Kondagattu | కొండగట్టు అంజ‌న్న హుండీలో డ‌మ్మీ నోట్ల క‌ట్ట‌లు

 Kondagattu | కొండగట్టు అంజ‌న్న హుండీలో డ‌మ్మీ నోట్ల క‌ట్ట‌లు

Kondagattu | కొండగట్టు అంజ‌న్న హుండీలో డ‌మ్మీ నోట్ల క‌ట్ట‌లు

Kondagattu | కొండగట్టు (Kondagattu) అంజ‌న్న‌ ఆలయ హుండీల్లో డ‌మ్మీ నోట్లు (Dummy Currency Notes) ల‌భించాయి. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.50 ల‌క్ష‌ల విలువైన నోట్ల‌ను అధికారులు గుర్తించారు. శ్రీ ఆంజ‌నేయ‌స్వామి (Kondagattu Anjanna Temple) ఆల‌యంలోని హుండీల‌ను లెక్కించారు.

Kondagattu | కొండగట్టు అంజ‌న్న హుండీలో డ‌మ్మీ నోట్ల క‌ట్ట‌లు

Kondagattu | త్రినేత్ర‌.న్యూస్‌: కొండగట్టు (Kondagattu) అంజ‌న్న‌ ఆలయ హుండీల్లో డ‌మ్మీ నోట్లు (Dummy Currency Notes) ల‌భించాయి. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.50 ల‌క్ష‌ల విలువైన నోట్ల‌ను అధికారులు గుర్తించారు. శ్రీ ఆంజ‌నేయ‌స్వామి (Kondagattu Anjanna Temple) ఆల‌యంలోని హుండీల‌ను లెక్కించారు. ఈ సంద‌ర్భంగా బొమ్మ రెన్సీ (Toy Money) ల‌భించ‌డంతో సిబ్బంది ఆశ్చ‌ర్య‌పోయారు. మొత్తం 5 బండిళ్ల‌లో డమ్మీ నోట్ల క‌ట్ట‌లు ల‌భించాయి. రూ.500 నోట్లను పోలిన ఐదు కట్టలతో పాటు ఒక రూ.200 నకిలీ నోటును గుర్తించారు. వాటిని అస‌లు క‌రెన్సీ వేరుచేసిన సిబ్బంది.. అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో వాటిని ప‌రిశీలించిన బ్యాంకు అధికారులు నకిలీగా నిర్ధారించడంతో ఆలయ సిబ్బంది చించివేశారు.

తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి వచ్చిన పిల్లలు టాయ్‌ మనీ నోట్ల కట్టలను హుండీలో వేసి ఉంటారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. వాటిని మళ్లీ హుండీలోనే వేసి భద్రపరిచినట్లు ఆలయ సూపరింటెండెంట్‌ సునీల్‌ తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పంచనామా చేయించిన తర్వాత ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే చిరిగిన నోట్లను కూడా భద్రపరుస్తామని చెప్పారు. కాగా, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే హుండీలో ఇలాంటి డమ్మీ నోట్ల కట్టలు వెలుగుచూడటంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

గ‌తంలో కొండగట్టు హుండీల్లో లేఖలు వేయడం బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. అంజ‌న్న ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు సరిగ్గా లేవని.. అన్ని రకాల వసతులు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయమంటూ భక్తులు రాసిన లేఖలు పదుల సంఖ్యలో వెలుగులోకి వ‌చ్చాయి. అప్పట్లో ఈ వ్య‌వ‌హారం చర్చకు దారితీసిన విష‌యం తెలిసిందే.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *