Gundeninda Gudigantalu Today మే 15 ఎపిసోడ్: ప్రభావతి కాళ్లు పట్టుకున్న రోహిణి.. బాలు నిర్ణయంతో మీనా, శ్రుతి, రవి ఫుల్ ఖుష్.. నోరు ఎత్తని మనోజ్

 Gundeninda Gudigantalu Today మే 15 ఎపిసోడ్: ప్రభావతి కాళ్లు పట్టుకున్న రోహిణి.. బాలు నిర్ణయంతో మీనా, శ్రుతి, రవి ఫుల్ ఖుష్.. నోరు ఎత్తని మనోజ్

Gundeninda Gudigantalu Serial 2026 May 15th Episode Preview గుండెనిండా గుడిగంటలు శుక్రవారం నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. రోహిణి అందరి ముందే ప్రభావతి కాళ్లు పట్టుకుంది. ఇక షాప్‌కి ఓనర్ నాన్న, మేనేజర్‌గా ఉండి మనోజ్ అన్ని పనులు చూసుకోవాలని బాలు తీర్పు ఇస్తాడు. దీంతో రోహిణికి కడుపు మండిపోతుంది. రూంలోకి వెళ్లిన తరువాత మనోజ్‌కి బ్రెయిన్ వాష్ చేస్తూ ఎడా పెడా తిట్టేస్తుంది. మరి షాప్ ఓనర్‌గా సత్యం ఉంటాడా? లేదా? అన్నది చూడాలి.

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
మనోజ్, రోహిణి విషయంలో ప్రభావతి ప్రవర్తిస్తున్న తీరు తప్పు అని సత్యం నిలదీస్తాడు. కానీ ప్రభావతి మాత్రం తన మాట మీదే ఉంటుంది. నేను ఇష్టపడి మనోజ్, రోహిణి పెళ్లి చేశాను.. వారిద్దరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని నాకు ఉండదా.. రోహిణిని ఎంత నమ్మాను.. కానీ అది నన్ను మోసం చేసింది.. అది నేను తట్టుకోలేకపోతోన్నాను.. ఈ విషయంలో ఎవ్వరు ఏం చేసినా కూడా నేను మారను అని ప్రభావతి అంటుంది. ఇక మరో వైపు విద్య ఇంట్లో రోహిణి కన్నీరు పెడుతూ ఉంటుంది. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. సత్యం అన్న మాటలు, ప్రభావతి కొట్టిన కొట్టుడు, తిట్టిన తిట్లు ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ వలవలా ఏడ్చేస్తుంటుంది. ఎందుకే అలా ఏడుస్తున్నావ్.. జరిగిందేదో జరిగింది.. వదిలేయ్ అని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది విద్య. కానీ రోహిణి మాత్రం ఎమోషనల్ అవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు.. ఇంతలా అవమానపడతానని అనుకోలేదంటూ రోహిణి ఏడ్చేస్తుంది. నువ్వు ఎన్నో చేశావ్.. ఈ కల్పన విషయంలో దొరికిపోయావ్.. ఇంకా నీ చింటు, మలేషియా మ్యాటర్ తెలిస్తే నీ గతి ఏంటో అని విద్య అంటుంది.

విద్యతో రోహిణి..
విద్యతో రోహిణి..

విద్యతో రోహిణి..
ఎందుకే ఇంకా భయపెడతావ్ అని రోహిణి అంటుంది. నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి.. ఈ కల్పన మ్యాటర్‌కే ఇంట్లో ఇలా ఉంటే.. అన్నీ తెలిస్తే ఏం అవుతుందో అని చెబుతున్నాను అంతే అని విద్య అంటుంది. ఇంత జరుగుతుంటే మీ ఆయన కనీసం మాట కూడా మాట్లాడలేదు.. అంతా నీమీదకే తోసేసి సైలెంట్‌గా ఉన్నాడా? అని విద్య అంటుంది. భయపడి ఉంటాడేమో అని రోహిణి అంటుంది. భయపడి కాదు.. తప్పించుకోవడం అంటారు అని విద్య కౌంటర్ వేస్తుంది. మీ ఆయన వేస్ట్.. సొంతంగా ఆలోచించలేడు.. అంత తెలివితేటలు కూడా లేవు అని మనోజ్ పరువుతీస్తుంది విద్య.

ఫోన్ లిఫ్ట్ చేయని రోహిణి..
ఫోన్ లిఫ్ట్ చేయని రోహిణి..

ఫోన్ లిఫ్ట్ చేయని రోహిణి..
విద్య మాటలకు రోహిణికి కోపం వస్తుంది. మీ వాడు వింటే తల్లి మాట ఆ తరువాత నీ మాట వింటాడు. ఇప్పుడు వాళ్ల అమ్మ మాట వింటున్నాడు.. అని విద్య అంటుంది. మరో వైపు రోహిణి ఇంటికి రాలేదని మనోజ్, ప్రభావతి కంగారు పడతారు. మనోజ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా రోహిణి మాత్రం లిఫ్ట్ చేయదు. ఇక ఫ్రెండ్ ఇంట్లో ఉందేమో అని బాలు, మీనా అంటారు. ఆ మాటలు విని విద్యకి ఫోన్ చేస్తాడు మనోజ్. కానీ రోహిణి మాత్రం లిఫ్ట్ చేయొద్దు అని అంటుంది.

మనోజ్ గురించి చెప్పిన విద్య..

మనోజ్ గురించి చెప్పిన విద్య..
ఇక చివరకు మనోజ్ కాల్‌ని విద్య లిఫ్ట్ చేస్తుంది. రోహిణి ఇక్కడ లేదు అని అబద్దం చెబుతుంది. మా అమ్మ ఇంటికి రమ్మంది అని చెప్పండి అని మనోజ్ అంటాడు. అంటే మీ అమ్మ చెబితే గానీ ఫోన్ చేయలేదా? అని మనోజ్‌కి విద్య కౌంటర్ వేస్తుంది. మీ అత్తయ్య రమ్మంద.. ఇంటికి వెళ్లొచ్చు కదే.. అని విద్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావే.. నా బాధ అది కాదే.. వాళ్ల అమ్మ చెబితే గానీ నాకు ఫోన్ చేయాలని అనిపించలేదా? నువ్వు లేకపోతే నాకు ఎలానో ఉంది అని ఒక్క మాట చెప్పొచ్చు కదా.. కాల్ చేయొచ్చు కదా.. కనీసం మెసెజ్ అయినా చేయొచ్చు కదా.. అని రోహిణి బాధపడుతుంది.

విద్య సలహా..

విద్య సలహా..
మనోజ్‌కి పెద్ద పెద్ద చదువులున్నాయి కానీ మెచ్యూరిటీ లేదు.. వాళ్ల అమ్మ చెప్తేనే చేస్తాడు అని రోహిణి అంటాడు. ఈ రోజు రమ్మంది కాబట్టి ఫోన్ చేశాడు.. వదిలేయమంటే వదిలేస్తాడా? మనోజ్‌ది కూడా తప్పుంది.. కానీ నిన్ను ముందుకు నెట్టేశాడు.. తను వెనక్కి వెళ్లిపోయాడు.. రేపు ఇంకేదైనా జరిగితే నిన్ను సపోర్ట్ చేస్తాడన్న నమ్మకం లేదు.. అని విద్య అంటుంది. సరే ఇంటికి పిలుస్తున్నారు కదా వెళ్తాను అని రోహిణి అంటుంది. వెళ్లాక మనోజ్‌ని ఏమీ అనకు.. మీ అత్తకి కోపం వస్తుంది అని విద్య సలహా ఇస్తుంది.

ప్రభావతి ఫైర్..

ప్రభావతి ఫైర్..
అందరూ హాల్లో ఉండగానే రోహిణి గుమ్మం వద్దకు వస్తుంది. అత్తయ్య అని పిలుస్తుంది. ఎవరు అని అడుగుతుంది ప్రభావతి. మీ కోడలిని అని రోహిణి అంటే.. చెప్పకుండా వెళ్లడం, రావడం ఏంటి? ఇదేమైనా బస్టాండ్, రైల్వే స్టేషన్ అనుకుంటున్నావా? ఈ ఇంటి వారసుడు ఒక తప్పు చేశాడు.. ఇంటి పెద్ద కాళ్ల మీద పడి క్షమించమని అడిగాడు.. మొదటి సారిగా ఇప్పుడు ఈ ఇంటి కోడలు మోసం, ద్రోహం చేసింది.. దీన్ని నేను మామూలుగా తీసుకోను.. 45 లక్షలది విషయం కాదు.. ఇంటి పెద్ద నమ్మకం, పరువుకి సంబంధించిన విషయం..

కాళ్లు పట్టుకున్న రోహిణి..

కాళ్లు పట్టుకున్న రోహిణి..
అత్తయ్య గారు కొడితే ఇంట్లోంచి వెళ్లిపోతావా? అని శ్రుతి అడుగుతుంది. అత్తయ్య గారు కొట్టారని కాదు.. నాకు అమ్మ లేదు.. అత్తయ్య గారినే అమ్మ అనుకున్నాను.. ఆవిడకు కొట్టే హక్కుంది అని రోహిణి అంటుంది. ఆపు.. ఇలాంటి మాటల్ని నమ్మే రోజులు పోయాయి అని ప్రభావతి అంటుంది. మొత్తం తప్పు వాడిదేనా? వీడిది లేదా? అని ఇంట్లో వారంతా ప్రభావతిని నిందిస్తారు. ఇక చివరకు కాళ్లు పట్టుకుని క్షమించమని ప్రభావతిని వేడుకుంటుంది రోహిణి. అమ్మా నన్నూ క్షమించు అని మనోజ్ కూడా కాళ్ల మీద పడతాడు. బాగా డబ్బున్న కోడలు కదా బయటకు వెళ్తే ఏం చేస్తావ్.. దీంతో కామాక్షి మాటల్ని గుర్తు చేసుకుంటుంది ప్రభావతి.

 బాలు తీర్పు..

బాలు తీర్పు..
ఇకపై ఏ నిర్ణయం అయినా అందరితో మాట్లాడి తీసుకోవాలని సత్యం అంటాడు. ఇకపై నాకు తెలియకుండా ఏం చేయొద్దు అని ప్రభావతి అంటుంది. ఇక బాలు ఒక తీర్పు ఇస్తాడు. షాప్ పెట్టింది మీ మామ డబ్బులతో కాదు కాబట్టి ఓనర్‌గా తప్పుకోవాలని మనోజ్‌కి చెబుతాడు. నాన్ననే ఓనర్‌గా కూర్చోపెట్టాలి అని బాలు చెబుతాడు. దీంతో మీనా, శ్రుతి చప్పట్లు కొడతారు. మేనేజర్‌గా ఉండి ప్రతీ వారం లెక్కలు చూపెట్టాలని బాలు అంటాడు. ఐడియా సూపర్ అని శ్రుతి, మీనా, రవి అందరూ పొగిడేస్తారు. ప్రభావతి కూడా సైలెంట్ అయిపోతుంది. అమ్మకి మాట్లాడే హక్కు లేదని బాలు అంటాడు.

రోహిణి ఫైర్..

రోహిణి ఫైర్..
ప్రభావతి మాటల్ని రోహిణి తల్చుకుని బాధపడుతుంది. నువ్వు బాగా మాట్లాడావ్.. అమ్మ మనల్ని క్షమించింది అని మనోజ్ అంటాడు. అసలు నిన్ను చూసి జాలి పడాలో, కోప్పడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు అని రోహిణి ఫైర్ అవుతుంది. అసలు నీకు సిగ్గు లేదా?.. నువ్వేం చేయలేదనే తిడుతున్నా.. అత్తయ్య తిడుతుంటే, కొడుతుంటే నువ్వేం చేయవు.. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయవు.. అలాంటి ఆలోచనే రాదా.. అని రోహిణి అంటుంది. నేను మాట్లాడితే ఇంకా గొడవ పెద్దది అవుతుంది అని సైలెంట్‌గా ఉన్నాను అని మనోజ్ అంటాడు.

నేను లేకపోతే నీ పరిస్థితి..

నేను లేకపోతే నీ పరిస్థితి..
అసలు మీ అమ్మ నీకేం చేసిందో చెప్పు.. నేను నీ కోసం చేశాను.. షాప్ పెట్టించాను.. ఓనర్‌ని చేశాను.. ఇంత జరిగినా నాకు సారీ చెప్పలేదు.. అని రోహిణి అంటుంది. నేనేమీ తప్పు చేయలేదు అని మనోజ్ అంటాడు. రెండేళ్లలో నువ్వు షాపుని డెవలప్ చేయలేదు అని అంటుంది రోహిణి. ఇప్పుడు మామయ్యని ఓనర్‌ని చేశారు.. బాలు అలా అంటే మీనా ఎంతలా నవ్విందో తెలుసా.. నాకెంత సిగ్గుగా అనిపించింది.. నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి.. నిన్ను ఎవరు పట్టించుకుంటారు.. నీతో తాళి కట్టించుకున్నా.. అవమానాలు పడతాను.. నీకు నవ్వు బాగుంటే చాలు కదా? అని మనోజ్‌ని చెడామడా తిట్టేస్తూ బ్రెయిన్ వాష్ చేస్తుంది రోహిణి. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *