Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
Kavitha | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుతోనే పార్టీ నష్టపోయిందని అనడం మీ చేతగానితనానికి నిదర్శనమని.. గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి పెద్దాయన్నే తప్పు పడుతున్నావని టీఆర్ఎస్ చీఫ్ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైరయ్యారు.

- గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్దాయన్నే తప్పు బడుతున్నవ్
- నీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ అధినేత మీద మోపుతున్నవ్
- నేన్ విషనాగుల మాటలు వినా
- రాజకీయాల్లో మీ స్థానమేందో అర్థమైతుందా?
- కేటీఆర్‌పై టీఆర్ఎస్ చీఫ్ కవిత ఫైర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తీరుతోనే పార్టీ నష్టపోయిందని అనడం మీ చేతగానితనానికి నిదర్శనమని.. గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి పెద్దాయన్నే తప్పు పడుతున్నావని టీఆర్ఎస్ చీఫ్ కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై ఫైరయ్యారు. అలా మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. మూడేండ్లుగా కేసీఆర్ బయటకు రాకున్నా ఆయనకు ప్రజల్లో అభిమానం తగ్గలేదన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానమేంటో అర్థమైతుందా అని ఎద్దేవా చేశారు. ఈమేరకు మంగళవారం ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అదే గుంటనక్కతో అంటకాగుతున్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని.. వేరే లీడర్లు వేలు పెట్టొద్దని కేసీఆర్ అనడంతోనే పార్టీ నష్టపోయిందని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీరు మీ పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా?
మీ ఫామ్‌హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు, ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా? నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే “నీ పెండ్లామా? అంత అర్జెంటా? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు. “ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా” అని అమ్మనే అవమానించారు.
బీఆర్ఎస్‌కు గోతి తవ్వుతున్నవ్..
గుంటనక్క మైండ్ గేమ్‌లో బ్లైండ్‌గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్. బీఆర్ఎస్‌కు గోతిని తవ్వుతున్నావ్. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావంటే.. ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?
ఆ గణేష్ మారాజుకే తెల్సు..
నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు. బతిమాలి కేసీఆర్ పాటలు పెట్టిచ్చుకున్నరు. నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతా. నాతో పెట్టుకోకు అని కేటీఆర్‌కు కవిత వార్నింగ్ ఇచ్చారు.