CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సిరిసిల్ల ఓటర్లను సొమ్ముగా చేసుకుని కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయాలు సంపాదించుకున్నారని సీఎం పేర్కొన్నారు.

కార్మికుల కన్నీళ్లకు కేటీఆరే కారణం
గల్ఫ్ కార్మికులను ఆదుకోలేదు
ఓటర్లను సొమ్ముగా చేసుకోని వేల కోట్లు సంపాదించారు
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సిరిసిల్ల ఓటర్లను సొమ్ముగా చేసుకుని కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయాలు సంపాదించుకున్నారని సీఎం పేర్కొన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
చెరసాల పేరు నుంచి సిరిసిల్ల ఏర్పాటైందని పెద్దలు చెబుతుంటారు. సిరిసిల్ల అంటే సిరులకు నియలమని అర్థం. కానీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. సిరిసిల్ల అంటే కార్మికుల కన్నీళ్లు, మగ్గం చప్పుళ్లు, సంఘాల ఆందోళనలు అనేక సామాజిక మస్యలకు నిలయంగా మారిపోయింది.. మారిపోయింది అనడం కంటే మార్చేశారు అనడం కరెక్ట్ అని సీఎం పేర్కొన్నారు.
మనిషి నాగరికతకు మొదటి అడుగు వస్త్రం. వస్త్రాలు ధరించడంతోనే మనిషి నాగరికత ప్రస్థానం ప్రారంభమైంది. అలాంటి వస్త్ర పరిశ్రమలకు అసలైన చిరునామా సిరిసిల్ల, మగ్గాల నుంచి సాంచాల వరకు వేలాది కుటుంబాలు ఈ సిరిసిల్లలో చేనేత పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ సిరిసిల్ల చేనేత కార్మికులకు, చేతి వృత్తులకు, వృత్తి నైపుణ్యానికి పెట్టింది పేరు అని సీఎం తెలిపారు.
2009 ఎన్నికలు అందరికీ తెలుసు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరుతాయని పెద్దలు చెప్పారు. పాపారావు, కేకే మహేందర్ రెడ్డి తండాల్లో ప్రతి గ్రామంలో ప్రతి గుండెకు చేరుకుని, తెలంగాణ ఉద్యమానికి వేదికగా తీర్చిదిద్దారు. 2009 ఎన్నికల్లో న్యాయంగా పార్టీ టికెట్ కేకే మహేందర్ రెడ్డికి ఇస్తే 50 వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉండే. కానీ కసాయి అయిన కేసీఆర్ కేటీఆర్‌ను దిగుమతి చేసి టికెట్ ఇస్తే స్వల్ప తేడాతో గెలిచారు కేటీఆర్. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్నాడు. వందల ఎకరాల ఫామ్ హౌజ్‌లను నిర్మించుకున్నారు. ఆనాడు నిజాంకు పేరుంటే.. ఈనాడు కేటీఆర్ సిరిసిల్ల ఓటర్లను సొమ్ముగా మార్చుకుని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు అని సీఎం నిప్పులు చెరిగారు.
2009 నుంచి 2026 మధ్య జరిగిన ఎన్నికల్లో కేటీఆర్‌ను గెలిపించారు కదా. మరి ఈ ప్రాంత కార్మికుల ఆత్మహత్యలు ఆపలేకపోయారు కేటీఆర్. గల్ఫ్ వలసలను ఎందుకు ఆపలేకపోయారు. కుటుంబాన్ని పోషించడానికి ఆత్మగౌరవంతో బతకడానికి జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గల్ఫ్‌కు వలసపోతే ఉపాధి అవకాశాలు దొరక్కపోతే, గ్రామానికి రాలేక, అక్కడ బతకలేక అక్రమ కేసుల్లో ఇరుక్కుంటే అనుకోకుండా అసువులు బాస్తే శవాలు తెచ్చేందుకు కూడా కనికరించలేదు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.