Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన గాయత్రి.. గుండెల్లో బాధను మోస్తున్న పెద్ది

 Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన గాయత్రి.. గుండెల్లో బాధను మోస్తున్న పెద్ది

Podarillu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్ : గాల్లోతేలిపోయిన మహా.. కన్నీటితో తడిచిపోయిన గాయత్రి.. గుండెల్లో బాధను మోస్తున్న పెద్ది

Podarillu Serial 2026 April 24th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్ సగం సంతోషంగా, మరో సగం బాధతో నిండిపోయింది. సర్టిఫికేట్స్ రాబోతోన్నాయని మహా గాల్లో తేలిపోతోంటోంది. మరో వైపు పెళ్లికి దగ్గర పడుతుండటంతో గాయత్రి, మాధవ ఇద్దరూ బాధపడుతుంటారు. మరి తెల్లారేలోపు ఏమైనా జరగొచ్చు అని ఆడియెన్స్ అనుకునే లోపు రాత్రి పూట ఇంటి నుంచి వెళ్లిపోతుంది గాయత్రి. బావ కోసం వచ్చేసిన గాయత్రిని కేశవ, నారాయణ తిట్టడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

పొదరిల్లు టుడే ఎపిసోడ్

Podarillu Serial 2026 April 24th Episode Preview పొదరిల్లు శుక్రవారం నాటి ఎపిసోడ్ సగం సంతోషంగా, మరో సగం బాధతో నిండిపోయింది. సర్టిఫికేట్స్ రాబోతోన్నాయని మహా గాల్లో తేలిపోతోంటోంది. మరో వైపు పెళ్లికి దగ్గర పడుతుండటంతో గాయత్రి, మాధవ ఇద్దరూ బాధపడుతుంటారు. మరి తెల్లారేలోపు ఏమైనా జరగొచ్చు అని ఆడియెన్స్ అనుకునే లోపు రాత్రి పూట ఇంటి నుంచి వెళ్లిపోతుంది గాయత్రి. బావ కోసం వచ్చేసిన గాయత్రిని కేశవ, నారాయణ తిట్టడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

పొదరిల్లు టుడే ఎపిసోడ్
షర్ట్ బటన్ పెట్టుకోండి.. కాస్త పద్దతిగా ఉండండి అని యూనివర్సిటీ ఎంట్రీలో చక్రికి మహా చెబుతుంది. పద్దతి అనేది డ్రెస్సులో కాదు మాట తీరులో ఉంటుందని చక్రి మొండిగా మహా మాట వినడు. కానీ ఇంతలో చక్రి వాలకాన్ని చూసి ఎంట్రీలోనే ప్యూన్ ఆపేస్తాడు. మీ ఊరు అనుకున్నావా? ఇది యూనివర్సిటీనా? ముందు షర్ట్ బటన్ పెట్టుకోండి.. అని చెబుతాడు ప్యూన్. ఇంతలో హాయ్ చక్రి అని మేడం పిలుస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని మేడం అడిగితే.. మొన్న చెప్పాను కదా.. మా భార్య సర్టిఫికేట్ పోయాయ్ అని చక్రి చెబుతుంటే.. అవును కదూ.. అని మేడం తలూపుతుంది. తను మహాలక్ష్మీ.. నా భార్య అని చక్రి పరిచయం చేస్తాడు. దీంతో మహా కోపంగా చూస్తుంది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం సర్టిఫికేట్‌లను పోగొట్టుకుంటారా.. ఎనీ వే మా చక్రిని పెళ్లి చేసుకున్నారు.. కంగ్రాట్స్.. సినిమా రేంజ్‌లో పెళ్లి చేసుకుంటున్నారంట కదా అని మేడం చెప్పడంతో మహా కోపంగా చూస్తుంది. మేడం వెళ్లడంతో చక్రి మీద కోపంతో మహా రగిలిపోతుంది. అప్లికేషన్ ఫాంని మహా నింపుతుంటే.. చక్రితో ఆ మేడం చాలా క్లోజ్‌గా నవ్వుతూ మాట్లాడుతుంటుంది.అది చూసి మహాకి మరింత మండుతుంది. అదేంటి.. నేను నిజంగా తన భర్తను అన్నట్టుగా అలా కోపం చూస్తోంది.. జెలసీ ఫీల్ అవుతోందా? ఏంటి? అని చక్రి లోలోపల అనుకుంటాడు. రెండు వారాల్లో సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పడంతో మహా సంతోషిస్తుంది.

గాల్లో తేలిపోయిన మహా..

గాల్లో తేలిపోయిన మహా..

గాల్లో తేలిపోయిన మహా..
సర్టిఫికేట్స్ రాబోతోన్నాయని మహా గాల్లో తేలిపోతోంది. కారులో గాల్లో తేలినట్టుందే గుండే పేలినట్టుందే అని పాట పెట్టుకుని తెగ సంబరపడుతోంది. ఆకాశమంత సంతోషంతో ఉన్న మహాని చక్రి అలా చూస్తుండిపోతాడు. ఎందుకు అలా చూస్తున్నారు అని మహా అడిగితే.. ఈ రోజు చాలా కొత్తగా ఉన్నారు.. సంతోషంగా ఉన్నారు అని చక్రి చెబుతాడు. ఇదంతా నీ వల్లే అని థాంక్స్ చెబుతుంది మహా. అంతేనా? అని పార్టీ లేదా పుష్ప అని చక్రి కామెడీ చేస్తాడు. పార్టీ ఉండాది షెకావత్ అని మహా నవ్వేస్తుంది.

మాధవని బాధపెట్టిన గాయత్రి తండ్రి..
మాధవని బాధపెట్టిన గాయత్రి తండ్రి..

మాధవని బాధపెట్టిన గాయత్రి తండ్రి..
గాయత్రి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుంటాయి. అటు నుంచి మాధవ, కేశవ వెళ్తుంటారు. ఇక రోడ్డు మీదు వెళ్లున్న బావని చూసుకుంటూ గాయత్రి కిటికీల్లోంచి చూసి బాధపడుతుంటుంది. మాధవ, కేశవలను చూసిన పురుషోత్తం సెటైర్లు వేస్తాడు. పెళ్లి ఈ రోజే అని తెలియాలి కదా.. ఫ్లెక్సీ కట్టు అని పనివాడికి చెబుతాడు. మాధవను మరింత బాధపెట్టేలా గాయత్రి పెళ్లి గురించి, పెళ్లి కొడుకు గురించి పురుషోత్తం మాట్లాడతాడు. నా ఇంటి అల్లుడు అవ్వాలంటే ఓ అర్హత ఉండాలి.. దారిన పోయే దానయ్య గాడికి నేనున ఇస్తానా? అంటూ ఇలా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడతాడు.

ఐస్ క్రీం పార్టీ..

ఐస్ క్రీం పార్టీ..
మధ్యలో కారు ఆపమని మహా అంటుంది. పార్టీ ఇస్తుందేమో.. రెస్టారెంట్‌కి తీసుకు వెళ్తుందేమో.. పబ్‌కి తీసుకు పోతుందేమో అని చక్రి అనుకుంటాడు. కానీ ఇంతలో రెండు కోన్ ఐస్ క్రీంలు పట్టుకొస్తుంది మహా. ఇది పార్టీనా? దీనికి పార్టీ అని అంత పెద్ద పేరు ఎందుకో అని కౌంటర్లు వేస్తాడు చక్రి. సర్టిఫికేట్స్ వచ్చాక అందరినీ తీసుకెళ్లి బిర్యానీ పార్టీ ఇస్తాను అని అంటాడు. త్వరగా సర్టిఫికేట్స్ వస్తే నా కలలు నెరవేర్చుకుంటాను.. ఉద్యోగానికి వెళ్తాను అని మహా అంటుంది. అంతే కానీ నా మనసులో ఉన్నది మాత్రం అర్థం చేసుకోవా? అని చక్రి లోలోపల అనుకుంటాడు.

తాయారు చచ్చింది..

తాయారు చచ్చింది..
ఇంట్లోకి వచ్చిన మహా తన సర్టిఫికేట్ల గురించి చెబుతుంది. నీ లాంటి మంచి దానికి అంతా మంచే జరుగుతుంది అని పెద్ది అంటాడు. ఎవరో ఓ వ్యక్తి వచ్చి నారాయణని అడ్రెస్ అడుగుతాడు. నేను పెళ్లి కొడుకు తరుపున వచ్చాను.. ఇక్కడ తాయారు ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. నీకు ఈ విషయం తెలీదా?.. పెళ్లింట్లో ఘోరం జరిగింది.. తాయారు చచ్చింది అని అబద్దం చెబుతాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతోంటే.. మాధవ వచ్చి నిజం చెప్పి పంపిస్తాడు. ఇక్కడ పడ్డ గాయత్రి పెళ్లి శుభలేఖని చూసి మాధవ మరింత బాధపడతాడు.

చచ్చిపో.. గాయత్రి ఆగ్రహం

చచ్చిపో.. గాయత్రి ఆగ్రహం
తినను.. ఆకలిగా లేదు.. అని గాయత్రి అంటుంది. నీకు ఏం ఇష్టమో చెప్పు.. అదే చేసి తీసుకొస్తాను అని తాయారు అంటుంది. నాకు బావ ఇష్టం.. తీసుకు వస్తావా? పెళ్లి చేస్తావా? అని గాయత్రి నిలదీస్తుంది. ఇంకా వాడి గురించే ఆలోచిస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు.. చంపేస్తా.. అని వార్నింగ్ ఇస్తుంది తాయారు. అంతకంటే నువ్వేం చేయగలవు.. అయితే నువ్వు చస్తానంటావ్.. లేదా నన్ను చంపుతానంటావ్.. అంతే కదా?.. గాయత్రి ఆగ్రహిస్తుంది. ఈ సారి ఏమైనా చేస్తే చచ్చిపోతా అని బెదిరిస్తుంది తాయారు.. అయితే చచ్చిపో అని గాయత్రి కోపంతో అరిచేస్తుంది.

బాధను చెప్పుకున్న గాయత్రి..

బాధను చెప్పుకున్న గాయత్రి..
నాకు బావ అంటే ఇష్టమని మీకు తెలుసు, మరి ఈ ఇష్టం లేని పెళ్లి జరిగితే నేను ఎలా ఉంటాను.. అని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.. ఎక్కడో ఎడారి ఒంటెను తీసుకు వచ్చి నాకు ఎందుకు కట్టబెట్టాలని చూస్తున్నారు.. చిన్నప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే తట్టుకోలేరు.. మాకోసం ఎన్నో చేస్తారు.. కావాల్సినవన్నీ ఇస్తారు కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తారు.. మీరు ఎంతైనా ప్రేమించొచ్చు.. మా జీవితంలోకి వచ్చే వాడ్ని మాత్రం ప్రేమించొద్దా? ఇదెక్కడి ప్రేమ అమ్మా.. అని గాయత్రి ఏడ్చేస్తుంది.

తాయారు ఎమోషనల్..

తాయారు ఎమోషనల్..
మేం తల్లిదండ్రులం.. రాక్షసులం కాదు.. పిల్లలకి ఏం అవసరమో అదే ఇస్తాం.. మీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం.. పుట్టగానే మీరు ఏడిస్తే మేం నవ్వుతాం.. పెద్దయ్యాక ఏడిస్తే.. ఆపుతాం.. మీకు ఎప్పుడు ఏది అవసరమో, మీకు ఎప్పుడేం చేయాలో తల్లిదండ్రులుగా మాకు మాత్రమే తెలుసు.. తెల్లవారితే పెళ్లి.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అన్నం తిను.. అని చెప్పి వెళ్తుంది తాయారు. ఇక ఇటు గాయత్రి ఏడ్చుకుంటూ ఉంటే.. అటు మాధవ బాధపడుతూ ఉంటాడు.. ఒకరినొకరు తల్చుకుంటూ, గుర్తు చేసుకుంటూ లోలోపల కుమిలి కుమిలి ఏడ్చేస్తుంటారు.

ఇంట్లోంచి వచ్చేసిన గాయత్రి..

ఇంట్లోంచి వచ్చేసిన గాయత్రి..
ఇక అర్దరాత్రి మళ్లీ గాయత్రి తన బావ ఇంటికి వచ్చేసింది. అలా గాయత్రి రావడంతో కేశవ ఫైర్ అవుతుంటాడు. పెళ్లి అంటావ్.. వద్దని అంటావ్.. ఇష్టం అని అంటావ్.. మళ్లీ లేదంటావ్.. అసలు నువ్వేం అనుకుంటున్నావ్ అని కేశవ తిడతాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్నావ్.. ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చావే.. సిగ్గు లేదా అని నారాయణ కూడా తిడతాడు. ఇలా అందరూ తలా ఒకరకంగా మాటలు అనేస్తుంటారు. గాయత్రి మాత్రం సైలెంట్‌గానే ఉంటుంది. మాధవ కూడా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. అంతటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి వచ్చే వారం ఏం జరుగుతుందో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *