రాశిఫలాలు 03 మే 2026: ఈరోజు వరియన్ యోగం ప్రభావంతో కర్కాటకం, కన్య సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు
రాశిఫలాలు 03 మే 2026: ఈరోజు వరియన్ యోగం ప్రభావంతో కర్కాటకం, కన్య సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు
horoscope today 03 May 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వరియన్ యోగం ప్రభావంతో కర్కాటకం, కన్య సహా ఈ 5 రాశులకు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel May3
horoscope today 03 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు వరియన్, పరిఘ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగా కారణంగా కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి విశేష లాభాలొచ్చే అవకాశాలున్నాయి. సూర్యుడి స్థానం కూడా బలపడటం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు జరగొచ్చు. మీ మంచి ప్రవర్తనతో సానుకూల వాతావరణాన్ని కొనసాగించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం కారణంగా రాత్రిపూట మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈరోజు దానధర్మాలు చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీకు పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మార్గంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ కాలంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈరోజు ముఖ్యమైన పనులలో మంచి విజయం సాధిస్తారు. మీకు ఇంటి పెద్దల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తి లభించొచ్చు. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ తండ్రి ఆశీస్సులు, ఉన్నతాధికారుల అనుగ్రహంతో, విలువైన వస్తువు లేదా ఆస్తిని సంపాదించాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. అయితే ఈరోజు అనవసరమైన ఖర్చులు నివారించాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మనోధైర్యం పెరుగుతుంది. మీ భాగస్వామి నుంచి మద్దతు లభించే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సకాలంలో పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. వాటిని మీరు నిజాయితీగా పూర్తి చేస్తారు. మీ డబ్బును తెలివిగా ఉపయోగించాలి. ఎక్కువగా ఖర్చు చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల పట్ల బాధ్యతలు కూడా నెరవేరుతాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావొచ్చు. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీ సన్నిహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీరు పని నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈరోజు ముఖ్యమైన పనులలో విజయం సాధించొచ్చు. మీ కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరొచ్చు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడొచ్చు. మీ మాటతీరుతో సమాజంలో గౌరవం పెంచుకుంటారు. తీరికలేని పనుల కారణంగా, మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణం వల్ల సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ ప్రణాళిక ప్రకారం పనులు సకాలంలో పూర్తవ్వొచ్చు. ఈరోజు యోగా, ధ్యానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే ఖర్చులు కూడా పెరగొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీకు రావాల్సిన బకాయిలు మరింత ఆలస్యం కావొచ్చు. ఈ కారణంగా మీరు నిరాశ చెందొచ్చు. ఈరోజు ప్రభుత్వ విషయాల నిమిత్తం కోర్టుకు వెళ్లాల్సి రావొచ్చు. అయితే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే బలంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ఈరోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన సమస్యల వల్ల ఖర్చులు పెరగొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి ప్రశంసలు లభించొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో వాతావరనం సంతోషకరంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వినొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పనికి సంబంధించి మీరు దగ్గర లేదా దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల మద్దతు కారణంగా అన్ని పనులు విజయం సాధించొచ్చు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.