Podarillu Today జూన్ 04 ఎపిసోడ్ : స్త్రీ తనమే లేని నీలో అమ్మతనం ఉంటుందా?.. తల్లిదండ్రుల్ని కడిగిపారేసిన మహా.. ప్రతాప్‌కి పెద్ది మాస్ వార్నింగ్
Podarillu Today జూన్ 04 ఎపిసోడ్ : స్త్రీ తనమే లేని నీలో అమ్మతనం ఉంటుందా?.. తల్లిదండ్రుల్ని కడిగిపారేసిన మహా.. ప్రతాప్‌కి పెద్ది మాస్ వార్నింగ్
Podarillu Serial 2026 June 4th Episode Preview పొదరిల్లు సీరియల్‌లో గురువారం నాడు పెద్ది ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. మహా కూడా తన ఇంటిని కాదని వెళ్తుంది. జీవితంలో ఇక అమ్మా అని పిలవను అని మహా అంటుంది. ఇల్లు కట్టడమే కాదు.. సమాధి కూడా కట్టడం వచ్చు అని పెద్ది మాస్ వార్నింగ్ ఇస్తాడు. పెద్దన్నయ్యలో ఇంత కోపం నేను ఎప్పుడూ చూడలేదు అని కన్నా అంటాడు. ఇక అన్నదమ్ములు అంతా ఒకరికోసం ఒకరు నిలబడటం చూసి మహా కన్నీరు పెట్టుకుంటుంది. ఇదంతా నా వల్లే జరిగిందని మహా బాధపడుతూ ఉంటుంది.

పొదరిల్లు టుడే ఎపిసోడ్
చక్రి ఇంటికి రావడంతో మహా లక్ష్మీ సంతోషిస్తుంది. చక్రి గారు.. ఏమైందండి.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది.. ఎన్ని సార్లు ఫోన్ చేశాను.. మీరు క్షేమంగా వచ్చారు.. అది చాలు అని మహా ఇలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. డబ్బు, నగలు ఏవీ రా అని ఆది అంటాడు. డబ్బు, నగలు పోతే పోనీ.. అల్లుడు వచ్చాడు అది చాలు అని ప్రతాప్ అంటాడు. వీడే తీసి ఉంటాడు చేరవల్సిన చోటకు చేర్చలేదు కదా మరి అని లలిత అంటుంది. అసలు ఏమైందండి.. మీ గురించి ఇలా అందరూ తప్పుగానే మాట్లాడుతున్నారు.. ఏం జరిగిందో వీళ్లకు చెప్పండి అని మహా అంటుంది. దీంతో కిడ్నాప్ చేసిన గ్యాంగ్ గురించి అందరికీ చక్రి చెబుతాడు. ఈ కథలన్నీ పిచ్చిది ఉంది కదా మహాకి చెప్పు నమ్ముతుంది మేం కాదు అని చక్రి కాలర్ పట్టుకుంది. రేయ్ ఆగరా తొందరపడొద్దు అని ప్రతాప్ అంటాడు. ఒక్క మాట మాట్లాడినా బాగోదు అని మహా అంటుంది. మీరు ఇప్పుడే ఆవేశపడకండి.. ఇంకా టైం ఉంది అని చక్రి అంటాడు. మీకు ఆ డబ్బు, నగలు కావాలి.. ఏమయ్యాయో తెలియాలి కదా అని చక్రి బయటకు వెళ్లి వస్తాడు.
రౌడీని లాక్కొచ్చిన కేశవ..
రౌడీని లాక్కొచ్చిన కేశవ..
పెద్ది, కన్నా, చక్రి ఇలా అందరూ కలిసి వస్తారు. మీరంతా ఇక్కడకు వచ్చారేంటి అని మహా ఆశ్చర్యపోతోంది. అన్నయ్యని కనిపించకుండా చేస్తారేమో అని భయపడి వచ్చాం అని కన్నా అంటాడు. ఇదంతా సినిమాలో జరిగినట్టుగా ఉంది.. అసలేం జరుగుతోందని మహా కంగారు పడుతుంది. ఆ రౌడీలు ఎవరో తెలుసుకోవాలని ఉందా?.. చెప్పను.. చూపిస్తాను.. అని చక్రి అంటాడు. ఎవరో చెప్పు షూట్ చేస్తాను అని ప్రతాప్ అంటాడు. అయితే రెడీగా ఉండండి అని కేశవని పిలుస్తాడు చక్రి. ఆ రౌడీ గాడ్ని లాక్కొచ్చి కేశవ పడేస్తాడు.
లాగి పెట్టిన కొట్టిన కేశవ..
వీడ్నీ మీరే తీసుకొచ్చారు.. మీ వాడేనా? అన్నట్టుగా ఆది మాట్లాడతాడు. దీంతో కేశవకు కోపం వచ్చి ఆదిని లాగి పెట్టి కొడతాడు. మా ఆయన్ను కొట్టేంత ధైర్యం నీకు ఎక్కడిది అన్నట్టుగా హారిక ప్రశ్నిస్తుంది. మా కేశవ కారణం లేకుండా ఏ పనీ చేయడు అని మహా అంటుంది. ఆ రౌడీని నాకు అప్పగించండి వాడి పని చేను చెప్తాను అని ప్రతాప్ యాక్ట్ చేస్తాడు. ఆగండి సార్ అని పెద్ది మొదలు పెడతాడు. ఎందుకు చేశారు ఈ పని.. మీరు పెద్ద మనుషులేనా? ఒక్క పూటకే మేం అతిథిలా భావించాం.. నా తమ్ముడ్ని అప్పగిస్తే ఇలా బలి తీసుకుంటారా? అని పెద్ది నిలదీస్తాడు.
ఇదంతా నిజమా?
ఏంటి సార్ మిమ్మల్ని మీరు కాల్చుకుంటారా? అని చక్రి కౌంటర్లు వేస్తాడు. ఏంట్రా అంత మర్యాదగా అడుగుతావ్.. వీడొక పెద్ద మనిషి.. ఆడొక మనిషి అని ప్రతాప్, ఆదిలను తిడతాడు కేశవ. ఇంతలో లలితకు ఆగ్రహం వస్తుంది. ఎవర్రా మీరంతా.. మా ఇంటికి మా ఆయన్ను అంటారా.. బయటకు పోండి రా అని ఫైర్ అవుతుంది. ఇందులో మీ పాత్ర కూడా ఉందని నాకు తెలుసు.. ఇక మీ ఓవర్ యాక్షన్ కాస్త ఆపండి అని చక్రి కౌంటర్లు వేస్తాడు. ఇక ఇధంతా మహా నమ్మలేకపోతోంది. ఇదంతా నిజమా? నాన్నా, ఆది, అమ్మా అని మహా అమాయకంగా అడుగుతుంది.
ఎందుకు ఇలా చేశారు..
కన్నా గాడు జరిగిందంతా చెబుతాడు. మేం వెళ్లకపోయి ఉంటే అన్నయ్యని చంపేసేవారు అని చెబుతాడు. ఆ రౌడీగాడు చెప్పిన నిజాన్ని కూడా బయటపెడతాడు. నాన్నా.. ఇదంతా నిజమేనా?.. నువ్వు మా ఇంటికి వచ్చి.. మా అందరి మీద చూపించిన ప్రేమ నాటకమా? చక్రిని చంపేందుకు వచ్చావా? పూర్తిగా నమ్మించింది.. ఆ డబ్బు, నగలు ఇచ్చి పంపించింది అంతా ప్లాన్ ప్రకారమేనా? ఎందుకు.. ఎందుకు ఇలా చేశారు.. అని మహా అడుగుతుంది. ఎందుకంటే.. అవన్నీ నేను పట్టుకుని పారిపోయాను అని చెబితే మీరు నన్ను అసహ్యించుకుని.. ఇంకెప్పటికీ నా దగ్గరకు, మా ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోతారని అనుకున్నారు అని చక్రి చెబుతాడు.
ఛాలెంజ్ కోసం..
ఆ తరువాత పిలకోడికి ఇచ్చి పెళ్లి చేయాలని, ఆ తరువాత నన్ను చంపేసి శవాన్ని మాయం చేసి.. డబ్బు, నగలు తీసుకుని పరారీలో ఉన్నాడని నమ్మించడానికి అని చక్రి అంటాడు. రేయ్ అసలు నువ్వు బయటకు నడువురా అని ఆది ముందుకు వస్తాడు. మాట్లాడుతున్నా కదా.. అని ఆదిని తోసేస్తుంది మహా. ఇదంతా నాటకం అమ్మా అని ప్రతాప్ అంటే.. ఆపు నాన్నా.. ఎవరి గురించి ఏం చెప్తున్నావ్.. అని ప్రతాప్‌ని నిలదీస్తుంది మహా. అసలు సాక్ష్యం ఉందా? అని ఆది అంటే.. నాతోనే మీ నాన్న ఛాలెంజ్ చేశారు.. మీ సంతోషాన్ని పాడు చేయొద్దని మీకేమీ చెప్పలేదు అని అసలు విషయాన్ని చెప్తాడు చక్రి.
ప్రాణం తీస్తావా?..
మీరు నన్ను రెచ్చగొట్టేందుకు చేస్తున్నారు అని అనుకున్నా.. డౌట్ వచ్చి అప్పుడే రికార్డ్ చేశా.. అని ఆ ఛాలెంజింగ్‌కి సంబంధించిన రికార్డింగ్ వినిపిస్తాడు చక్రి. దీంతో మహాకి కోపం వస్తుంది. ఇదంతా నీ కోసమే చేశానమ్మా అని ప్రతాప్ అంటాడు. ఇంత క్రూరంగా ఎలా మారిపోయావ్ నాన్నా.. నా కోసం ఇంకో ప్రాణం తీస్తావా?.. ఇలాంటి మనిషి పెంపకంలో నేను పెరిగానా.. మీరు కోరుకున్నది జరిగేందుకు ఎంతకైనా దిగజారిపోతావా? అంటూ ప్రతాప్‌ని చీ కొడుతుంది మహా. ఆది మధ్యలోకి వస్తుంటే.. నువ్వు కూడా ఆయన రాక్షసత్వాన్ని పంచుకున్నావ్ కదా అని మహా అంటుంది.
నా మొహం చూసి వీళ్లు ఊరుకున్నారు..
నాన్న చేసిందే కరెక్ట్.. లేకపోతే వీడి బతుకెంతా.. వీడు నాన్నతో చాలెంజ్ చేస్తాడా? అందుకే శాశ్వతంగా లేపేయాలని అనుకున్నాం అని ఆది అంటాడు. రేయ్ చండాలుడా అని ఆదిని తోసేస్తుంది మహా. కత్తితో వీళ్ల నాన్నని పొడిచినప్పుడు జైలుకి పంపించి ఉంటే.. ఈ రోజు ఇలా ఉండేవాడివా.. నీ ఈ బతుకు వాళ్లు పెట్టిన భిక్షరా.. వదిన మొహం చూసి నేను ఊరుకున్నా.. నా మొహం చూసి వీళ్లు ఊరుకున్నారు.. వాళ్ల స్థాయి ఎక్కడ.. మీ స్థాయి ఎక్కడ.. వాళ్ల కాళ్ల గోటికి సరిపోరు మీరు అని మహా అంటుంది.
నన్ను తులసి మొక్కలా
మధ్యలో లలిత ఎంట్రీ ఇస్తే.. నువ్వు అస్సలు మాట్లడకు అమ్మా.. ఆడదానిలో అమ్మతనం ఉంటుందని వీళ్లు అనుకుంటారు.. నిన్ను చూస్తే వారికి ఆ నమ్మకం పోతుంది.. మొత్తం స్త్రీ జాతి మీదే వీళ్లకి అసహ్యం పుడుతుంది.. ఆ ఇంట్లో అమ్మ లేకపోయినా.. అమ్మతనం అడుగడుగునా ఉంది.. నీ కూతురిని మహా రాణిలా చూసుకున్నారు.. నన్ను తులసి మొక్కలా చూసుకున్నారు.. వాళ్ల నాన్న నా దగ్గర పసివాడిలా ఉంటాడు.. ఈ పసివాడికి (కన్నా)కి అమ్మని అయ్యాను.. వీళ్లంతా ఎక్కడా.. మీరు ఎక్కడ ఛీ అని మహా చీదరించుకుంటుంది.
మిసెస్ లలిత.. వైఫ్ ఆఫ్ క్రూరత్వం..
నేను నీ అమ్మని అని లలిత అంటే.. నువ్వు అలా చెప్పుకోకు అని మహా ఫైర్ అవుతుంది. నిన్ను అమ్మ అని పిలిచే ఆఖరి క్షణం ఇదే.. భర్త, కొడుకులు తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాల్సింది పోయి.. వాళ్లతో కలిసి పోతావా? అసలు స్త్రీ తనమే లేని నీలో అమ్మతనం ఉంటుందని ఎలా అనుకోవాలి.. అందుకే ఇకపై నిన్ను అమ్మా అని పిలవను.. మిసెస్ లలిత.. వైఫ్ ఆఫ్ క్రూరత్వం అని మహా అంటుంది. చక్రి నువ్వు పోలీసులకు ఫోన్ చెయ్.. చంపేందుకు ప్లాన్ చేశారని కంప్లైంట్ ఇవ్వండి.. నేను సాక్ష్యం చెబుతా.. వీళ్ల పొగరు, అహంకారాన్ని అణగదొక్కేద్దాం అని మహా అంటుంది.
మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది..
ఆగమ్మా ఆవేశ పడకు.. వీళ్ల స్వార్థం, అహంకారం అన్నీ ఉన్నాయి.. అందులో నీ మీద ప్రేమ కూడా తెలీకుండానే ఉంది.. నిన్ను వెనక్కి రప్పించుకోవడానికి మానవత్వం మరిచారు.. అని పెద్ది అంటాడు. అది కాదు పెద్ది అని మహా అంటుంది. నువ్వు చీ కొట్టావ్ కదా.. అంతకంటే పెద్ద శిక్ష ఏ న్యాయస్థానం కూడా వేయలేదు అని పెద్ది అంటాడు. చూశావా.. వాళ్ల వ్యక్తిత్వం.. వాళ్లని చూస్తే చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది.. మీ మాట వినకుంటే నన్ను కూడా చంపేస్తారా.. మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది.. మీరు ఇంకెప్పుడు మా ఇంటికి రావొద్దు.. మహాలక్ష్మీ నిలయం నుంచి మహాలక్ష్మీ శాశ్వతంగా బయటకు వెళ్లిపోతుంది.. మళ్లీ రాను అని మహాలక్ష్మీ బయటకు వెళ్తుంది.
ఐశ్వర్యం అంటే అదే..
కన్నా గాడే మహా లగేజ్, చక్రి తన లగేజ్ తీసుకుని బయటకు వస్తారు. మీ ఇంటి ఐశ్వర్యం మీ మహాలక్ష్మీ.. ఇప్పుడు నా దగ్గర ఉంది.. మీకంటే నేను ఐశ్వర్య వంతుడ్ని అని చక్రి అంటాడు. ఇక అందరూ కలిసి బయటకు వస్తారు. ఇంతలోనే పెద్ది మళ్లీ వెనక్కి వెళ్తాడు. మీతో ఓ మాట చెప్పి పోదామని వచ్చాను.. డబ్బు సంపాదించడం ఒక్కటే ఐశ్వర్యం అని అనుకుంటున్నారా?.. తండ్రికి కాళ్లు నొక్కే కూతురు ఉండటం అదృష్టం.. అమ్మకి జ్వరం వస్తే సేవలు చేసే కూతురు ఉండటం అదృష్టం అని పెద్ది చెబుతూ ఉంటాడు.
రామలక్ష్మణ భరత శత్రఘ్నుల్లా..
పండుగ వస్తే పట్టు పరికిణీ వేసుకుని కాళ్లకి గజ్జలు పెట్టుకుని ఇళ్లంతా సందడిగా తిరిగే కూతురు ఉండటం ఐశ్వర్యం.. అన్నకి రాఖీ కట్టడం ఐశ్వర్యం.. వదిన, ఆడపడుచుల్ని ఏడ్పించుకోవడం ఐశ్వర్యం.. అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం ఐశ్వర్యం.. డబ్బు సంపాదించం మాత్రమే ఐశ్వర్యం కాదు.. నేను చెప్పిందంతా ఐశ్వర్యం అనుకుంటే.. నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ ఉండరు.. రామలక్ష్మణ భరత శత్రఘ్నుల్లా ఒకే మాట మీద ఉంటాం.. నా కోసం మిగతా వాళ్లు ఏడుస్తారు.. చిన్న వాడు కనిపించకుండా పోతే.. మహాలక్ష్మీతో సహా తల్లడిల్లిపోయాం..
మా అమ్మని మా నుంచి..
మా బృందావనంలో అడుగడుగునా ఐశ్వర్యం తాండవం చేస్తుంది.. నేను వేరే మాట చెప్పడానికి వచ్చా.. మా అమ్మ చనిపోతే.. తమ్ముళ్లని పెంచాను.. చక్రి నా తమ్ముడే అయినా ఈ చేతుల్లో పెంచా.. వాడు నాకింకా పసివాడే.. ఇంకోసారి వాడి ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తే.. నేను ఒక మేస్త్రీని ఇల్లు కట్టడమే కాదు.. సమాధి కూడా కట్టడం వచ్చు.. ఇంకోసారి మా అమ్మని మా నుంచి వేరు చేయాలని చూడకండి అని మాస్ వార్నింగ్ ఇస్తాడు పెద్ది. ఈ సీన్ అంతా కన్నా గాడు చూసి తెగ సంబరపడిపోతాడు.
అన్నదమ్ములు కలిసి..
లోపల జరిగిందంతా కన్నా గాడు అందరికీ చెప్తాడు. పెద్దన్నయ్య వార్నింగ్ ఇచ్చాడు.. ఇంత సీరియస్‌గా ఉండటం ఎప్పుడూ చూడలేదు అని కన్నా అంటాడు. ఇంతలో పెద్ది వచ్చి చక్రిని పట్టుకుని ఎమోషనల్ అవుతాడు. మీరంతా నన్ను క్షమించాలి.. అని మహా అంటుంది. నేను మీ ఇంట్లో అడుగు పెట్టి ఉండకపోతే.. మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. మీకు ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అని మహా అంటుంది. ఈ పీడకలను మర్చిపోదాం లే అమ్మా అని మహాని ఓదార్చేస్తాడు పెద్ది. మనుషులు అయితే వాళ్లే మారతారు అని పెద్ది అంటాడు.
మీరు ఏం చెప్పినా చేస్తా..
ప్రతాప్ ఇంటి నుంచి వాళ్ల కారునే తీసుకుని మహా అండ్ టీం బయల్దేరుతుంది. కారులో అంతా సైలెంట్‌గా ఉంటారు. ఎందుకు అలా ఉన్నారని పెద్ది అడగడంతో తలా ఒక కారణం చెబుతారు. ఏడుస్తూ ఉన్న మహా.. మీకు అన్నీ ముందుగానే తెలుసు.. కానీ నాకు ఎందుకు చెప్పలేదు.. నేను బలవంతం చేస్తేనే ఇంటికి వచ్చారు.. నేను చెబితేనే డబ్బు తీసుకుని వెళ్లారు అని అంటుంది. మొదటి నుంచి కూడా మీరు చెప్పింది నేను చేస్తూనే వచ్చా.. మీ నాన్న రావడంతో మీ మొహంలో ఓ కొత్త వెలుగు, సంతోషం కనిపించింది.. దాన్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు.. అందుకే చెప్పలేదు అని చక్రి అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.