రాశిఫలాలు 29 సెప్టెంబర్ 2026: హర్ష యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం!
రాశిఫలాలు 29 సెప్టెంబర్ 2026: హర్ష యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం!
రాశిఫలాలు 29 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వ్యాఘతా, హర్ష, వజ్ర యోగాల ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు స్వర్ణయుగం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
సూర్యదేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మీ సంబంధాలలో మాధుర్యం పెరగొచ్చు. మీ ఆస్తికి సంబంధించి మంచి ప్రయోజనాలు లభించొచ్చు.
మీకు స్నేహితుల మద్దతు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీకు ఆకస్మిక శుభవార్తలు వినిపించొచ్చు. మీకు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి నుంచి ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో నుంచి సంచారం చేస్తున్న కేతువు వల్ల మీ ఇంట్లో వాతావరణం శుభప్రదంగా ఉంటుంది.
ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాముల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో వాదనలకు దూరంగా ఉండాలి.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి ఈరోజు చంద్రుడు పదకొండో స్థానంలో, రెండో స్థా నుంచి గురుడు సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. గురుడి అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
మీకు అప్పుల బాధ నుంచి విముక్తి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. మీకు రుణ భారం తగ్గుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.
పరిహారం : ఈరోజు హనుమాన్ ఆలయంలో సింధూరం సమర్పించాలి.
కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ ఆదాయానికి సంబంధించి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మ ఖర్చులను నియంత్రించుకోవాలి. హనుమాన్ అనుగ్రహంతో మీ ఆరోగ్యం మెరుగవుతంది.
మరోవైపు మీ తోబుట్టువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
సింహ రాశి నుంచి ఈరోజు చంద్రుడు తొమ్మిదో స్థానంలో, శని అష్టమ స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీకు కొన్ని బాధ్యతలు అప్పగించొచ్చు.
మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అవివాహితులు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందొచ్చు.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.
కన్య రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. సప్తమ స్థానంలో శని నివాసం ఉన్నాడు. ఈ రెండు గ్రహాల ప్రభావంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సన్నిహిత మిత్రులతో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు చేసే పనిలో ఆకస్మిక మార్పులు జరగొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభించొచ్చు.
పరిహారం : ఈరోజు దుర్గా చాలీసా పఠించాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల ప్రభావంతో మీకు ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒక కొత్త వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన మరియు సాంకేతిక అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.
ఈరోజు మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి ఈరోజు చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభించనుంది.
మీ బాధ్యతలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. చంద్రుడి ప్రభావంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రతిభకు మంచి అవకాశం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు కొన్ని శుభకార్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయగలరు. మీ మనసు ధార్మిక పనులపై ఎక్కువ ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి చెందిన వారు చాలా కాలంగా కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీరు పని చేసే చోట మంచి వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు.
మీ కళా నైపుణ్యంతో పేరు, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారులకు పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ పొదుపు కూడా పెరుగుతుంది.
పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.
కుంభ రాశికి అధిపతికి అయిన శని దేవుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో రాహువు ఉండటం కారణంగా మీకు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది.
మీరు ప్రత్యర్థులపై పోటీ విజయం సాధించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుంది. మరోవైపు మీరు దానధర్మాల కోసం కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.
మీన రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో అదృష్టం కలిసొస్తుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. పాత వివాదాలన్నీపరిష్కారం అవ్వొచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మీరు చేపట్టిన పనులు సకాలంలోపూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని ప్లాన్ చేస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుది. మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.