ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను

 ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను

ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను

రోజంతా వేడిని తట్టుకుని కష్టపడి, బట్టలు ఇస్త్రీ చేస్తే 500 కూడా రావు ఈయనకు.. కానీ.. ఐటీ అధికారులు మాత్రం ఏకంగా రూ.598 కోట్లు ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిజంగానే జరిగింది. ఈ ఐటీ నోటీసులు చూసి ఇస్త్రీ చేసే ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అజ్మీర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన జితేంద్ర కుమార్ బడోలియా దుస్తులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 2026 ఏప్రిల్ 1న ఆదాయపు పన్ను శాఖ రూ. 598 కోట్ల నోటీసు జారీ చేసింది. ఆ నోటీసును చూసి జితేంద్ర తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఒక న్యాయవాదిని సంప్రదించాడు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. పాలీకి చెందిన ఒక వ్యాపారవేత్త జితేంద్ర పోగొట్టుకున్న పాన్ కార్డును దుర్వినియోగం చేసి అతడి పేరు మీద వజ్రాల వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. ఆ తర్వాత పాలీకి చెందిన వ్యాపారవేత్త శత్రుఘ్నన్ సింగ్‌పై గంజ్ పోలీస్‌స్టేషన్‌లో జితేంద్ర ఫిర్యాదు చేశాడు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *