ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్

 ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్

ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌.. తెలంగాణ హైకోర్టు సీరియస్

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల పేరుతో వాహనాలను సీజ్‌ చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదా అని అధికారులకు ప్రశ్నలు వేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 19కు వాయిదా వేసింది.

Traffic Challans
ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌
రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో చలాన్లు పెండింగ్ ఉన్నాయనే కారణంతో వాహనాలను స్వాధీనం చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్ చేయొద్దని ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. వాటిని లెక్క చేయకుండా పోలీసులు ఇప్పటికీ వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను సీజ్ చేస్తూ.. ఈ వ్యవహారంపై ఒక బాధితుడు తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్‌లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వైఫల్యంపై హైకోర్టు వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన.. తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో చలాన్ల వసూళ్ల పేరుతో వాహనదారులను ఇబ్బంది పెడుతున్న సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *