రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: సిద్ధి యోగం వేళ కర్కాటకం, మకరం సహా ఈ 5 రాశులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం!

 రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: సిద్ధి యోగం వేళ కర్కాటకం, మకరం సహా ఈ 5 రాశులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం!

రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: సిద్ధి యోగం వేళ కర్కాటకం, మకరం సహా ఈ 5 రాశులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం!

రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సిద్ధి, గౌరీ యోగాల ప్రభావంతో మకరం సహా ఈ 5 రాశులకు శ్రీవిష్ణుమూర్తి అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధి, గౌరీ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శ్రీ మహా విష్ణువుకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తూ హంస రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీంతో పాటు గౌరీ యోం కూడా ఏర్పడనుంది. అంతేకాదు తులా రాశిలో శుక్రుడు, బుధుడు సంచారం చేయనున్నారు. ఈ శుభ సమయంలో కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

​మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి నుంచి అక్టోబర్ 1వ తేదీన కుజుడు నాలుగో స్థానంలో మరియు చంద్రుడు రెండో స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది.

మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనుల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు ఎలాంటి విషయాల్లోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

పరిహారం : ఈరోజు శ్రీ విష్ణు చాలీసా పఠించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడి సంచారం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. వారి అండతో మీ పనులన్నీ సులభంగా పూర్తి చేయొచ్చు.

చంద్రుడి అనుగ్రహంతో మీకు కళాత్మక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి శుక్రుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నందున ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఈరోజు శ్రీ విష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి.

 

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారికి ఈరోజు శుక్రుడు, బుధుడి అనుగ్రహంతో కుటుంబ జీవితం పరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఒక బంధువుకు లేదా స్నేహితునికి సహాయం చేయాల్సి రావొచ్చు. మరోవైపు ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు మీ పనిలో చాలా ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగి కారణంగా కొంత మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగ ఉండాలి. పంచమ భావానికి అధిపతి బుధుడు కావడం వల్ల, పిల్లల నుండి ఆనందం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు పేదలకు దానధర్మాలు చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది, ఎందుకంటే చంద్రుడు ఉచ్చ రాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాదు మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

మీ వైవాహిక జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పరిమితంగానే ఉంటుంది. మీరు అకౌంటింగ్ మరియు బ్యాంకింగ్ సంబంధిత పనులలో మంచి విజయం సాధించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు సూర్యుడి అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభించొచ్చు. మీ తెలివైన మాటలతో దౌత్యపరంగా విజయం సాధిస్తారు. మీ పనులను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

మీ ఆదాయం, ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్న స్థానంలో కేతువు ఉండటం కారణంగా మీ మనసులో కొంత గందరగోళం ఉండొచ్చు. కాబట్టి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్నవారిని సంప్రదించాలి.

పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసి రావొచ్చు. చంద్రడు, సూర్యుడు కలిసి ఈ రాశి నుంచి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనన్నారు. ఈ రాశికి అధిపతిగా ఉండే బుధుడు రెండో స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు.

ఈ సమయంలో మీకు కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. పాతలావాదేవీలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు విష్ణువు ఆలయంలో దానధర్మాలు చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు చంద్రుడి ప్రభావంతో కొంత గందరగోళంగా ఉంటుంది. మీకు మానసిక ఒత్తిడి పెరగొచ్చు. అయితే శుక్రుడు, బుధ గ్రహాల ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించొచ్చు.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోవాలి.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.ఈ రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో, కుజ, గురు గ్రహాలు అదృష్ట స్థానంలో ప్రవేశించనున్నాయి. అంతేకాదు నీచభంగ రాజయోగం వల్ల మీకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.

మీరు చేసే పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులకు స్నేహితులు మరియు సహోద్యోగుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. మీకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభించొచ్చు.

పరిహారం : ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి నుంచి చంద్రుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా మీకు కొన్ని విషయాల్లో గందరగోళంగా అనిపించొచ్చు. మీ మనసులో కూడా ప్రతికూల భావాలు తలెత్తుతాయి.

ఈ రాశికి అధిపతిగా ఉండే గురుడు, కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల చిన్న విషయాలకే కోపం రావొచ్చు. ఈరోజు మీరు చాలా సంయమనంతో వ్యవహరించాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావొచ్చు. మరోవైపు శుక్రుడు,బుధుడు అనుకూలంగా ఉండటంతో మీ వ్యాపారం మెరుగుపడొచ్చు.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి చంద్రుడు పంచమ భావంలో, గురు, కుజ ద్రుష్టి సప్తమ స్థానంలో ఉంది. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో పురోగతి లభించొచ్చు.

ఉద్యోగులకు కార్యాలయంలో మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ పిల్లల విజయం సాధించడంతో సంతోషిస్తారు. మీ ప్రేమ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు విష్ణు మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో రాహువు, నాలుగో స్థానంలో చంద్రుడు సంచారం చేయడం కారణంగా మీకు పనిలో కొత్త అవకాశాలు రావొచ్చు. మీ కుటుంబంతో కలిసి ఒక విహారయాత్రకు ప్లాన్ చేస్తారు.

మీకు బంధువులు మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీరు ఆశించిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రావొచ్చు.
ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయం పాటించాల్సి ఉంటుంది. కొందరు ప్రత్యర్థులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం కారణంగా పాత సమస్య కొంత ఇబ్బంది పెట్టొచ్చు.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *