Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్: బంగారు గాజులు ఇచ్చిన మనోజ్.. పొంగిపోయిన ప్రభావతి.. ఆలోచనలో పడ్డ బాలు, మీనా

 Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్: బంగారు గాజులు ఇచ్చిన మనోజ్.. పొంగిపోయిన ప్రభావతి.. ఆలోచనలో పడ్డ బాలు, మీనా

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 24 ఎపిసోడ్: బంగారు గాజులు ఇచ్చిన మనోజ్.. పొంగిపోయిన ప్రభావతి.. ఆలోచనలో పడ్డ బాలు, మీనా

Gundeninda Gudigantalu Serial 2026 April 24 Episode Preview గుండెనిండా గుడిగంటలు శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రభావతి గాల్లో తేలిపోతోంది. మనోజ్‌కి లాభాలు రావడంతో అమ్మ కోసం బంగారు గాజుల్ని తీసుకు వస్తాడు. పైగా కొత్త ఇంటిని కొంటాను అని చెప్పడంతో తెగ మురిసిపోతుంది. మరో వైపు సత్యం ఉద్యోగానికి వెళ్లేందుకు రెడీ అవుతాడు. ఇక స్కూల్‌లో చింటు గాడిని జాయిన్ చేసేందుకు రోహిణి కూడా బయల్దేరుతుంది. చూస్తుంటే వచ్చే వారం మరింత రసవత్తరంగా ఎపిసోడ్స్ ఉండబోతోన్నట్టు కనిపిస్తున్నాయి.
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
బాలు ఇంటికి మురళీ రావడం.. మీనాని ఇచ్చి పెళ్లి చేయమని సత్యంని అడగటం చూశాం. ఇక ఇంతలో మీనా కిందకు రావడం, విషయం తెలుసుకుని షాక్ అవ్వడం జరుగుతుంది. మురళీ తెచ్చిన పళ్లు, పల్లెం, చీరని విసిరేస్తుంది మీనా. ఇంతలోనే బాలు వచ్చి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడకు వచ్చావ్ అన్నయ్య అని బాలుని మురళీ అడుగుతాడు. వీరిద్దరి బంధాన్ని చూసి ఇంట్లో వారంతా షాక్ అవుతారు. నా సలహాలు తీసుకుని నా భార్యకే లైన్ వేశావా? అని మురళీని అడుగుతాడు. మెడలో మంగళసూత్రం కూడా చూడలేదారా అని మురళీని నిలదీస్తాడు బాలు. సోషల్ మీడియాలోని ఫోటోలు, వీడియోల్లో లేదు కదాఅని అంటాడు. వాటిని తీయించి ఫోటోలు తీసింది నేనే అని శ్రుతి అంటుంది. ఇక దీంతో మీనాకి పట్టలేని కోపం వస్తుంది. వెంటనే మురళీ బయటకు పారిపోతాడు. ట్యాక్సీ స్టాండ్‌కి రా రా నీ సంగతి చెబుతాను అని బాలు కవర్ చేస్తాడు. దీంతో మీనా కోపంగా చూస్తుంది. నువ్వు చేసే పనులు ఇవేనా రా అని సత్యం కోప్పడతాడు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లను చూసి మీనా షాక్ అవుతుంది.
చీవాట్లు పెట్టిన మీనా..
చీవాట్లు పెట్టిన మీనా..

చీవాట్లు పెట్టిన మీనా..
మురళీకి ఇచ్చిన సలహాల గురించి తల్చుకుని బాలు బాధపడుతుంటాడు. ఇంతలో మీనా వస్తుంది. ఈ రోజు మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు.. అని మీనా అంటుంది. కుర్రకారుకి ప్రేమ గురువు అనే కొత్త అవతారం ఎత్తారు.. చివరకు అది మన మెడకే చుట్టుకుంటుంది.. విప్పుకోవడం కష్టమవుతుంది.. మనం ఇచ్చే సలహాల వల్ల మన భార్యకో, చెల్లికో సలహాలు ఇస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు అర్థమైంది కదా?.. భార్యని ప్రేమించడానికి భర్త ఎక్కడైనా సలహాలు ఇస్తాడా? ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తారేంటి.. ఇటు చూడండి.. అంటూ చీవాట్లు పెడుతుంది మీనా.

సిగ్గు పడ్డ మీనా..
సిగ్గు పడ్డ మీనా..

సిగ్గు పడ్డ మీనా..
ఎవరికి సలహాలు ఇస్తున్నాం.. ఆ అమ్మాయి ఎవరు? ఇంట్లో పరిస్థితులు ఏంటి? అని ఇలా అన్నీ కనుక్కుని సలహాలు ఇవ్వాలి అని బాలుకి మీనా చెబుతుంది. నేను బాగానే సలహాలు ఇచ్చాను.. వాడిలా చేస్తాడని నాకేం తెలుసు.. నువ్వు కాలేజీ అమ్మాయి అని అనుకున్నాడట.. అని బాలు చెప్పడంతో మీనా తెగ సిగ్గు పడుతుంది. నిజంగానే నువ్వు కాలేజీ అమ్మాయిలా, చిన్న పిల్లలానే ఉంటావ్ అని బాలు అంటాడు. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు చూసి అలా అనుకుని ఉంటాడేమో మీనా అంటుంది. నేను కూడా ఫోటోలు పెడతా.. నీ వెంటే కాదు.. నా వెంట కూడా అమ్మాయిలు పడతారేమో.. అని బాలు కామెడీ చేస్తాడు.

స్వీట్స్ పంచిన రోహిణి, మనోజ్

స్వీట్స్ పంచిన రోహిణి, మనోజ్
వ్యాపారంలో పది లక్షల లాభం వచ్చిందని మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో ప్రభావతి గాల్లో తేలిపోతుంది. మన పేరు నిలబెడతాడని ముందే చెప్పాను కదా.. అంచనాలకు మించి ఎదిగాడని ప్రభావతి సంతోషిస్తుంది. మిగతా వాళ్లని కూడా ఎంకరేజ్ చేయాలని సత్యం అంటాడు. రవి కూడా ఎదుగుతాడు.. కానీ మనోజ్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటాడు అని ప్రభావతి సంబరపడుతుంది. జాతకాలు రాసినోడు.. దొరికితే.. వాడి జాతకం నేను రాస్తాను అని బాలు అంటాడు. బాలు కౌంటర్లు వేస్తుంటే.. అప్పుడే అసూయ పడుతున్నారా? అదే విజయం అంటే అని ప్రభావతి సెటైరికల్‌గా అంటుంది..

బంగారు గాజులు చూసి షాక్..

బంగారు గాజులు చూసి షాక్..
స్వీట్స్ మాత్రమే కాదు అమ్మా.. నీకోసం ఇంకో సర్ ప్రైజ్ కూడా ఉందని బంగారు గాజుల్ని చూపిస్తారు. దీంతో ప్రభావతి నిజంగానే ఆకాశమంత ఎత్తులో ఎగిరినట్టు సంతోష పడుతుంది. ఇక అమ్మని నేల మీద ఆపడం కష్టం అని ప్రభావతి తెగ సంబరపడుతుంది. గుట్ట దోచుకెళ్లి గులకరాయి ఇచ్చినట్టుంది.. నలభై లక్షలు పట్టుకుపోయి.. నాలుగు గాజులు తెచ్చి పెట్టాడు అని కౌంటర్ వేస్తాడు బాలు. ఇకపై షాపులో నిన్నే తల్చుకుంటా అని దిష్టి బొమ్మ గురించి మనోజ్ ఆలోచిస్తాడు. ఆ గాజులు నా చేతులతో వేస్తాను అంటూ రోహిణి అని ప్రభావతికి వాటిని తొడిగేస్తుంది.

గాల్లో తేలిపోయిన ప్రభావతి..

గాల్లో తేలిపోయిన ప్రభావతి..
అమ్మకి గాజులు తెచ్చావ్.. మరి నాన్నకి ఏం తేలేదా? అని బాలు అడుగుతాడు. నాన్న కోసం షర్ట్ తెచ్చా అని మనోజ్ అంటాడు. నాన్నకి బ్రేస్ లేట్ తీసుకు రావొచ్చు కదా? అని బాలు అంటే.. ఆ పది లక్షలు ఇక్కడే ఖర్చు అవుతాయ్.. నేను ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నాను అని మనోజ్ చెప్పడంతో మరింత సంబరపడుతుంది ప్రభావతి. అసలైన వారసుడివి అంటే నువ్వేరా అని ప్రభావతి మరింతగా ఓవర్ చేస్తుంది. దీంతో బాలు, రవి కాస్త బాధపడుతుంటారు. అవే మాటల్ని మీనా తల్చుకుంటూ ఆలోచనలో పడుతుంది.

మేడ మీద బాలు, మీనా..

మేడ మీద బాలు, మీనా..
ఆలోచనల్లో ఉన్న మీనాని నవ్వించేందుకు బాలు ప్రయత్నిస్తాడు. మనం నాలుగు ఇటుకల్ని కొన్నాం.. వాడేమో ఇల్లు కొట్టున్నాడని ఆలోచిస్తున్నావా? అని మీనాని బాలు అడుగుతాడు. పక్కవాళ్లు బాగుపడితే కుళ్లుకునే టైపు కాదు అని మీనా అంటుంది. కుటుంబమంతా వేరు పడుతుందా? ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా? అని మీనా అడుగుతుంది. అవును కదా? మనమంతా కలిసి ఉంటేనే మా నాన్న సంతోషంగా ఉంటారు అని బాలు అనుకుంటాడు. ప్రతీదీ ఓ కారణంతోనే జరుగుతుంది అని మీనా అంటుంది. ఏం జరిగినా మనమంచికే అని ఓ స్వామిజీ అన్నాడని బాలు చెబుతాడు. ఇక అలానే అక్కడ కాసేపు సరసాలు ఆడుకుంటారు బాలు, మీనా.

ఉద్యోగానికి మొదటి రోజు..

ఉద్యోగానికి మొదటి రోజు..
ఉద్యోగానికి మొదటి రోజు.. అందుకే ఇలా రెడీ అయ్యాను.. అని బాలుతో సత్యం అంటాడు. చెబితే వినవు కదా అన్నా.. అని బాలు అంటాడు. ఇంతలో రవి, శ్రుతి, మనోజ్, రోహిణి వస్తారు. ఏం వర్క్ అంకుల్ అని శ్రుతి అడిగితే.. ఇంకేం పని చేస్తాడు.. గంటకొట్టే పనో.. అటెండర్ పనో అని ఎగతాళి చేస్తాడు మనోజ్. నాన్న గురించి అలా అనడంతో బాలుకి ఆగ్రహం వస్తుంది. నువ్వు పార్కులో అడుక్కు తిన్న రోజుల్ని మర్చిపోయావా? అని ఫైర్ అవుతాడు. ఎవరి పని వాళ్లకి గొప్పది.. ప్రతీ పనికి గౌరవం ఇవ్వాలి.. అలా చిన్న చూపు ఇవ్వకూడదు అని మనోజ్‌కి క్లాస్ పీకుతాడు సత్యం.

మీనాని కించపర్చిన ప్రభావతి..

మీనాని కించపర్చిన ప్రభావతి..
మా నాన్న కూడా ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు కాదు.. కష్టం చేసే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉండటం కష్టంగానే ఉంటుందని మీనా అంటుంది. అబ్బో మీ నాన్న సీఎం ఆఫీసులో సంతకం పెట్టే పని మరి అని కౌంటర్లు వేస్తుంది. గుడిముందు చెరుకు రసం అమ్మేవాడికి, గవర్నమెంట్ జాబ్ చేసేవారికి పోలిక ఎక్కడ అని సెటైర్ వేస్తుంది. దీంతో మీనా బాధపడుతుంది. ఇంతలో సత్యం కలగజేసుకుని ప్రభావతిని అడ్డుకుంటాడు. మీనా పని గురించి చెప్పింది.. స్థాయి గురించి కాదు.. సంబంధం లేకుండా మాట్లాడకు.. కాస్త ఆలోచించి మాట్లాడు అని ప్రభావతిని ఆపుతాడు సత్యం.

మీనాలో అమ్మ కనిపించిందన్న సత్యం..

మీనాలో అమ్మ కనిపించిందన్న సత్యం..
ఆలోచించి మాట్లాడే బుద్ది మనకు ఎక్కడ ఉంది లే అని బాలు కౌంటర్లు వేస్తాడు. నా భార్య చేసిన తప్పులు,అప్పుల్ని సరిదిద్దడానికి వెళ్తున్నాను.. మీ నాన్నలా కాదు.. ప్రభావతి భర్తలా వెళ్తున్నాను అని సత్యం చెబుతాడు. దీంతో బాలు సైలెంట్ అవుతాడు. టైంకి తినండి అని టిఫిన్ బాక్స్ ఇస్తుంది మీనా. మా అమ్మ గుర్తుకు వచ్చిందని సత్యం ఎమోషనల్ అవుతాడు. నేను తప్పా మీకు అందరూ గుర్తుకు వస్తారని ప్రభావతి అంటే.. నేను ఈ రోజు ఉద్యోగానికి వెళ్తున్నానని నీకు తెలుసు.. మరి నా కోసం బాక్స్ రెడీ చేశావా? అని కౌంటర్ వేస్తాడు సత్యం. దీంతో ప్రభావతి తెల్లమొహం వేసుకుని సైలెంట్ అవుతుంది. సత్యం స్కూలుకి, చింటు గాడి కోసం రోహిణి బయల్దేరుతారు. అలా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *