రాశిఫలాలు 02 మే 2026: ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 4 రాశులకు శని దేవుని ఆశీస్సులు
రాశిఫలాలు 02 మే 2026: ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 4 రాశులకు శని దేవుని ఆశీస్సులు
horoscope today 02 May 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం, శని దేవుని ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel May2
horoscope today 30 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు త్రిగ్రాహి యోగం, వరియన్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు ప్రస్తుతం పాప గ్రహాలతో కలిసి ఉన్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి నిరాశ కలిగించే వార్తలు వినొచ్చు. ఈ సాయంత్రం పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. ప్రభుత్వం, అధికారంలో ఉన్న వారితో పొత్తు కారణంగా మంచి ప్రయోజనాలు లభించొచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరగొచ్చు. ఈ రాత్రి కొందరు ఇబ్బందికరమైన వ్యక్తులను కలవడం వల్ల అనవసరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ పిల్లల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు బుధుడి ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆందోళన కారణంగా మీరు కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలున్నాయి. మీ పిల్లలు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. మీరు ఊహించిన విధంగా లాభాలు రావొచ్చు. దీంతో మీరు సంతోషిస్తారు.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల పట్ల మీ బాధ్యతలు నెరవేరొచ్చు. మీ ప్రయాణాలు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రియమైన వారిని కలుసుకుంటారు. అంతేకాదు కొన్ని శుభవార్తలు వింటారు.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు సూర్యుని ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. సూర్య దేవుడు తన స్నేహాపూర్వక గ్రహాల మధ్య సంచారం చేయడం కారణంగా మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీరు గణనీయమైన విజయాలు సాధించొచ్చు. అంతేకాదు మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశాలున్నాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వ్యక్తులు నిరంతరం ప్రయత్నాలు చేయడం కారణంగా అద్భుత విజయాలు సాధించొచ్చు. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కోర్టు సంబంధిత కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది..
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. ఈరోజు మీ ప్రత్యర్థులపై మంచి విజయం సాధించొచ్చు. పనికి సంబంధించి చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలొస్తాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈ రాశి నుంచి పదకొండు, పన్నెండో స్థానంలో ఏర్పడే త్రిగ్రాహి సంయోగం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపపడుతుంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మంచి విజయం సాధించొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని దేవుని అనుగ్రహంతో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఈరోజు మీరు ఆకస్మిక ప్రయాణం చేయొచ్చు. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారుల కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శన, దానధర్మాల కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు. ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గురు గ్రహ త్రికోణ సంయోగం కారణంగా మీరు కొన్ని విలువైన వస్తువులను కోల్పోవాల్సి రావొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.