బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బండి భగీరథ్ కేసు విషయంలో బండి సంజయ్‌ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్.. బాధితులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడివైతే తన కొడుకును పోలీసులకు అప్పగించాలని పేర్కొన్నారు.
RS Praveen Kumar
బండి సంజయ్ కుమారుడి కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బండి భగీరథ్‌పై ఆరోపణలు చేసిన బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం చేయాలని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నిజంగా బండి సంజయ్ హనుమాన్ భక్తుడు అయితే.. బండి భగీరథ్‌ను కొడుకును పోలీసులకు అప్పగించాలని సూచించారు. బండి సాయి భగీరథ్ రోజూ ఎక్కడ తిరుగుతున్నాడో బండి సంజయ్‌ను అడగాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ దేవుడిని ప్రార్థిస్తామో చెప్పే బండి సంజయ్.. తన కుమారుడు సాయి భగీరథ్ సోమవారం నుంచి ఆదివారం వరకు ఎవరిని కొడుతాడు.. ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడుతాడు.. ఏ పబ్‌లో ఉంటాడు.. ఏ హుక్కా సెంటర్లో గడుపుతాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజంగా హనుమాన్ భక్తుడేనా అని ప్రశ్నించారు. అయితే బండి సంజయ్ కానీ.. అతని కుమారుడు బండి సాయి భగీరథ్ కానీ.. ఏనాడైనా హనుమాన్ మాల ధరించారా.. హనుమాన్ చాలీసా ఎపుడైనా చదివారా అని నిలదీశారు. ఈ క్రమంలోనే ఒక వీడియో రిలీజ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సుదీర్ఘ ట్వీట్ చేశారు.
మనమంతా కాలినడకన, భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ కొడుకు మాత్రం ఎందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీతమ్మ కోసం ఆంజనేయస్వామి లంకను తగలబెట్టి.. సొంత తల్లి కాకపోయినా సీతమ్మనే తల్లిగా భావించి.. జీవితాంతం దేవతగా ప్రార్థించారని గుర్తు చేశారు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా గడిపి, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. కానీ సాయి భగీరథ్ మాత్రం.. మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి.. ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడని నిలదీశారు.
తడిబట్టలతో వచ్చి హనుమాన్ ఆలయంలో.. బాధిత అమ్మాయి తల్లిని బెదిరించింది నిజమా, కాదా అని చెప్పమని అడగాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే.. ఆయన కుమారుడిని తక్షణమే పోలీసులకు అప్పగించమని నిలదీయండని పేర్కొన్నారు. హిందువుగా గర్విద్దాం.. హిందువుగా జీవిద్దాం.. తప్పు చేసిన హిందువును ప్రశ్నిద్దాం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.