Gundeninda Gudigantalu Today మే 13 ఎపిసోడ్: అత్తగా ప్రభావతి ఆధిపత్యం.. రోహిణికి చుక్కలే.. మరో నిజం తెలుసుకున్న మీనా, బాలు

 Gundeninda Gudigantalu Today మే 13 ఎపిసోడ్: అత్తగా ప్రభావతి ఆధిపత్యం.. రోహిణికి చుక్కలే.. మరో నిజం తెలుసుకున్న మీనా, బాలు

Gundeninda Gudigantalu Today మే 13 ఎపిసోడ్: అత్తగా ప్రభావతి ఆధిపత్యం.. రోహిణికి చుక్కలే.. మరో నిజం తెలుసుకున్న మీనా, బాలు

Gundeninda Gudigantalu Serial 2026 May 13th Episode Preview గుండెనిండా గుడిగంటలు బుధవారం నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇక అత్తగా ప్రభావతి అయితే రోహిణికి చుక్కలు చూపించింది. కనీసం మొగుడితో మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇక మీనా, బాలుకి రోహిణికి సంబంధించిన మరో నిజం తెలిసింది. గుణ వద్ద పదే పదే లక్షల్లో డబ్బులు వడ్డీకి తీసుకోవడం గురించి తెలిసిపోయింది. ఇంకో వైపు సత్యం మాత్రం రోహిణిని క్షమించేందుకు సిద్ధంగా లేరని అర్థమైంది.

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
రోహిణి నాలుగు చపాతీలు తిన్న తరువాత తన విషయాన్ని కక్కేస్తుంది. నీక ఇప్పుడు సంబరంగా, సంతోషంగా, ఆనందంగా ఉందా? మీనా అని రోహిణి అంటుంది. దీంతో మీనాకి ఎక్కడలేని కోపం వస్తుంది. నీలాంటి బుద్ది, నీలాంటి మోసాలు, నీలాంటి వ్యక్తిత్వం నాకు లేదు అని రోహిణికి గడ్డి పెడుతుంది. ఒకరు బాధపడుతుంటే ఆనందించే మనస్తత్వం నాది కాదు.. ఒకరు కష్టాల్లో ఉంటే సంతోషించే వ్యక్తిని కాదు.. తిన్న ఎంగిలి ప్లేట్‌ని తీయమని అంటున్నావ్.. ఆ ప్లేట్ నీ రూంలో ఉంటేనే చిరాకు అని అంటున్నావ్.. మరి నీ ప్లేట్ నేను తీయాలంటే నాకెంత చిరాగ్గా ఉంటుంది.. ఇకపై నీ ప్లేట్ నువ్వే క్లీన్ చేసుకో.. నువ్వు ఎంగిలి చేసిన దాన్ని క్లీన్ చేయాలంటే నాకు చిరాగ్గా అనిపిస్తోంది.. నువ్వు ఆనందంగా ఉన్నావా? ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? అని నాలుగు చపాతీలు మింగక ముందు అడిగి ఉంటే బాగుండేది.. అన్నీ తిన్న తరువాత కాదు అని చీవాట్లు పెట్టి వెళ్తుంది మీనా. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతుంది రోహిణి. ఇక మరో వైపు మీనాకి ప్రభావతి నుంచి మాటలు ఎదురవుతాయి.

ప్రభావతికి మీనా కౌంటర్లు
ప్రభావతికి మీనా కౌంటర్లు

ప్రభావతికి మీనా కౌంటర్లు
రోహిణిని మచ్చిక చేసుకోవాలని చూస్తున్నావా? నీ పార్టీలోకి తీసుకు పోవాలని చూసుకుంటున్నావా? నా చిన్న కోడలు శ్రుతికి అలానే మాయ మాటలు చెప్పి లాక్కున్నావ్ అని ఇలా మీనాతో పిచ్చిపిచ్చిగా వాగేస్తుంది ప్రభావతి. నాకు ముడులు వేయడమే వచ్చు.. కాపురాలు కూల్చడం రాదు.. నాకు అల్లడమే వచ్చు.. పుల్లలు పెట్టడం రాదు అని ప్రభావతికి మీనా కౌంటర్లు వేసి వెళ్లిపోతుంది. అంటే నేను పుల్లలు పెడుతున్నానా? అసలు ఇదంతా ఆ రోహిణి నన్ను మోసం చేయడం వల్లే వచ్చింది అంటూ తనలో తాను అనుకుంటుంది ప్రభావతి.

ఆ చెప్పుతో కొట్టు..
ఆ చెప్పుతో కొట్టు..

ఆ చెప్పుతో కొట్టు..
మంచి చేయబోతే చెడు ఎదురైంది.. ఈ చెప్పుతో నన్ను కొట్టు అని మీనాకి ఇస్తాడు బాలు. నన్ను కూడా కొట్టండి.. నాక్కూడా అదే జరిగింది అని అంతా చెప్పేస్తుంది మీనా. మనం వీళ్ల గురించి మంచిగా ఆలోచిస్తుంటే వీళ్లు మాత్రం ఇలా ఉన్నారు.. ఇకపై వీళ్ల విషయంలో మనం కూడా వాళ్లలానే ప్రవర్తించాలి అని బాలు, మీనా డిసైడ్ అవుతారు. నేను ఫుడ్ పెట్టి రోహిణిని నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను అంట.. అని అత్తయ్య అన్నారు అని బాలుకి చెబుతుంది మీనా. అలా అయితే మా అమ్మే నీ పార్టీలోకి రావాలి కదా.. రోజు నీ చేతి వంటే తింటోంది కదా? అని బాలు అంటాడు.

గుణ దగ్గర అప్పు..

గుణ దగ్గర అప్పు..
ఇక జరిగిన విషయమంతా అమ్మకి చెబుతుంది మీనా. రోహిణికి ఇలా కావాల్సిందేలే అని శివ, సుమతి అంటారు. గుణ గాడి దగ్గరకు రోహిణి పదే పదే వస్తుంది. రోహిణి రెగ్యులర్‌గా డబ్బులు తీసుకెళ్తుంటుంది. చాలా డబ్బులు తీసుకెళ్లింది అంటూ రోహిణి సీక్రెట్లను శివ చెప్పేస్తాడు. అంటే ఆమె ఇంటికి తీసుకు వచ్చే డబ్బులన్నీ అవేనా? అని డౌట్ పడతారు. రోహిణి గురించి ప్రతీ సారి ఏదో ఒకటి బయటపడుతూనే ఉంది.. అసలు తను ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది అని మీనాకి డౌట్ వస్తుంది.

డోర్ తీయని రోహిణి..

డోర్ తీయని రోహిణి..
డోర్ ఎంత కొట్టినా రోహిణి తీయదు. ప్రభావతి వచ్చి మనోజ్‌‌ని విషయం అడుగుతుంది. ఎందుకు డోర్ తీయడం లేదు.. అని అంటుంది. బాధపడి ఉంటుంది.. తప్పు నాది కూడా ఉంది కదా అమ్మా అని మనోజ్ అంటాడు. అది ఇచ్చిన ఐడియా వల్లే కదా? ఇదంతా జరిగింది.. అది నిన్ను మోసం చేసింది.. అది నేను తట్టుకోలేకపోతోన్నా అని ప్రభావతి అంటుంది. ఎంత తట్టినా డోర్ తీయడం లేదు.. నాకు భయంగా ఉంది.. అని మనోజ్ అంటాడు. దీంతో ప్రభావతి డోర్ కొడుతుంది. ఇంతలో మీనా వస్తే.. కసురుకుని కాఫీ తీసుకు రా పో అని పంపిస్తుంది ప్రభావతి.

అపరాధభావం నీకు లేదా?

అపరాధభావం నీకు లేదా?
మా అమ్మ ఎందుకిలా అరుస్తోంది అని మీనాని బాలు అడుగుతాడు. రోహిణి తలుపు తీయడం లేదట అని మీనా చెబుతుంది. కొంపదీసి లోపల బకెట్ తన్నేసిందా? అని బాలు కామెడీ చేస్తాడు. ఇక ఇంతలో రోహిణి డోర్ తీస్తుంది. ఏమైంది.. అని అడుగుతుంది రోహిణి. ఏమైంది ఏంటే.. టైం ఎంత అయిందో తెలుసా? ఎంత సేపు పిలవాలి.. ఎంతలా అరవాలి.. అని ప్రభావతి అంటుంది. నిద్ర పట్టేసింది అని రోహిణి చెబితే.. మా అందరి నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం హాయిగా పడుకుంటావా? అని కౌంటర్ వేస్తుంది ప్రభావతి. తప్పు చేశావన్న అపరాధభావం నీకు లేదా? అని ఫైర్ అవుతుంది.

డోర్ వేయకు..

డోర్ వేయకు..
రేయ్.. లోపలకు వెళ్లి స్నానం చేసి త్వరగా రా.. అందుకు మాత్రమే నిన్ను లోపలకు పంపుతున్నా.. దాంతో ముచ్చట్లు పెడితే చంపేస్తా అని మనోజ్‌కి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక రోహిణి డోర్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది.. నా ఇంట్లో డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉండాలి.. డోర్ క్లోజ్ చేసి.. వాడితో ముచ్చట్లు పెట్టి.. వాడ్ని నీ వలలో వేసుకోవాలని చూస్తున్నావా? అని ప్రభావతి అంటుంది. ఇక ఈ మాటల్ని వింటూ బాలు, మీనాలు మాట్లాడుకుంటారు. మరీ ఇలా తయారయ్యారేంటి అని.. అనుకుంటారు. మరీ ఇంతగా భయపడాల్సిన పని లేదు అని మనోజ్ గురించి మాట్లాడుకుంటారు.

రోహిణి అప్పులు.

రోహిణి అప్పులు.
శివ చెప్పిన విషయాలు, రోహిణి చేసే అప్పుల గురించి మీనా గుర్తు చేసుకుంటుంది. ఇదే విషయాన్ని బాలుకి చెబుతుంది. మనకి తెలియకుండా చాలా చేస్తుందని, గుణ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటోందట అని బాలుకి చెబుతుంది మీనా. నీకెలా తెలిసింది.. అని బాలు అడుగుతుంది. శివ చెప్పాడు అని మీనా అంటుంది. అసలు ఆ లక్షలతో ఈ పార్లరమ్మ ఏం చేస్తుంది.. అని బాలు, మీనా అనుమానిస్తారు. మనోజ్‌కి వ్యాపారంలో డబ్బులు బాగానే వస్తున్నాయి.. లాభాలు వస్తున్నాయి.. మళ్లీ అప్పులెందుకు అని బాలు దీర్ఘాలోచనలో పడిపోతాడు.

ఇప్పుడెన్ని చెప్పినా మోసంలానే..

ఇప్పుడెన్ని చెప్పినా మోసంలానే..
సారీ మామయ్య.. ఇలా అవుతుందని, ఇంట్లో వాళ్లంతా బాధపడతారని అనుకోలేదు. నేను ఏం చేసినా మనోజ్ మంచి కోసమే కదా అని రోహిణి అంటుంది. వాడు చదువుకున్నాడు.. ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు.. ఏదో ఒక జాబ్ వస్తుందని అనుకున్నాను.. కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేశావ్.. నువ్వు వాడి గురించి ఆలోచించడం మంచిదే.. కానీ మాకు కూడా ముందే చెప్పాలి.. నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా, ఏం చేసినా మోసంలానే అనిపిస్తుంది.. అని సత్యం అంటాడు. అయ్యో మామయ్య అలా అనకండి.. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు అని రోహిణి మొసలికన్నీరు కార్చేస్తుంది.

రోహిణి మొసలి కన్నీరు..

రోహిణి మొసలి కన్నీరు..
మీరే చూశారు కదా.. నన్ను ఎలా కొట్టారో.. ఎంత తిట్టారో.. మనోజ్ గొప్ప స్థాయిలో ఉండాలని, ఎవ్వరి ముందు తక్కువ కావొద్దనే ఇలా చేశాను అని రోహిణి కన్నీరు పెడుతుంది. ఇది ఉమ్మడి కుటుంబం.. పెద్దవాళ్లకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం తప్పు.. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేం గుర్తురాలేదంటేనే మమ్మల్ని అగౌరవపర్చినట్టు.. నువ్వు ఆ డబ్బులన్నీ ఇచ్చినా.. అందరం కలిసే నిర్ణయం తీసుకోవాలి.. చేసే పని మంచిదే అయితే.. అందరూ ఒప్పుకుంటారు.. అన్నీ వదిలేయ్.. ఎంత చెప్పినా.. తప్పు తప్పే.. పెద్ద కోడలివి.. ఆ బాధ్యత నీకు తెలియాలి.. మనోజ్‌ని వాళ్ల అమ్మ చెడగొట్టింది.. నువ్వైనా వాడ్ని సరైన దారిలో పెట్టాలి కదా.. అని చీవాట్లు పెడతాడు సత్యం.

ఇప్పుడు నేనేమీ చేయలేను..

ఇప్పుడు నేనేమీ చేయలేను..
మీ అత్తయ్య నిన్ను చాలా నమ్మంది.. ఆ నమ్మకాన్ని దెబ్బ తీశావ్.. అని సత్యం అంటాడు. నిజంగానే నేను చాలా తప్పు చేశాను.. నన్ను క్షమించండి అని వేడుకుంటుంది రోహిణి. ఇప్పుడు నేనేమీ చేయలేను.. నాకు ఆఫీస్‌కి టైం అవుతోంది అని వెళ్లిపోతాడు సత్యం. నువ్వేంట్రా ఇక్కడ అని కిచెన్‌లో ఉన్న బాలుని అడుగుతుంది ప్రభావతి. నా భార్యని ఇబ్బంది పెట్టే దోమలు బ్రదర్స్, ఈగ సిస్టర్స్, బొద్దింక ఆంటీస్‌లను చంపుతున్నా అని బాలు కౌంటర్లు వేస్తాడు. నువ్వెంటి కిచెన్‌లోకి వచ్చావు.. అని బాలు తిరిగి ప్రశ్నిస్తాడు.

బాలు కౌంటర్లు..

బాలు కౌంటర్లు..
సత్యంకి క్యారేజ్‌ తీసుకెళ్లేందుకు ప్రభావతి కిచెన్‌లోకి వస్తుంది. అది తెలియకుండా ప్రభావతి ఉద్యోగంలోకి వెళ్తోందని బాలు కౌంటర్లు వేస్తాడు. రాళ్లు కొట్టే పనా? రోడ్లు ఊడ్చే పనా? సెప్టిక్ ట్యాంక్ పనా? అని బాలు సెటైర్లు వేస్తాడు. నువ్వు అలాంటి మంచి పనులు ఎందుకు చేస్తావు.. కోడలి నగలు ఎత్తుకెళ్లే పనులు? పుల్లలు పెట్టే పనులు చేస్తావు కదా.. అని బాలు కౌంటర్లు వేస్తాడు. మళ్లీ నాన్న ఉద్యోగం అంటున్నాడా? అని సత్యంని అడుగుతాడు బాలు. ఇంట్లో ఇంత మంది సంపాదిస్తుంటే మళ్లీ నువ్వు ఎందుకు నాన్నా సంపాదించడం.. అని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు బాలు.

అందరూ కలిసి ఒకే చోట..

అందరూ కలిసి ఒకే చోట..
కానీ సత్యం మాత్రం మొండిగా వెళ్తాడు. సత్యం గది నుంచి రోహిణి వస్తుండటం ప్రభావతి చూస్తుంది. నేను నిన్ను క్షమించడం లేదని, ఆయన్ను అడిగావా? నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అని ప్రభావతి అంటుంది. ఇక అందరం కలిసి భోజనం చేద్దామని బాలు అంటాడు. రవి, శ్రుతి, బాలు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. ఇంతలో ప్రభావతి వస్తుంది. ఆ తరువాత మనోజ్ కూడా వస్తాడు. కాస్త దూరం జరిగి కూర్చో అని ప్రభావతి అంటుంది. ఇక రోహిణి కూడా అక్కడకు వచ్చి నిల్చుంటుంది. అంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *