రాశిఫలాలు 01 జూన్ 2026: ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో సింహం, కుంభం సహా ఈ 5 రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు
horoscope today 01 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మిథున రాశిలో మూడు గ్రహాల కలయిక కారణంగా తులా, కుంభం సహా ఈ 5 రాశులకు ఊహించని లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Jun1st
horoscope today 01 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మిథున రాశిలో బుధుడు, గురుడు, శుక్రుడి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో పాటు శుభ యోగం కూడా ఏర్పడనుంది. ఇదే రోజున శివయ్యకు అంకితం చేయబడింది. గ్రహాల ఏర్పరిచే శుభ యోగాలతో పాటు తులా, కుంభం సహా కొన్ని రాశులకు శివయ్య అనుగ్రహం కూడా లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి సూర్యుడు రెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చంద్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు మతపరమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరగొచ్చు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు చంద్రుడు అష్టమ స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి అధిపతి అయిన బుధుడు ఈరోజు శుక్రుడితో కలిసి ఇదే రాశిలో కలయిక జరపనున్నాడు. మరోవైపు కేతువు ప్రభావంతో మీకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకం కలిగించొచ్చు. మీ ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈరోజు ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లన్నీ విజయవంతంగా పూర్తవ్వొచ్చు. గత కొన్నిరోజులుగా ఉన్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు ఆరో స్థానంలో సంచారం చేయడం కారణంగా కోర్టు సంబంధిత పనుల్లో మీకు విజయం లభించొచ్చు. మరోవైపు మిథున రాశిలో ఉన్న గురుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి అధిపతి అయిన సూర్యుడు ఈ రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు పంచమ స్థానంలో చంద్రుడు రవాణా చేస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా ఊహించని లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు కొన్ని శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరగొచ్చు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో వేగం పెంచడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మనోధైర్యం పెరుగుతుంది. మీ భార్య, పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవ్వొచ్చు. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడపొచ్చు. మీకు బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోవచ్చు. మీ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి అధిపతి అయిన శుక్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ప్రజాదరణ పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు రాత్రిపూట ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిని కలవడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవడంతో సంతోషిస్తారు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు తీరిక లేకుండా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఈ రాశి నుంచి శని దేవుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు విచక్షణతో వ్యవహరించాలి. మీకు దగ్గరి వారితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు కుజుడి ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి శని దేవుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు అనవసర ఖర్చులు పెరగొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే రాశిలో చంద్రుడు ప్రవేశించడంతో మీరు సాయంత్రం కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శని దేవుడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. రాహువు అనుగ్రహంతో భూమి, ఆస్తి విషయంలో ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి. దీంతో మీరు అనేక ప్రయోజనాలు పొందొచ్చు. మీ సమస్యలకు కొన్ని పరిష్కారాలు లభించొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి నుంచి శని దేవుడు రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు.ఈ కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలున్నాయి. కొత్త పరిచయాలు శాశ్వత స్నేహాలుగా మారిపోతాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి అధిపతిగా ఉండే గురువు ప్రస్తుతం కర్కాటక రాశిలో పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి చంద్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ శక్తి, సామర్థ్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.