Podarillu Serial Today సెప్టెంబర్ 29 ఎపిసోడ్: మహాలక్ష్మీకి అనుమానం.. ఇంటి మీదకు వచ్చిన గోపిక.. చక్రికి పెరిగిన గుండెదడ

 Podarillu Serial Today సెప్టెంబర్ 29 ఎపిసోడ్: మహాలక్ష్మీకి అనుమానం.. ఇంటి మీదకు వచ్చిన గోపిక.. చక్రికి పెరిగిన గుండెదడ

Podarillu Serial Today సెప్టెంబర్ 29 ఎపిసోడ్: మహాలక్ష్మీకి అనుమానం.. ఇంటి మీదకు వచ్చిన గోపిక.. చక్రికి పెరిగిన గుండెదడ

Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్‌లో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో చక్రి మరింత ఆలోచనల్లో పడిపోతాడు. అసలు చక్రి ఇలా ఎందుకు ఉంటున్నాడు? ఏదో జరిగే ఉంటుందని మహా అనుమానిస్తుంది. ఇక గోపిక బాధ చూడలేక కన్నా గాడు ఆమెని ఇంటి మీదకు తీసుకు వస్తాడు. ఇంటికి వచ్చిన గోపిక ప్రేమ అంటూ చక్రిని మరింతగా ఇరికిస్తుంది. గోపిక నుంచి తప్పించుకునేందుకు చక్రి నానా తంటాలు పడతాడు. ఇక ఇలా అమ్మాయి ఇంటి మీదకు రావడం ఏంటి? అని మాధవ బాధ పడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో అని కంగారు పడుతుంటాడు.
పొదరిల్లు టుడే ఎపిసోడ్
చక్రి డల్‌గా ఉన్నాడని, ఆ గోపికకు ఫోన్ చేయమని కన్నాతో మాట్లాడుతూ కౌంటర్లు వేస్తుంది మహా. ఒక్క రోజు కనిపించకపోతే.. ఒక్క రోజు మాట్లాడకపోతే ఎలా అయిపోతోన్నాడో అని చక్రి మీద మహా సెటైర్లు వేస్తుంది. అందుకు కాదండి అని చక్రి అంటాడు. మరి ఎందుకు అండి అని మహా అడుగుతుంది. ఇంతలో మనీషా చేసిన స్వీట్‌ను అందరికీ పెడతాడు పెద్ది. ఇది కొన్న వాటిలా లేదే.. చేసిన వాటిలానే ఉంది.. ఎవరు ఇచ్చారు అని కన్నా అడుగుతాడు. మనీషా అని మాధవ చెప్తాడు. అంటే రోజూ అత్తగారింటికి వెళ్తున్నావా? అని కన్నా, కేశవ కౌంటర్లు వేస్తారు. నేను వెళ్లలేదు.. తనే వచ్చింది అని పెద్ది అంటాడు. మరి తిరిగి ఎలా వెళ్లిందని మహా అడుగుతుంది. రాత్రి అవుతుంది కదా.. అని నేనే సైకిల్ మీద డ్రాప్ చేశా అని అంటాడు పెద్ది. ఈ సైకిల్ మీదే? అని మహా అడిగితే.. నాకేమైనా బైక్, కారు ఉందా? అని మాధవ అంటాడు. కావాలంటే మావి తీసుకుని లాంగ్ డ్రైవ్‌కి వెళ్లు అన్నయ్య అని కేశవ కామెడీ చేస్తాడు. వీళ్లది లాంగ్ డ్రైవ్ వరకు వెళ్లిందని మహా కామెడీ చేస్తుంది. ఇంతలో కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే.. టీకే టీకే అని మాట్లాడుతుంటాడు పెద్ది. ఇక కన్నా, కేశవ, మహా కూడా టీకే అని పెద్దిని ఏడ్పిస్తుంటారు. కానీ చక్రి మాత్రం వేరే లోకంలో ఉండిపోతాడు. ఇలా ఎందుకు ఉంటున్నాడు? అని మహాకి అనుమానం వస్తుంది.

ఇంటికి వచ్చిన సత్య..

గోపిక కోసం సత్య నేరుగా ఇంటికి వస్తుంది. ఏంటి.. మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని సత్యను చక్రి అడుగుతాడు. నువ్వు చేసిన వాటికి రావాల్సి వచ్చింది.. గోపిక అక్కడ బాద పడుతోంది.. అది అసలే సెన్సిటివ్.. దాని ఫోన్స్ ఎందుకు ఎత్తడం లేదు.. ఎందుకు మాట్లాాడటం లేదు.. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు.. ఎందుకు మోసం చేస్తున్నావ్ అని సత్య అంటుంది. ప్రేమ అని ఆమె పేరు పెట్టింది.. ఇప్పుడు మీరు మోసం అని ఇంకో పేరు పెడుతున్నారా? అని చక్రి అంటాడు. అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్లండని అంటాడు.

వెళ్లమని చెప్పిన కేశవ..
వెళ్లమని చెప్పిన కేశవ..

ఈ గొడవని కేశవ వింటాడు. వచ్చి మాట్లాడతాడు. ఏం ఉన్నా రేపు ఉదయం మాట్లాడుకోండి.. ఇప్పుడు కాదు.. అని అంటాడు కేశవ. ఇప్పుడు తనతో మాట్లాడిస్తా అని చెప్పి వచ్చా.. ఎలా వెళ్లాలి అని సత్య అంటుంది. రేపు నేరుగా వచ్చి మాట్లాడతాడు.. ఇప్పుడు మీరు వెళ్లండి అని అంటాడు కేశవ. రేయ్ ఏంట్రా ఇది.. ఇంటికి మీదకు తీసుకు వచ్చావ్.. అని చక్రిని తిడతాడు కేశవ. నేను కూడా ఇంతలా అవుతుందని అనుకోలేదు.. మహాని ఉడికించాలని చూస్తే.. ఇది నా మెడకే చుట్టుకునేలా ఉంది రా అని చక్రి కంగారు పడతాడు.

పరధ్యానంలో చక్రి..

నారాయణకి కాస్త జ్వరం తగ్గడంతో హుషారుగా ఉంటాడు. టెంపరేచర్ చెక్ చేసి బాగానే ఉందని అంటుంది మహా. బాగానే ఉంది కదా అని బార్‌కి వెళ్తే దెబ్బలు పడతాయ్ అని మహా బెదిరిస్తుంది. ఇంట్లో అంతా సందడిగా ఉంటే మాత్రం చక్రి సైలెంట్‌గానే ఉంటాడు. ఇక పెద్ది వద్దకు వెళ్లి కిచెన్‌లో ముచ్చట్లు పెడుతుంటుంది మహా. మనీషా మ్యాటర్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది మహా. కానీ హాల్లో మాత్రం చక్రి కంగారు పడుతూ ఉంటాడు. గోపిక ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. దీంతో చక్రికి పిచ్చెక్కుతూ ఉంటుంది.

చక్రి మీద ఓ కన్నేసిన మహా..

అందరూ సంతోషంగా ఉంటే ఇతను ఎందుకు ఇలా ఉంటున్నాడు.. ఏం జరిగి ఉంటుందని పెద్దితో మాట్లాడుతూనే మధ్యలో చక్రి వైపు చూసుకుంటూ తనలో తాను అనుకుంటుంది మహా. ఇక పెద్దికి కూడా ఏదో డౌట్ వస్తుంది. వీడు ఎందుకు ఇలా ఉంటున్నాడు.. రేయ్ ఓంకారేశ్వర్ ఫోన్ చేశాడు.. నీ ఫోన్ కలవడం లేదు అట.. తిడుతున్నాడు.. ఓసారి ఆఫీసుకి వెళ్లి రా అని అంటాడు పెద్ది. సరే అన్నయ్య అని చక్రి అంటాడు. చక్రి అక్కడే ఫోన్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. దీంతో ఆ ఫోన్‌ని చెక్ చేస్తుంది మహా.

మహాకి అనుమానం..

మహాకి అనుమానం..

ఏంటి గోపిక 17 సార్లు చేసిందని మహా అడిగితే.. 17 సార్లు మాట్లాడాలని అనిపించిందేమో అని చక్రి అంటాడు. మరి మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని మహా అడిగితే.. మిమ్మల్ని ఆట పట్టించాలని చూస్తే ఇప్పుడు నా మెడకే చుట్టుకుందని చెప్పాలా? అని మనసులో అనుకుంటాడు చక్రి. ఏం లేదు లేండి అని ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి డల్‌గా వెళ్లిపోతాడు చక్రి. ఏదో జరుగుతోంది అని మహా అనుమానిస్తుంది. ఇక బస్టాండ్‌లో చక్రి కోసం గోపిక, సత్య ఎదురు చూస్తూ ఉంటారు.

ఎదురు చూసిన గోపిక..

ఆయన ఇంకా రావడం లేదేంటే.. అని గోపిక కంగారు పడుతుంటుంది. వస్తాడని ఇంకా అనుకుంటున్నావా? నిన్ను లవ్ చేయడం లేదు.. టైం పాస్ చేశాడే అని సత్య అంటుంది. లేదు.. వస్తాడు.. నా కోసం వస్తాడు అని గోపిక పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మహా, కన్నా వస్తారు. అదిగో వాళ్లు వచ్చారు.. వెనకాలే ఆయన కూడా వస్తాడు అని గోపిక అంటుంది. మరి వాళ్లని అడిగి రావాలా? అసలే కాలేజ్‌కి లేట్ అవుతోంది అని సత్య అంటుంది. కాలేజీకి నువ్వు వెళ్లు.. నేను వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం కనుక్కుంటా అని గోపిక అంటుంది.

కన్నాని బతిమిలాడిన గోపిక..
కన్నాని బతిమిలాడిన గోపిక..

మహా, కన్నా వద్దకు గోపిక వస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చెప్పాను కదా.. నేను అత్త అవుతాను అని మళ్లీ ఏం అడగడానికి వచ్చావ్ అని మహా అంటుంది. నేను మీ రిలేషన్ అడిగేందుకు రాలేదు.. ఆయన ఎక్కడ ఉన్నాడు.. అని గోపిక అడుగుతుంది. మాకేం తెలుసు.. నువ్వే ఫోన్ చేసి కనుక్కో.. నేను వెళ్తున్నాను రా కన్నా అని చెప్పి అక్కడి నుంచి మహా వెళ్లిపోతుంది. ఇక కన్నాని గోపిక బతిమిలాడుతుంది. ఈ మ్యాటర్ ఈ రోజుతో తెగిపోవాలని కన్నా కూడా గోపికను ఇంటికి తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతాడు.

ఇంట్లో చూసి షాక్..

ఎందుకు రా డల్‌గా ఉంటున్నావ్ అని చక్రిని పెద్ది అడుగుతుంటాడు. గోపిక, కన్నాని చూసి.. ఏంట్రా ఇది ఎవర్రా ఈ అమ్మాయి అని నారాయణ కంగారు పడతాడు. ష్ అని కన్నా అంటాడు. వీడేంటి ష్ అని అమ్మాయిని లోపలకు తీసుకు వెళ్తున్నాడు అని నారాయణ షాక్ అవుతాడు. ఇక గోపికను అలా ఇంట్లో చూడటంతో చక్రి షాక్ అవుతాడు. ఎవర్రా ఈ అమ్మాయి అని కన్నా, కేశవలను పెద్ది సైలెంట్‌గా అడుగుతాడు. ఎందుకు ఇంటికి వచ్చావ్ అని చక్రి అంటే.. మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. అవాయిడ్ చేస్తున్నారు.. మాట్లాడటం లేదు కదా అని గోపిక అంటుంది.

ఎందుకు రా తీసుకు వచ్చావ్..

ఎందుకు రా తీసుకు వచ్చావ్..

పక్కకు వెళ్లి మాట్లాడదాం పదా అని గోపికను అలా సైడ్‌కి తీసుకు వెళ్తాడు చక్రి. వీడేంట్రా ఇలా చేస్తున్నాడు అని పెద్ది కంగారు పడతాడు. మహా లక్ష్మీని ఉడికించాలని చేశాడు.. చివరకు ఇలా బెడిసి కొట్టిందని కేశవ అంటాడు. ఇది మహాకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని పెద్ది అంటే.. తెలుసు అన్నయ్య అని కేశవ అంటాడు. అసలు ఎందుకు రా అమ్మాయిని ఇక్కడకు తీసుకు వచ్చావ్ అని కన్నాని కేశవ అంటే.. ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోవాలని తీసుకు వచ్చా అని కన్నా అంటాడు.

నేనేమీ చిన్న పిల్లని కాదు..

నన్ను ఎంతో మంది ప్రేమించారు.. వెంట పడ్డారు.. వాళ్లందరికీ నో చెప్పా.. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను అని గోపిక అంటుంది. నేను మిమ్మల్ని చిన్న పిల్లలానే చూశా.. ప్రేమ అనే ఉద్దేశంతో చూడలేదు అని అంటాడు చక్రి. కానీ గోపిక మాత్రం వినిపించుకోదు. చిన్న పిల్లలానే మాట్లాడుతుంది. నేను చిన్న పిల్లని కాదు.. పెద్ద మనిషి అయి చాలా ఏళ్లు అవుతోంది.. నా వయసు వాళ్లు ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటున్నారు అని గోపిక అంటుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అని చక్రి రిక్వెస్ట్ చేస్తుంటాడు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

‘పొదరిల్లు’ సీరియల్ నేటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పంచుకోండి.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *