ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు

 ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు

ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. 2026 దసరా, సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం 87 రోజులు సెలవులు

AP Schools 87 Holidays In 2026-2027: 2026-2027 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ రెడీ అయ్యింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకు గాను 229 రోజులు పనిదినాలు, 87 సెలవులు ఉంటాయి. దసరాకు అక్టోబరు 12 నుంచి 21 వరకు, సంక్రాంతికి జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇస్తారు. పదో తరగతి పరీక్షలు మార్చిలో ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:
ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ 2026-27 అకడమిక్‌ క్యాలెండర్‌
వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 87 సెలవులు
మొత్తం పని దినాలు 229 రోజులుగా నిర్ణయించారు

AP School Holidays List 2026-2027

ఏపీ స్కూల్స్‌కు 2027-2026లో 87 సెలవులు
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. పాఠశాల విద్యాశాఖ 2026-27 (వచ్చే విద్యా సంవత్సరం) అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో స్కూళ్లకు మొత్తం 87 సెలవులు రానున్నాయి. ఆప్షనల్ సెలవులు ఐదు, స్థానిక పండుగలు, జాతరలకు ఇచ్చే లోకల్ సెలవులు మూడు ఉంటాయి. 2026-2027 విద్యా సంవత్సరంలో స్కూళ్లు 229 రోజులు పనిచేస్తాయి. పాఠశాల విద్యాశాఖ 2026-2027 అకడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పనకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించింది.. సలహాలు, సూచనలు ఆహ్వానించింది.

పాఠశాల విద్యాశాఖ.. ప్రతి ప్రభుత్వ టీచర్‌కు వారంలో కనీసం 24 బోధనా పీరియడ్లు, గరిష్ఠంగా 30 పీరియడ్లు మించకూడదని పేర్కొంది. అలాగే భౌతికశాస్త్రం టీచర్ అవసరమైతే గణతం కూడా ఏడో క్లాస్ పిల్లలకు బోధించాలన్నారు. జూన్‌లో స్కూళ్ల రీ ఓపెన్ కాగానే ప్రభుత్వ స్కూల్స్‌లో అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అంతేకాదు ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’ను అమలు చేస్తారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో పైతరగతికి వచ్చిన విద్యార్థుల కోసం జూన్‌ 12 నుంచి ఆగస్టు 3 వరకు 1, 2, 6 తరగతులకు 36 రోజుల పాటు బోధన ఉంటుంది. జూన్‌ 12 నుంచి 30 వరకు 13 రోజులపాటు 3,4,5,7,8 తరగతులకు బోధన ఉంటుంది.

2026-27 వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు అక్టోబరు 12 నుంచి 21 వరకు దసరా సెలవులు.. అయితే మైనారిటీ స్కూళ్లకు మాత్రం అక్టోబర్ 15 నుంచి ఇస్తారు. క్రిస్మస్‌ సెలవులు మైనారిటీ విద్యా సంస్థలకు డిసెంబరు 20 నుంచి 27 వరకు ఇస్తారు. సాధారణ స్కూళ్లకు డిసెంబర్ 5 ఒక్కరోజు సెలవు ఇస్తారు. సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17 వరకు ఇస్తారు.. అయితే మైనారిటీ విద్యా సంస్థలకు జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయి.

ఫార్మెటివ్ పరీక్షలు ఆగస్టు నుంచి పరీక్షల విషయానికి వస్తే.. ఆగస్టు 3 నుంచి 6 వరకు ఫార్మెటివ్ 1 పరీక్షలు ఉంటాయి. అక్టోబరు 5 నుంచి 8 వరకు ఫార్మెటివ్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరు 9 నుంచి 20 వరకు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి 4 నుంచి 7 వరకు ఫార్మెటివ్‌ 3 పరీక్షలు నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఫార్మెటివ్‌ 4 పరీక్షలు నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9వరకు పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్, తొమ్మిదో తరగతికి సమ్మెటివ్‌-2 పరీక్షలు ఉంటాయి. 2027 ఏప్రిల్‌ 3 నుంచి 17 వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఉంటాయి. 2027 మార్చి 15 నుంచి 31 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *