Gundeninda Gudigantalu Serial Today సెప్టెంబర్ 29 ఎపిసోడ్: చింతామణి ఇంట్లో డబ్బు లభ్యం.. మీనా ఆనందభాష్పాలు.. చింతావతి అంటూ నిజం చెప్పిన బాలు
Gundeninda Gudigantalu Serial Today సెప్టెంబర్ 29 ఎపిసోడ్: చింతామణి ఇంట్లో డబ్బు లభ్యం.. మీనా ఆనందభాష్పాలు.. చింతావతి అంటూ నిజం చెప్పిన బాలు
Gundeninda Gudigantalu Serial Today Episode చింతామణి ఇంటికి ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు అంటూ రైడ్‌కి వెళ్తాడు బాలు అండ్ కో. ఇక ఇంట్లో అంతా వెతికి చివరకు మీనా డబ్బుల్ని కనుక్కుంటారు. ఆ డబ్బులు తీసుకుని వెళ్తున్న టైంలో శ్రుతి ఇరుక్కుంటుంంది. శ్రుతిని చింతామణి చూస్తుంది. కానీ అంతగా గుర్తు పట్టదు. అయినా అప్పటికే కడుపునొప్పితో ఉన్న చింతామణి ఆ మ్యాటర్‌ని పట్టించుకోదు. ఇక డబ్బులు దొరికాయ్ అన్న వార్త తెలియడంతో మీనా సంతోషిస్తుంది. దీనంతటికి కారణం మన చింతావతి అమ్మే కారణం అని బాలు అంటాడు.

రేయ్ ట్యాబ్లెట్‌కి తప్పా ఒక్క రూపాయి ఎక్కువ స్కాన్ చేసినా నీకు ఉంటది రా అని చింతామణి అంటుంది. నేను నీలా అడ్డమైన పప్పు తిన్నానా? నాకు ఏం అవసరం లేదు లే అని అంటాడు అసిస్టెంట్. కాస్త త్వరగా పోనివ్వు రా అని చింతామణి అంటే.. వాడు కావాలనే ఇంకా స్లో చేస్తాడు. రేయ్ ఏంట్రా స్లో చేస్తున్నావ్.. ఫాస్ట్‌గా పోనివ్వు అని తిడుతుంది చింతామణి. మధ్యలో ఆపమంటారా? అని అడిగితే.. మూసుకుని త్వరగా ఇంటికి పోనివ్వు రా అని అంటుంది చింతామణి. అక్కడేమో బాలు అండ్ టీం ఇంట్లో సోదాలు చేస్తూ ఉంటుంది.
చింతామణి రూంలో అందరూ తలో దిక్కున వెతుకుతారు. ఇక దిండులో తాళాల్ని కనిపెడతాడు రవి. యాహూ దొరికాయ్ అని అరిచేస్తాడు రవి. ఏంట్రా ఐదు లక్షలు దొరికాయా? అని బాలు అంటే.. లాకర్ తాళాలు దొరికాయ్ అని చెప్తాడు. దీంతో లాకర్‌ని తెరుస్తాడు బాలు. ముందుగా నగల లాకర్ వస్తుంది. ఆ తర్వాత డబ్బుల లాకర్ వస్తుంది. అందులో మీనా డబ్బులుంటాయి. అదే కవర్‌లో అదే డబ్బుని పెట్టి ఉంటుంది. ఇది మీనా డబ్బే అని బాలు వాటిని తీసుకుని వస్తాడు. మీ వల్లే సాధ్యమైందని శ్రుతి, రవి, రాజేష్‌కి బాలు థాంక్స్ చెప్తాడు.
అందరూ కిందకు వస్తారు. అదే టైంలో చింతామణి కారు వస్తుంది. అమ్మో చింతామణి వచ్చినట్టుంది అని రవి కంగారు పడతాడు. ఈ ఇంటికి ఇంకో దారి ఉందా? అని రాజేష్ అడిగితే.. వంటగదిలోంచి వెళ్లొచ్చు అని చెప్తాడు అసిస్టెంట్. థాంక్స్ అని అందరూ అటు వైపు నుంచి పరుగులు పెడతారు. కానీ శ్రుతి మాత్రం అక్కడే చిక్కుకుంటుంది. ఇక శ్రుతిని పట్టించుకోకుండా బాలు, రవి, రాజేష్ పరుగులు పెడతారు. శ్రుతిని చింతామణి చూసినా అంతగా గుర్తు పట్టదు. చింతి అని పిలిచి శ్రుతి పరుగులు పెడుతుంది. ఇది మీనా మనిషి కదా అని చింతామణి అంటుంది. ఇంకో వైపు శ్రుతి రావడం లేదు అని రవి కంగారు పడతాడు.
రవి, శ్రుతి కామెడీ..
కంగారు పడకు.. అయిపోయింది లే ఇంటికి వెళ్తున్నాం కదా అని శ్రుతి అంటుంది. నీ కోసం చాలానే కంగారు పడ్డాడు.. భార్య మీద బాగానే ప్రేమ ఉందని రాజేష్ అంటాడు. ప్రేమ కాదు.. భయం.. ఇది దొరికిపోతే.. నాలుగు దెబ్బలు పడితే.. మన పేరు చెప్తుంది కదా అని రవి అంటాడు. దీంతో శ్రుతి కోపంగా చూస్తుంది. మన ఐడీ కార్డులు తీసి పడేయండని బాలు అంటే.. వద్దు అని శ్రుతి అంటుంది. వాటితో పాటుగా ఈ రవి గాడ్ని కూడా పడేయండని అంటుంది శ్రుతి.
డబ్బులు దొరికాయ్ అన్న మ్యాటర్‌ని ముందు మీనాకి చెప్పాలని బాలు అనుకుంటాడు. వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు. ప్లాన్ సక్సెస్.. అని బాలు అంటాడు. దీంతో మీనా సంబర పడుతుంది. ఎవ్వరూ దొరకలేదు కదా అని మీనా అంటే.. ఎవ్వరూ దొరకలేదు.. అందరం సేఫ్ నీ డబ్బులు కూడా అదే కవర్‌లో ఉన్నాయ్ అని బాలు చెప్తాడు. ఆ మాటలకు మీనా ఆనంద భాష్పాల్ని రాల్చుతుంది. ఏడుస్తున్నావా మీనా అని బాలు అంటే.. అది కన్నీరు కాదు.. ఆనంద భాష్పాలు అని శ్రుతి అంటుంది.
చింతావతి అని పిలిచిన బాలు..
ఇంటికి వచ్చిన బాలు అందరినీ పిలుస్తాడు. ఏంట్రా డ్రైవర్ కాస్తా ఆఫీసర్లుగా మారావ్ అని అంటుంది ప్రభావతి. అవును ఇది కరెక్ట్‌గా చెప్పావ్.. ఇన్ కం ట్యాక్స్ రైడ్‌కి వెళ్లాం అని బాలు అంటాడు. ఇన్ కం ట్యాక్సా? నేనేం దాచి పెట్టలేదు.. నా దగ్గరేం లేదు అని మనోజ్ కంగారు పడతాడు. రేయ్ నిజమైన రైడ్ కాదు రా.. అని బాలు అంటాడు. చింతావతి.. అని పిలుస్తాడు బాలు. చింతావతి ఏంట్రా నా పేరు ప్రభావతి అని అంటుంది. సగం చింతామణిలా ప్రవర్తిస్తున్నావ్ కదా అని అంటాడు బాలు.
మీనా దగ్గర్నుంచి ఆ చింతామణి కొట్టేసిన డబ్బుని.. నేను తీసుకు వచ్చా అని బాలు అంటాడు. ఆ దేవుడు నా కోడలి ప్రార్థనను విన్నాడు.. కష్టార్జితం ఎక్కడికి పోదు అని సత్యం అంటాడు. నా ప్రార్థన మొదటగా విన్నది మీ అబ్బాయే.. దానికి ఆ దేవుడు తోడున్నాడు.. మీ నా భర్తే నాకు అండగా నిలిచాడు.. ఈ డబ్బు తీసుకు వచ్చాడు అని మీనా సంబర పడుతుంది. మళ్లీ ఆనంద భాష్పాలా? అని శ్రుతి అంటుంది. అసలు ఏం జరిగిందో కాస్త చెప్పు రా అని సత్యం అడుగుతాడు.
మీనా నుంచి డబ్బులు కాజేసింది దొంగలు కాదు.. ఆ చింతామణి మనుషులు.. అసలు మీనా ఈ ఇంట్లోంచి డబ్బులతో వెళ్తోంది అని అమ్మకి మాత్రమే తెలుసు అని బాలు అంటాడు. మీరే ఆ విషయాన్ని చెప్పారు కదా అని మీనా అంటే.. నాకేం తెలీదు అని దాట వేస్తుంది ప్రభావతి. పోలీసుల వరకు వెళ్లి ఉంటే.. కాల్ డాటా బయటకు వచ్చేది అని బాలు అనడంతో ప్రభావతి భయపడుతుంది. నాక్కూడా అనుమానంగానే ఉంది.. అలాంటి వాళ్లతో నీకు స్నేహం ఏంటి అని ప్రభావతిని సత్యం తిడతాడు.
ఇదే టైం.. అత్తయ్యకి అనుకూలంగా మాట్లాడదాం అని రోహిణి మధ్యలోకి దూరుతుంది. అందరూ అత్తయ్యని ఎందుకు నిందిస్తున్నారు అని రోహిణి అంటుంది. వచ్చింది చిలక పలుకులు పలికేందుకు నువ్వు ఇలా మాట్లాడితే.. నిన్ను దగ్గరకు తీస్తానని అనుకుంటున్నావా? అని ప్రభావతి తిడుతుంది. దీంతో రోహిణి ఛ అని అనుకుంటుంది. ఆ మాటలకు శ్రుతి నవ్వేస్తుంది. ఇక చింతామణి ఇంట్లోంచి డబ్బు ఎలా తిరిగి తెచ్చుకున్నారో అంతా క్లియర్‌గా చెప్తాడు బాలు. అదంతా విని ప్రభావతి, సత్యం, మనోజ్, రోహిణి షాక్ అవుతారు. అమ్మో అని ప్రభావతి ఆశ్చర్యపోతోంది.
మీరు చేసింది పెద్ద క్రైమ్ అని మనోజ్ అంటాడు. మీరు చేసిన దాని కంటే పెద్ద క్రైమ్ ఏమీ కాదు రా అని బాలు అంటాడు. ఇక ఆ డబ్బుల్ని పూజ గదిలో పెట్టి వస్తుంది మీనా. మరో వైపు చింతామణి అసలు విషయం తెలుసుకుంటుంది. ఇక కంగారు పడుతున్న చింతామణికి మీనా ఫోన్ చేస్తుంది. మీనా అని తెలిసినా.. ఎవరు అని అడుగుతుంది. నేను అని మీనా అంటే.. నేను అంటే.. ఎవరు అని చింతామణి అడుగుతుంది. ఈపాటికే నేను అంటే ఏంటో నీకు తెలిసే ఉంటుందని అంటుంది మీనా. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.