నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై హిమయత్‌నగర్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఫిర్యాదు చేశారు.
నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు
ఒడ్డెర కులస్తులకు నోటీసులపై ఆగ్రహం
మేడ్చల్, మే12(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై హిమయత్‌నగర్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఫిర్యాదు చేశారు. ఇవే భూముల్లో 30 నుంచి 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ఒడ్డెర కులస్తులకు మాత్రం నోటీసులు జారీ చేయడం ఏమిటని ఎమ్మెల్యే మర్రి ప్రశ్నించారు.తెలంగాణ వార్తలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేయాలని, ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూదాన్ భూమి సర్వే నంబర్ 537లో ప్రైవేట్ వ్యక్తులు ఇసుక దందా, బస్సుల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. అల్వాల్ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు ఉన్న కొంత మంది అ భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు కోర్టులో స్టే తీసుకువచ్చి ఇంటి నిర్మాణాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కౌకుర్ ప్రాంతంలోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలో అనర్హులు నివసిస్తే విచారణ జరిపి అర్హులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్ గృహకల్ప నివాసంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. నేరేడ్‌మెట్, సీబీఎన్ కాలనీలో కౌకుర్ ప్రాంతంలో వాంబే గృహల శిథిలావస్థలో ఉన్నాయని వాటి మరమ్మతులు చేయాలన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న 6,339 డబుల్‌బెడ్రూం ఇండ్లను మ్యాపింగ్ చేసి అల్వాల్, మల్కాజిగిరి ప్రాంతవాసులకు అందించాలని మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.