యం, రవి, శ్రుతి కూడా వంత పాడుతారు. మీనా అన్నదాంట్లో తప్పేం ఉంది.. ఇన్ని రోజులు నీకు అన్నం పెట్టింది.. ఇప్పుడు గడ్డి పెట్టింది అని సత్యం కౌంటర్లు వేస్తాడు. అసలు అమ్మ నీకు అన్నం ఎలా సహిస్తుంది.. అని రవి అంటాడు. ఏమీ అనకండి.. అసలే ఆస్తి పోయిందనే దు:ఖంలో మీ అమ్మ గారు ఉన్నారు అని శ్రుతి కౌంటర్లు వేస్తుంది.

మనోజ్ ఓవర్ యాక్షన్..

మనోజ్ ఓవర్ యాక్షన్..
ఇక బాలుని పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడతాడు. ఇంతలో ఆ ట్రాఫిక్ పోలీసోడు వచ్చి కౌంటర్లు వేస్తాడు. నేను నిజాయితీగా ఉన్నంత వరకు ఎవ్వరికీ భయపడను అని బాలు అంటాడు. ఆ తరువాత ఆ ట్రాఫిక్ పోలీస్ వెళ్లిపోతాడు. బాలు కోసం మీనా అక్కడికి వెళ్తుంది. ఆపై మనోజ్, రోహిణి తమ కేసుకి సంబంధించిన అప్డేట్ అడిగేందుకు వస్తారు. అక్కడ బాలు, మీనాలను రోహిణి, మనోజ్ కౌంటర్లు వేస్తాడు. వీడికి ఇలానే కావాలి.. ఓ వారం రోజులు ఇందులోనే పెట్టేయండని కానిస్టేబుల్‌కి చెబుతాడు మనోజ్. అంటే నువ్వు చెబితే మేం చేయాలా? అన్నట్టుగా వాళ్లు చూస్తారు.

బాలు, మీనా కౌంటర్లు..

బాలు, మీనా కౌంటర్లు..
బాలుకి ఇలా స్టేషన్‌కి రావడం కొత్తేమీ కాదుగా అన్నట్టు రోహిణి కౌంటర్లు వేస్తుంది. మేం ఏమీ ఫ్రాడ్ చేసి మీలా స్టేషన్‌కి రాలేదు.. ఒకరిని మోసం చేయలేదు.. మోసపోలేదు.. మేం నిజాయితీగానే ఉన్నాం అని బాలు, మీనాలు కౌంటర్లు వేస్తాడు. ఇతను మీ అన్నయ్య అని కానిస్టేబుల్స్ అడిగితే.. అవును అని చెబుతూ లక్షలు మింగిన సంగతి, పార్కులో ఖాళీగా పడుకున్న సంగతి.. గుడి ముందు అని చెప్పబోతోంటే మనోజ్, రోహిణిలు అడ్డుకుంటారు. వీళ్లతో మనకు ఎందుకు మన పని మనం చూసుకుందాం అని రోహిణి అంటుంది. వీళ్లకి నా స్టేటస్ ఏంటో చూపిస్తా అని రోహిణి వద్దన్నా మనోజ్ ఓవర్ చేస్తాడు.

చెంపలు వాయించిన కానిస్టేబుల్స్..

చెంపలు వాయించిన కానిస్టేబుల్స్..
మనోజ్ వెళ్లి కానిస్టేబుల్ చెవిలో ఏదో చెప్తాడు. దీంతో వెంటనే మనోజ్ చెంప వాయించేస్తాడు అతడు. అలా కానిస్టేబుల్స్ అంతా చెవిలో ఆ విషయం చెప్పి, తెలుసుకుని మనోజ్ చెంపని వాయించేస్తుంటారు. అసలు ఎందుకు మా ఆయన్ని కొడుతున్నారు అని రోహిణి అడుగుతుంది.. చెప్తే నువ్వు కూడా కొడతావ్ అని అంటారు. నాకు చెప్పండి అని బాలు అంటే.. నువ్వు అయితే ఏకంగా చంపేస్తావ్ అని అంటారు వారంతా. ఇక్కడే ఉంటే బొక్కలో వేస్తామని వారు బెదిరిస్తే బయటకు వెళ్లిపోతారు మనోజ్, రోహిణి. కానిస్టేబుల్స్‌కి ఏం చెప్పావ్ అని మనోజ్‌ని అడిగితే.. రోహిణి చెవిలో ఏదో కూస్తాడు. ఆ మాటలు విని మనోజ్‌ని రోహిణి కూడా కొడుతుంది.

దౌర్జన్యం చేయకు..

దౌర్జన్యం చేయకు..
ఆ తరువాత ఎస్సై వస్తాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కాలర్ పట్టుకోవడం తప్పు కదా.. కేసు బుక్ చేయండని అంటాడు. అంటే ఆ వ్యక్తి.. ఓ ముసలావిడను కొట్టాచా? తోసేయచ్చా? ఆమెను ప్రస్తుతం మేం హాస్పిటల్లో జాయిన్ చేశామని ఇలా జరిగిందంతా చెబుతాడు. దీంతో ఆ ఎస్సై కేసు పెట్టిన ట్రాఫిక్ పోలీస్‌నే తిడతాడు. తప్పు మా వైపు కూడా ఉంది.. ఇలా చేస్తే పౌరులు నిలదీసే హక్కు ఉంటుంది.. ప్రశ్నించు కానీ దౌర్జన్యం చేయకు.. ఇంకోసారి ఇది రిపీట్ కావొద్దు.. క్షమాపణ లెటర్ రాసి వెళ్లు అని బాలుకి ఎస్సై వార్నింగ్ ఇస్తాడు.

ఎవ్వరికీ భయపడను..

ఎవ్వరికీ భయపడను..
ఇక బయటకు వచ్చిన తరువాత బాలుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు ఆ ట్రాఫిక్ పోలీస్. నువ్వు ఏం చేసినా నేను బయపడను.. నిజాయితీగా ఉన్నంత వరకు నేను ఎవ్వరికీ భయపడను అని బాలు అంటాడు. ఇప్పుడు తప్పించుకున్నావ్.. నీ పని పట్టడమే నా పని అంటూ బెదిరిస్తాడు. నీ బెదిరింపులకు నేను భయపడను.. ఏం చేస్తావో చేసుకో అని బాలు అంటాడు. ఇక ఇంతలో ఆ ఎస్సై మళ్లీ ఆ ట్రాఫిక్ పోలీస్‌ను లోపలకు పిలుస్తాడు. ఎందుకయ్యా మీకు అతనితో గొడవ అని బాలుతో కానిస్టేబుల్ అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. మరి మున్ముందు ఇతడి వల్ల బాలుకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *