రాశిఫలాలు 04 మే 2026: ఈరోజు శివ యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 4 రాశులకు కెరీర్ పరంగా పురోగతి
రాశిఫలాలు 04 మే 2026: ఈరోజు శివ యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 4 రాశులకు కెరీర్ పరంగా పురోగతి
horoscope today 04 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శివ యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel May4
horoscope today 04 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శివ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి శివుని అనుగ్రహం లభించే అవకాశాలున్నాయి. చంద్రుడి స్థానం బలపడటం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. భౌతిక పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు కొత్త ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు ఓ పుణ్యక్షేత్రం సందర్శించడం వల్ల మీ మనసుకు శాంతి చేకూరుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. రోజు చివరి భాగంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పని ప్రదేశంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ పనులను విభిన్నంగా చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఈ కారణంగా సకాలంలో పనులు పూర్తవ్వొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. అయితే బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. మీ ప్రేమ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ పనులన్నీ అంకితభావంతో పూర్తి చేయొచ్చు. ఈ కారణంగా మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు సాయంత్రం ఒక వివాహానికి హాజరయ్యే అవకాశం లభించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు ఆధ్యాత్మికకు సంబంధించి కొంత సమయం కేటాయించొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తులు మీ పనికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు రాత్రి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా సంయమనం, జాగ్రత్త వహించాలి. ఇతరులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాల గురించి సమస్యలు తలెత్తొచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. రాత్రికి పరిస్థితులు మరింత మెరుగుపడొచ్చు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పనికి సంబంధించి ఏవైనా వివాదాలు ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడొచ్చు.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో చురుగ్గా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ పనులన్నీ చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు చిన్న రిస్క్ చేయడం వల్ల గణనీయమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారి కోసం కొంత డబ్బును ఏర్పాటు చేయాల్సి రావొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు భాగస్వాములతో కలిసి గణనీయమైన లాభాలు సాధించే అవకాశాలున్నాయి. మీ రోజువారీ ఇంటి పనులను పూర్తి చేసుకోవడానికి సువర్ణావకాశం లభిస్తుంది. మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు. ఈరోజు మీరు నిజాయితీగా ఉండాలి. ఒకేసారి అనేక పనులు చేయాల్సి రావొచ్చు.ఈ కారణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా మీ ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు తలెత్తొచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని రిస్క్‌లు తీసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా విషయాల్లో ఓపిక, సంయమనంతో వ్యవహరించాలి. మీ తెలివిని ఉపయోగించి సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. అవసరంలో ఉన్న వ్యక్తులకు సాయం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.